Home » Stotras » Sri Karthaveeryarjuna Mantram

Sri Karthaveeryarjuna Mantram

Sri Karthaveeryarjuna Mantram

ఓం కార్తవీర్యార్జునో నమః
రాజ బాహు సహస్రవాన్
తస్య స్మరణ మాత్రేణ
గతం నష్టంచ లభ్యతే

Om Karthaveeryarjuno nama
Raja baahu sahasravan
Thasya smarana mathrena
Gatham nashtam cha labhyathe.

ఇంట్లో ఏదైనా వస్తువు పోయినా, ఇంట్లో ఎవరైనా చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోయినా, భార్యా భర్తల మధ్య మనశ్శాంతి కరువయినా ఒకేఒక మంత్రం నిరంతరం స్మరిస్తూ ఉంటే పోయినవన్నీ తిరిగి లభిస్తాయి. ఇంతకీ ఏమిటా మంత్రమని ఆలోచిస్తున్నారా? అదే కార్తవీర్యార్జున మంత్రం. స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్పూర్తిగా స్మరిస్తే పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి. అది డబ్బైనా, మనశ్శాంతి అయినా లేదా ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళయినా మొత్తానికి సమస్య ఏదైనా పరిష్కారం తప్పకుండా లభిస్తుందని చెపుతున్నారు మన పండితులు. ఆ మంత్రం ఈ విధంగా ఉంటుంది.

ఈ మంత్రాన్ని మన మనసులో కోరిక చెప్పుకుని రోజూ పూజ చేసేటప్పుడు స్మరిస్తే పోయినవాన్ని తిరిగి మనకు దక్కుతాయి. ఇంతకీ ఈ కార్తవీర్యార్జునుడు ఎవరూ అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి కుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం యొక్క అంశ. తను చేతిలో ఉండటం వల్లే విష్ణుమూర్తి రాక్షసులని సంహరించ గలుగుతున్నాడు అనే గర్వం ఏర్పడటంతో అది గ్రహించిన స్వామి సుదర్శనుని మనిషిగా పుట్టమని ఆదేశిస్తాడు. కాని భూలోకంలో మనిషిగా పుట్టిన కార్తవీర్యార్జునుడికి చేతులు ఉండవు. చేతులు లేకుండా పుట్టిన ఇతను దత్తాత్రేయుడిని పూజించి వెయ్యి చేతులు కలవాడిగా మారతాడు. అందుకే ఇతనిని సహస్రబాహు అని కూడా అంటారు. అంతేకాదు తనకి కేవలం శ్రీ హరి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో మరణం రాకుండా ఉండేలా వరాన్ని కూడా పొందుతాడు. ఇతను ఎంత బలశాలి అంటే అతి పరాక్రమవంతుడైన రావణాసురుడిని ఒక యుద్ధంలో బంధించి తన రాజ్యానికి తీసుకుని పోయి తరువాత పులస్త్య మహర్షి అభ్యర్ధన విని అతనిని వదిలేస్తాడు.
ఇతని రాజధాని వింధ్య పర్వతముల వద్ద గల మాహిష్మతిపురము. ఇతని పురోహితుడు గర్గ మహర్షి. ఒకసారి కార్తవీర్యుడు వేట కోసమై అడవికి వెళ్తాడు. అక్కడ అలసిపోయి దగ్గరలో ఉన్న జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్ళిన కార్తవీర్యునికి స్వాగతం పలికి జమదగ్ని విశేషమైన విందు పెడతాడు. అంత రుచికరమైన ఆహారపదార్థాలు కామదేనువు సంతతి అయిన గోమాత ద్వారా లభించాయన్న నిజం తెలుసుకుని దానిని తనకి ఇచ్చేయ్యమని అడుగుతాడు, అందుకు జమదగ్ని నిరాకరించటంతో మహర్షి తలను ఖండించి ఆ గోమాతను తీసుకెళ్ళిపోతాడు. ఆశ్రమానికి తిరిగివచ్చిన జమదగ్ని కొడుకు పరాశరుడు విషయం తెలుసుకుని కార్తవీర్యునితో పాటు 21 మంది క్షత్రియులని చంపుతానని శపథం పూనుతాడు. అన్న మాట ప్రకారమే కార్తవీర్యుడిని సంహరిస్తాడు. పరసురాముడు విష్ణుమూర్తి అవతారం కావటంతో కార్తవీర్యుని కోరిక కూడా తీరి మళ్లీ శ్రీహరి చేతిలో సుదర్శునుడిగా మారి, గర్వం విడిచిపెట్టి తన జన్మ సార్ధకం చేసుకుంటాడు.
అలా అతి బలపరాక్రముడు అయిన కార్తవీర్యుడు తనకు లేని చేతులని తపస్సు చేసి పొందటమే కాకుండా శ్రీహరి చేతిలో ప్రాణాలు విడిచి మళ్లీ అతని కుడి చేతిలోనే సుదర్శన చక్రమై ఆ జన్మాంతం నిలిచి ఉంటాడు.
ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః
________________
ఈ రోజంతా ”శ్రీ కార్తవీర్యార్జున మహామంత్ర పఠనం వలన నానావిధ మంచి జరుగును.
చాలా అద్భుతమైన రోజు…….
సుమంతో,సుమంతో,శ్రీ కార్తవీర్యార్జునాయ నమః..
అనే మంత్రముతో..జపిస్తే..
పోయిన వస్తువులు,
ఇంటినుండి వెల్లిపోయిన మనుషులు,
ధర్మముగా రావలసిన పైకము, ఉద్యోగము, వస్తువులు,
పశువులు,
వివాహము కావలసిన వారు,
ఇలా జపిస్తే, తప్పక తిరిగి పొందగలరు,
సమస్య తీవ్రత ను బట్టి జపము ఎక్కువగా చేసుకున్నట్లు అయితే త్వరలో అభీష్ట సిద్ది కల్గును!
కార్త వీర్యార్జునొ నామ రాజా బాహు సహస్రవాన్
తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే….
ఈ పై మంత్రమును ధృడ సంకల్పంతో చేసేవారికి చాలా వేగవంతమైన మంచి ఫలితం తప్పక కలిగితీరుతుంది…..
ఈ మంత్రాన్ని మన మనసులో కోరిక చెప్పుకుని రోజూ పూజ చేసేటప్పుడు స్మరిస్తే పోయినవన్ని తిరిగి మనకు దక్కుతాయి..
కార్తవీర్యార్జునుడు..
ఈతడు కృతవీర్యుని కొడుకు.
హైహయ వంశరాజు.
అసలు నామం అర్జునుడు.
కృతవీర్యుని కొడుకు కాబట్టి కార్తవీర్యార్జునుడుగా వ్యవహారం.
వింధ్య పర్వతానికి దక్షిణంగా వున్న నర్మదా నదీతీరము లోని మాహిష్మతీ పురం ఇతని రాజధాని.
ఇతను దత్తాత్రేయ భక్తుడు.
దత్తాత్రేయుని వరం వల్ల సహస్ర బాహుడవుతాడు.
యుద్ధంలో సర్వదా జయమే కలుగుతుందనీ,
అపార రాజ్యసంపద కలుగుతుందనీ
వరం పొందుతాడు.
ఒక బంగారు రథం కూడా పొందుతాడు.
అది అతన్ని యేవేళప్పుడైనా యెక్కడికైనా తీసుకొని పోగలదు.
విఖ్యాతుడైన ఒక వ్యక్తి చేతులో తప్ప అతనికి మరణం వుండదు.
ఈ ఘన సంపద గురించి విని రావణుడు ఇతని మీదికి దండెత్తి వస్తాడు.
ఆ సమయములో కార్తవీర్యార్జునుడు వన విహారంలో వుంటాడు.నా రాక విని పారిపోయి ఉంటాడని రావణుడు యెగతాళి చేస్తూ వెళ్ళిపోయాడు.
తర్వాత నర్మదా ఒడ్డున శివపూజ చేసుకుంటూండగా కార్తవీర్యార్జునుని సహస్ర బాహువుల్లో చిక్కి నర్మదా నది పొంగి వచ్చి రావణుడి పూజాద్రవ్యాలన్నిటినీ తోసి పారేస్తుంది.(కార్తవీరుడు రావణుణ్ణి
తన వేయి బాహువుల మధ్య ఇరికించి ఊపిరాడకుండా చేశాడని . అప్పుడు పులస్త్యుడువచ్చి రావణుణ్ణి విడిపిస్తాడని ఒక కథనం కూడా వుంది. )
రావణుడికి కోపము వచ్చి దండెత్తి వెళతాడు. కార్తవీర్యార్జునుడు రావణుడిని ఓడించి బంధిస్తాడు. పులస్త్యుడు వచ్చి కార్తవీర్యుని బ్రతిమాలి రావణుడిని విడిపించుకొని తీసుకెళ్తాడు.
ఒకసారి ఆహారనిమిత్తం అగ్ని వస్తాడు.
గిరి నగరారణ్యాన్నంతటినీ భక్షించమని చెప్తాడు.
అక్కడే మైత్రావరుణ ముని యొక్క ఆశ్రమం వుంటుంది.అదీ దగ్ధమైపోతుంది.
మైత్రావరుణుడి కొడుక్కు కోపం వచ్చి కార్తవీర్యుని సహస్ర బాహువులనూ పరశురాముడు ఖండిచివేస్తాడని శాపమిస్తాడు.
అందుకు భయపడి మంచివాడిలాగా ప్రవర్తిస్తుంటాడు
కానీ కొడుకులు దుర్మార్గులై చెడ్డ పనులు చేస్తుంటారు.
ఒకసారి కార్తవీర్యుడు జమదగ్ని ఆశ్రమాన్ని దర్శిస్తాడు. జమదగ్ని భార్య రాజుకీ పరివారానికి సకలమర్యాదలూ చేస్తుంది. ఇంతమందికి ఎలా సపర్యలూ,భోజనాలూ
చేశారని అడుగుతాడు.మా దగ్గర నందినీ ధేనువు (కామధేనువు) వుంది. అది అడిగినవన్నీ ఇస్తుందని జమదగ్ని చెప్తాడు.
ఇటువంటి ధేనువు రాజుదగ్గర వుండాలి. మీ దగ్గర ఎందుకు? నాకిచ్చేయమంటాడు కార్తవీర్యుడు.
దానికి జమదగ్ని నిరాకరిస్తాడు.
దానితో కోపగించిన కార్తవీర్యుడు ఆశ్రమంలోనున్న వనాన్నంతా ధ్వంసం చేసి బలవంతంగా కామధేనువుని తీసికెళ్ళి పోతాడు.
పరశురాముడు ఆశ్రమానికి వచ్చి కార్తవీర్యుని దౌష్ట్యానికి
ఆగ్రహించి అతన్ని వెంటాడి అతని సహస్రబాహువులూ ఖండించి అతన్ని వధిస్తాడు.
ఆ తర్వాత కార్తవీర్యుని కొడుకులు పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో వచ్చి జందగ్నిని చంపేసి వెళ్తారు.
పరశురాముడు ఆశ్రమానికి తిరిగివచ్చి విషయము తెలుసుకొని క్షత్రియులందరినీ నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఇరవైఒక్క మార్లు రాజులందరినీ సంహరించి ఆ నెత్తురుతో అయిదు మడుగులు చేసి పితృ తర్పణం చేస్తాడు.
ఆ ప్రదేశమే శమంతపంచకమైంది.
ఆ తర్వాత కురుపాండవులు అక్కడ యుద్ధం చేస్తారు. అదే కురుక్షేత్రం.

Pradosha Stotra Ashtakam

ప్రదోష స్తోత్రాష్టకం (Pradosha Stotra Ashtakam) సత్యం బ్రవీమి పరలోకహితం బ్రవ్రీమి సారం బ్రవీమ్యుపనిషద్ధృదయం బ్రవీమి | సంసారముల్బణమసారమవాప్య జంతోః సారోzయమీశ్వరపదాంబురుహస్య సేవా || 1 || యే నార్చయంతి గిరిశం సమయే ప్రదోషే యే నార్చితం శివమపి ప్రణమంతి చాన్యే...

Dakaradi Sri Durga Sahasranama Stotram

దకారాది శ్రీ దుర్గా సహస్ర నామ స్తోత్రం (Dakaradi Sri Durga Sahasranama Stotram) శ్రీ దేవ్యువాచ । మమ నామ సహస్రం చ శివ పూర్వవినిర్మితమ్ । తత్పఠ్యతాం విధానేన తథా సర్వం భవిష్యతి ॥ ఇత్యుక్త్వా పార్వతీ దేవి...

Sri Gowri Astottara Satanamavali

శ్రీ గౌరీ అష్టోత్తర శతనామావళి (Sri Gowri Astottara Satanamavali) ఓం గౌర్యై నమః ఓం గణేశజనన్యై నమః ఓం గుహాంబికాయై నమః ఓం జగన్నేత్రే నమః ఓం గిరితనూభవాయై నమః ఓం వీరభధ్రప్రసవే నమః ఓం విశ్వవ్యాపిణ్యై నమః ఓం...

Deva Krutam Sankata Ganesha Stotram

దేవ కృతం సంకటనాశన గణేశ స్తోత్రం (Deva Krutam Sankata Ganesha Stotram ) నమో నమస్తే పరమార్థరూప నమో నమస్తే ఖిలకారణాయ | నమో నమస్తే ఖిలకారకాయ సర్వేంద్రియాణామధివాసినేపి || 1 || నమో నమో భూతమయాయ తేజస్తు నమో...

More Reading

Post navigation

error: Content is protected !!