Home » Stotras » Sri Dakshinamurthi Varnamala Stotram

Sri Dakshinamurthi Varnamala Stotram

శ్రీ దక్షిణామూర్తి వర్ణమాలా స్తోత్రం  (Sri Dakshinamurthi Varnamala Stotram)

ఓమిత్యేతద్యస్య బుధైర్నామ గృహీతం యద్భాసేదం భాతి సమస్తం వియదాది
యస్యాజ్ఞాతః స్వస్వపదస్థా విధిముఖ్యాస్తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి || ౧ ||

నమ్రాంగాణాం భక్తిమతాం యః పురుషార్థాన్దత్వా క్షిప్రం హంతి చ తత్సర్వవిపత్తీః
పాదాంభోజాధస్తనితాపస్మృతిమీశం తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి || ౨ ||

మోహధ్వస్త్యై వైణికవైయాసికిముఖ్యాః సంవిన్ముద్రాపుస్తకవీణాక్షగుణాన్యమ్
హస్తాంభోజైర్బిభ్రతమారాధితవంతస్తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి || ౩ ||

భద్రారూఢం భద్రదమారాధయితృణాం భక్తిశ్రద్ధాపూర్వకమీశం ప్రణమంతి
ఆదిత్యా యం వాంఛితసిద్ధ్యై కరుణాబ్ధిం తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి || ౪ ||

గర్భాంతఃస్థాః ప్రాణిన ఏతే భవపాశచ్ఛేదే దక్షం నిశ్చితవంతః శరణం యమ్
ఆరాధ్యాంఘ్రిప్రస్ఫురదంభోరుహయుగ్మం తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి || ౫ ||

వక్త్రం ధన్యాః సంసృతివార్ధేరతిమాత్రాద్భీతాః సంతః పూర్ణశశాంకద్యుతి యస్య
సేవంతేజ్ధ్యాసీనమనంతం వటమూలం తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి || ౬||

తేజఃస్తోమైరంగదసంఘట్టితభాస్వన్మాణిక్యోత్థైర్భాసితవిశ్వో రుచిరైర్యః
తేజోమూర్తిం ఖానిలతేజఃప్రముఖాబ్ధిం తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి || ౭ ||

దధ్యాజ్యాదిద్రవ్యకకర్మాణ్యఖిలాని త్యక్త్వా కాంక్షాం కర్మఫలేష్వత్ర కరోతి
యజ్జిజ్ఞాసాం రూపఫలార్థీ క్షితిదేవస్తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి || ౮ ||

క్షిప్రం లోకే యం భజమానః పృథుపుణ్యః ప్రధ్వస్తాధిః ప్రోజ్ఝితసంసృత్యఖిలార్తిః
ప్రత్యగ్భూతం బ్రహ్మ పరం సంరమతే యస్తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి || ౯ ||

ణానేత్యేవం యన్మనుమధ్యస్థితవర్ణాన్భక్తాః కాలే వర్ణగృహీత్యై ప్రజపంతః
మోదంతే సంప్రాప్తసమస్తశ్రుతితంత్రాస్తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి || ౧౦ ||

మూర్తిశ్ఛాయానిర్జితమందాకినికుందప్రాలేయాంభోరాశిసుధాభూతిసురేభా
యస్యాభ్రాభా హాసవిధౌ దక్షశిరోధిస్తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి || ౧౧ ||

తప్తస్వర్ణచ్ఛాయజటాజూటకటాహప్రోద్యద్వీచీవల్లివిరాజత్సురసింధుమ్
నిత్యం సూక్ష్మం నిత్యనిరస్తాఖిలదోషం తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి || ౧౨ ||

యేన జ్ఞాతేనైవ సమస్తం విదితం స్యా ద్యస్మాదన్యద్వస్తు జగత్యాం శశశృంగమ్
యం ప్రాప్తానాం నాస్తి పరం ప్రాప్యమనాదిం తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి || ౧౩ ||

మత్తో మారో యస్య లలాటాక్షిభవాగ్నిస్ఫూర్జత్కీలప్రోషితభస్మీకృతదేహః
తద్భస్మాసీద్యస్య సుజాతః పటవాసస్తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి || ౧౪ ||

హ్యంభోరాశౌ సంసృతిరూపే లుఠతాం తత్పారం గంతుం యత్పదభక్తిర్దృఢనౌకా
సర్వారాధ్యం సర్వగమానందపయోనిధిం తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి || ౧౫ ||

మేధావీ స్యాదిందువతంసం ధృతవీణం కర్పూరాభం పుస్తకహస్తం కమలాక్షమ్
చిత్తే ధ్యాయన్యస్య వపుర్ద్రాంనిమిషార్ధం తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి || ౧౬ ||

ధామ్నాం ధామ ప్రౌఢరుచీనాం పరమం యత్సూర్యాదీనాం యస్య స హేతుర్జగదాదేః
ఏతావాన్యో యస్య న సర్వేశ్వరమీడ్యం తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి || ౧౭ ||

ప్రత్యాహారప్రాణనిరోధాదిసమర్థైర్భక్తైర్దాంతైః సంయతచిత్తైర్యతమానైః
స్వాత్మత్వేన జ్ఞాయత ఏవ త్వరయా యస్తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి || ౧౮ ||

జ్ఞాంశీభూతాన్ప్రాణిన ఏతాన్ఫలదాతా చిత్తాంతఃస్థః ప్రేరయతి స్వే సకలేజ్పి
కృత్యే దేవః ప్రాక్తనకర్మానుసరః సంస్తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి || ౧౯ ||

ప్రజ్ఞామాత్రం ప్రాపితసంబిన్నిజభక్తం ప్రాణాక్షాదేః ప్రేరయితారం ప్రణవార్థమ్
ప్రాహుః ప్రాజ్ఞా విదితానుశ్రవతత్త్వాస్తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి || ౨౦ ||

యస్యాంజ్ఞానాదేవ నృణాం సంసృతిబోధో యస్య జ్ఞానాదేవ విమోక్షో భవతీతి
స్పష్టం బ్రూతే వేదశిరో దేశికమాద్యం తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి || ౨౧ ||

ఛన్నేజ్విద్యారూపపటేనైవ చ విశ్వం యత్రాధ్యస్తం జీవపరేశత్వమపీదమ్
భానోర్భానుష్వంబువదస్తాఖిలభేదం తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి || ౨౨ ||

స్వాపస్వప్నౌ జాగ్రదవస్థాపి న యత్ర ప్రాణశ్వేతః సర్వగతో యః సకలాత్మా
కూటస్థో యః కేవలసచ్చిత్సుఖరూపస్తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి || ౨౩ ||

హా హేత్యేవం విస్మయమీయుర్మునిముఖ్యా జ్ఞాతే యస్మిన్స్వాత్మతయానాత్మవిమోహః
ప్రత్యగ్భూతే బ్రహ్మణి యాతః కథమిత్థం తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి || ౨౪ ||

యైషా రమ్యైర్మత్తమయూరాభిధవృత్తైరాదౌ క్లృప్తా యన్మనువర్ణైర్మునిభంగీ
తామేవైతాం దక్షిణవక్త్రః కృపయాసావూరీకుర్యాద్దేశికసమ్రాట్ పరమాత్మా || ౨౫ ||

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రజకాచార్యస్య శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య

శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ శ్రీదక్షిణామూర్తివర్ణమాలాస్తోత్రం సంపూర్ణం

శంకరులు దక్షిణామూర్తిపై చాలా స్తోత్రములు రచించారు. అందులో దక్షిణామూర్తి చతుర్వింశతి వర్ణమాలా స్తోత్రం ఒకటి. వర్ణమాలా స్తోత్రం అంటే దక్షిణామూర్తి మంత్రం గాయత్రీ మంత్రం వలె 24 అక్షరాలతో కూడుకొన్నది. దక్షిణామూర్తి నామాన్ని నిత్యం మననం చేసుకుంటే అదే మంత్రం అవుతుంది. ఆ మంత్రశక్తిని అందరికీ అందజేయడానికి శంకరులు ఆ మంత్రంలోని ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క శ్లోకాన్ని రచించారు.

మొత్తం 24అక్షరములతో 24శ్లోకములు అందించారు. ఈ శ్లోకములు శుచిగా స్వామికి నమస్కారం చేసుకొని నిత్యానుష్ఠానంగా చేయవచ్చు. ఇది మంత్ర గర్భితంగా సమకూర్చారు. భక్తికి సంబంధించిన స్తోత్రం ఈ చతుర్వింశతి వర్ణమాలా స్తోత్రం. అయితే ఇందులో ఆత్మజ్ఞానం లేదు అనడం మహాపాపం. చతుర్వింశతి వర్ణమాలా స్తోత్రంలో భక్తిని ప్రధానంగా చూపిస్తూ ఆత్మజ్ఞానాన్ని నిబిడీకృతం చేశారు. జ్ఞానభక్తి కలిగినవారు శంకరుల వారు.

Sri Kalabhairava Dasanama Stotram

శ్రీ కాలభైరవ దశనామ స్తోత్రం (Sri Kala bhairava Dasa nama Stotram) కపాలీ కుండలీ భీమో భైరవో భీమవిక్రమః వ్యాలోపవీతీ కవచీ శూలీ శూర: శివప్రియా: | ఏతాని దశ నామాని ప్రాతరుత్ధాయ యః పటేత్ భైరవీ యాతనానస్యాద్ భయం...

Pradosha Stotram

ప్రదోష స్తోత్రం (Pradosha Stotram) జయ దేవ జగన్నాథ జయ శంకర శాశ్వత । జయ సర్వసురాధ్యక్ష జయ సర్వసురార్చిత ॥1॥ జయ సర్వగుణాతీత జయ సర్వవరప్రద ॥ జయ నిత్య నిరాధార జయ విశ్వంభరావ్యయ ॥2॥ జయ విశ్వైకవంద్యేశ జయ...

Sri Pundarika Kruta Tulasi Stotram

శ్రీ పుండరీక కృత తులసీ స్తోత్రం (Sri Pundarika Kruta Tulasi Stotram) జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే | యతో బ్రహ్మాదయో దేవాః సృష్టిస్థిత్యంతకారిణః || నమస్తులసి కల్యాణి నమో విష్ణుప్రియే శుభే | నమో మోక్షప్రదే దేవి నమః...

Sarpa Prarthana

సర్ప ప్రార్ధనా (Sarpa Prarthana) బ్రహ్మ లోకేచ సర్పః శేషనాగ పురోగమః | నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా || 1 || విష్ణు లోకే చ యేసర్పః వాసుకి ప్రముకాస్చయే: నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా ||...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!