Home » Stotras » Sri Lalitha Pancharatnam

Sri Lalitha Pancharatnam

శ్రీ లలితా పంచరత్నం (Sri Lalitha Pancharatnam)

Sri lalltha tripura sundari devi

ప్రాతఃస్మరామి లలితావదనారవిన్దం
బిమ్బాధరం పృథులమౌక్తికశొభినాసమ్|
ఆకర్ణదీర్ఘనయనం మణికుణ్డలాఢ్యం
మన్దస్మితం మృగమదొజ్జ్వలఫాలదేశమ్ ||1||

దొండ పండు వంటి క్రింది పేదవి, పేద్ద ముత్యముతొ శొభించు చున్న ముక్కు, చేవులవరకు వ్యాపించిన కన్నులు, మణి కుండలములు, చిరున్నవ్వు, కస్తూరి తిలకముతొ ప్రకాశించు నుదురు కలిగిన లలితా దేవి ముఖారవిందమును ప్రాతః కాలమునందు స్మరించుచున్నాను.

ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం
రక్తాఙ్గుళీయలసదఙ్గుళిపల్లవాఢ్యామ్|
మాణిక్యహేమవలయాఙ్గదశొభమానాం
పుణ్డ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానామ్ ||2||

ఏర్రని రత్నములు కూర్చిన ఉంగరములు ధరించిన వ్రేళ్లు అను చిగురుటాకులు కలదీ, మాణిక్యములు పొదిగిన కంకణములతొ శొభించుచున్నదీ, చేరకువిల్లు-పుష్పబాణము-అంకుశము ధరించినదీ అగు లలితాదేవి భుజములను కల్పలతను ప్రాతః కాలమునందు సేవించుచున్నాను.

ప్రాతర్నమామి లలితాచరణారవిన్దం
భక్తేష్టదాననిరతం భవసిన్ధుపొతమ్|
పద్మాసనాదిసురనాయకపూజనీయం
పద్మాఙ్కుశధ్వజసుదర్శనలాఞ్ఛనాఢ్యమ్ ||3||

భక్తులకొరికలను ఏల్లప్పుడు తీర్చునదీ, సంసార సముద్రమును దాటించుతేప్పయైనదీ, బ్రహ్మ మొదలగు దేవనాయకులచే పూజింపబడునదీ, పద్మము-అంకుశము-పతాకము-చక్రము అను చిహ్నములతొ ప్రకాశించుచున్నదీ అగు లలితాదేవి పాదపద్మమును ప్రాతః కాలమునందు నమస్కరించుచున్నాను.

ప్రాతఃస్తువే పరశివాం లలితాం భవానీం
త్రయ్యన్తవేద్యవిభవాం కరుణానవద్యామ్|
విశ్వస్య సృష్టివిలయస్థితిహేతుభూతాం
విద్యేశ్వరీం నిగమవాఙ్మనసాతిదూరామ్ ||4||

వేదాంతములచే తేలియబడు వైభవము కలదీ, కరుణచే నిర్మలమైనదీ, ప్రపంచము యొక్క సృష్టి-స్థితి-లయలకు కారణమైనదీ,విద్యలకు అధికారణీయైనదీ, వేద వచనములకు మనస్సులకు అందనిదీ, పరమేశ్వరియగు లలితాభవానీ దేవిని ప్రాతః కాలము నందు స్తుతించుచున్నాను.

ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి|
శ్రీశామ్భవీతి జగతాం జననీ పరేతి
వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి || 5 ||

ఒ లలితాదేవి| కామేశ్వరి-కమల-మహేశ్వరి-శ్రేఏశాంభవి-జగజ్జనని-వాగ్దేవత-త్రిపురేశ్వరి అను నీ నామములను ప్రాతఃకాలము నందు జపించుచున్నాను.

యః శ్లొకపఞ్చకమిదం లలితామ్బికాయాః
సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే|
తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా
విద్యాం శ్రియం విమలసౌఖ్యమనన్తకీర్తిమ్

సౌభాగ్యము నిచ్చునదీ,సులభమైనదీ అగు లలితా పంచరత్నమును ప్రాతఃకాలము నందు ఏవడు పఠించునొ వానికి లలితాదేవి శీఘ్రముగా ప్రసన్ను రాలై విద్యను,సంపదను,సుఖమును,అంతులేని కీర్తిని ప్రసాదించును.

Sri Vindhya Vasini Stotram

శ్రీ వింధ్య వాసిని స్తోత్రం (Sri Vindhya Vasini Stotram) నిశుంభ శుంభ మర్దినీ ప్రచండ ముండ ఖండనీ వనే రణే ప్రకాశినీ భజామి వింధ్యవాసినీ || 1 || త్రిశూల ముండ ధారిణీ ధరా విఘాత హారిణీ గృహే గృహే...

Ksheerabdhi Dwadasi Vratam

క్షీరాబ్ధి ద్వాదశి వ్రత కథ (Ksheerabdhi Dwadasi Vratam) పూర్వము దర్మరాజు రాజ్యము పోగొట్టుకొని తమ్ములతో గూడి ద్వైతవనమందుండగా, నచ్చటికి అనేక ఋషులతోఁ గూడి వ్యాసులవారు వచ్చిరి. అట్లు వచ్చిన వ్యాసుని గని ధర్మరాజు తగుపూజలు సలిపి కూర్చొండబెట్టి తానును వారి...

Sri Prathyangira Devi Stotram

Sri Prathyangira Stotram (శ్రీ ప్రత్యంగిరా దేవీ స్తోత్రం) ఓం మాతర్మేమదు కైట భగ్ని మహిషా ప్రాణాపహారోధ్యమే, హేలా నిర్మిత ధూమ్ర లోచన నవదేహే చండముండార్దినీ నిషేషీ కృత రక్త భీజ దనుజే నిత్యే నిషుమ్బాపహే షుమ్భాని ధ్వంసిని సంహరారు: దురితం...

Sri Kalaratri Dwadasa Nama Stotram

శ్రీ కాళరాత్రి ద్వాదశ నామ స్తోత్రం (Sri Kalaratri Dwadasa Nama Stotram) ప్రధమం కారమల రాత్రీ చ ద్వితీయం వ్యఘ్రవాహినీం తృతీయం శుభధాత్రీంశ్చ చతుర్ధం మృత్యురూపిణీమ్ పంచమం సహస్రారాంతస్తాం షష్టం నిధదాయినీం సప్తమం ఖడ్గదరాంశ్చ అష్టమం కల్పాంతకారిణీం నవమం అజ్ఞాన...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!