శ్రీ సుబ్రహ్మణ్య మంగళపంచరత్న స్తోత్రం (Sri Subrahmanya Mangala Pancharatna Stotram) 1) సచ్చిదానందరూపాయ నిర్గుణాయ గుణాత్మనే ఉమాశివాత్మజాయ సుబ్రహ్మణ్యాయ మంగళం || 2) శక్త్యాయుధధరాయ పరమహంసస్వరూపిణే ప్రణవార్థబోధకాయ కార్తికేయాయ మంగళం || 3) తారకాసురహరాయ సంసారార్ణవతారిణే గంగాపావకాత్మజాయ శరవణభవాయ మంగళం || 4) షణ్మాతృకాత్మజాయ భస్మత్రిపుండ్రధారిణే నానారత్నభూషితాయ గజాననానుజాయ మంగళం || 5) మహాతేజోమయాయ మాయాతీతస్వరూపిణే సంతానప్రదరూపాయ స్వామినాథాయ మంగళం || సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దివ్యచరణారవిందార్పణమస్తు


