Home » Stotras » Sri Kanakadhara Stotram

Sri Kanakadhara Stotram

కనకధారా స్తోత్రం (Kanakadhara Stotram)

అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ
భృఙ్గాఙ్గనేవ ముకుళాభరణం తమాలం |
అంగీకృతాఖిల విభూతిర పాంగలీలా
మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః || 1 ||

భావం: మొగ్గలతో నిండియున్న చీకటి కానుగ చెట్టుకు ఆడుతుమ్మెదలు ఆభరణములైనట్లు, పులకాంకురములతోడి శ్రీహరి శరీరము నాశ్రయించినదియు, సకలైశ్వర్యములకు స్థానమైనదియు అగు లక్ష్మీదేవి యొక్క చక్కని క్రీగంటిచూపు నాకు శుభములను ప్రసాదించుగాక…

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని |
మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః || 2 ||

భావం: పెద్ద నల్లకలువపైనుండు ఆడుతుమ్మెదవలె శ్రీహరి ముఖమునందు ప్రేమ లజ్జలచే ముందుకు వెనుకకు ప్రసరించుచున్న సాగర సంజాత అయిన యా లక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షము నాకు సంపదను ప్రసాదించుగాక

ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం
ఆనందకంద మనిమేషమనంగతంత్రం |
ఆకేకర స్థిత కనీనికపక్ష్మనేత్రం
భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః || 3 ||

భావం: నిమీలిత నేత్రుడును, ఆనందమునకు కారణభూతుడు అయిన మురారిని సంతోషముతో గూడుటచే, ఱెప్పపాటు లేనిదియు, కామ వశమైనదియు, కుచితమైన కనుపాపలును, ఱెప్పలును గలదియు అగు లక్ష్మీదేవి యొక్క కటాక్షము నాకు సంపద నొసంగును గాక.

బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీలమయీ విభాతి |
కామప్రదా భగవతోపి కటాక్షమాలా
కళ్యాణమావహతు మే కమలాలయాయాః || 4 ||

భావం: భగవంతుడగు శ్రీహరికిని కామప్రదయై, అతని వక్షస్థలమందలి కౌస్తుభమున ఇంద్రనీలమణిమయమగు హారావళివలె ప్రకాశించుచున్న కమలాలయ అగు లక్ష్మీదేవి యొక్క కటాక్షమాల నాకు శుభమును చేకూర్చుగాక

కాలాంబుదాళి లలితోరసి కైటభారేః
ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ |
మాతుస్సమస్త జగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః || 5 ||

భావం: కారుమబ్బులపై తోచు మెరుపుతీగ వలె నీలమేఘశ్యాముడగు విష్ణుదేవుని వక్షస్థలమందు ప్రకాశించుచున్న, ముల్లోకములకును తల్లియు, భార్గవ నందనయు అగు ఆ లక్ష్మీదేవి నాకు శుభముల నిచ్చుగాక..

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన |
మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం
మందాలసం చ మకరాలయకన్యకాయాః || 6||

భావం: ఏ క్రీగంటి ప్రభావమున మన్మధుడు మాంగల్యమూర్తియగు మధుసూదనుని యందు ముఖ్యస్థానమును ఆక్రమించెనో అట్టి క్షీరాబ్ధి కన్య అగు లక్ష్మీదేవి యొక్క మందమగు నిరీక్షము నాయందు ప్రసరించునుగాక

విశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్షం
ఆనందహేతురధికం మురవిద్విషోపి |
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం
ఇందీవరోదరసహోదరమిందిరాయాః || 7 ||

భావం: సమస్త దేవేంద్ర పదవి నీయగలదియు, మురవైరియగు విష్ణువు సంతోషమునకు కారణమైనదియు, నల్లకలువలను పోలునదియు అగు లక్ష్మీదేవి కటాక్షము కొంచెము నాపై నిలిచియుండును గాక

ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర
దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే |
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః || 8 ||

భావం: పద్మాసని అయిన లక్ష్మీదేవి దయార్ధ దృష్టివలననే విశిష్టమతులగు హితులు సులభముగా ఇంద్రపదవిని పొందుచున్నారు. వికసిత కమలోదర దీప్తిగల ఆ దృష్టి, కోరిన సంపదను నాకు అనుగ్రహించుగాక

దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా
అస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే |
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః || 9 ||

భావం: శ్రీమన్నారాయణుని దేవి అయిన లక్ష్మీదేవి దృష్టియనెడు మేఘము దయావాయు ప్రేరితమై, నా యందు చాలాకాలముగా ఉన్న దుష్కర్మ తాపమును తొలగించి, పేదవాడ ననెడి విచారముతో ఉన్న చాతకపు పక్షి అగు నాపై ధనవర్ష ధారను కురిపించునుగాక.

గీర్దేవ తేతి గరుడధ్వజసుందరీతి
శాకంభరీతి శశిశేఖరవల్లభేతి |
సృష్టిస్థితి ప్రళయకేలిషు సంస్థితాయై
తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై || 10 ||

భావం: వాగ్దేవత అనియు, గరుడధ్వజ సుందరి అనియు, శాకంభరి అనియు, శశిశేఖర వల్లభా అనియు పేరు పొందినదియు, సృష్టి, స్థితి, లయముల గావించునదియు, త్రిభువనములకు గురువైన విష్ణుదేవుని పట్టమహిషి అగు లక్ష్మీదేవికి నమస్కారము.

శ్రుత్యై నమోస్తు శుభకర్మఫలప్రసూత్యై
రత్యై నమోస్తు రమణీయగుణార్ణవాయై |
శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయై
పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవల్లభాయై || 11 ||

భావం: పుణ్యకార్యములు ఫలము నొసగు శ్రుతిరూపిణియు, సౌందర్య గుణసముద్ర యగు రతిరూపిణియును, పద్మనివాసిని అగు శక్తి రూపిణియు అగు లక్ష్మీదేవికి నమస్కారము.

నమోస్తు నాళీకనిభాననాయై
నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై |
నమోస్తు సోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై || 12 ||

భావం: పద్మమును బోలిన ముఖము గలదియు, క్షీరసముద్ర సంజాతయు, చంద్రునికిని, అమృతమునకు తోబుట్టువును, నారాయణుని వల్లభయును అగు లక్ష్మీదేవికి నమస్కారము.

నమోస్తు హేమాంబుజ పీఠికాయై
నమోస్తు భూమండల నాయికాయై |
నమోస్తు దేవాదిదయాపరాయై
నమోస్తు శార్ఙ్గాయుధ వల్లభాయై || 13 ||

భావం: బంగారు పద్మము ఆసనముగా గలదియును, భూమండలమునకు నాయిక అయినదియును, దేవతలలో దయయే ముఖముగా గలదియును, విష్ణువునకు ప్రియురాలును అయిన లక్ష్మీదేవికి నమస్కారము.

నమోస్తు దేవ్యై భృగునందనాయై
నమోస్తు విష్ణోరురసిస్థితాయై |
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోస్తు దామోదరవల్లభాయై || 14 ||

భావం: భృగుమహర్షి పుత్రికయును, దేవియు, విష్ణు వక్షస్థల వాసినియు, కమలాలయము, విష్ణువుకు ప్రియురాలును అయిన లక్ష్మీదేవికి నమస్కారము

నమోస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోస్తు భూత్యై భువనప్రసూత్యై |
నమోస్తు దేవాదిభిరర్చితాయై
నమోస్తు నందాత్మజవల్లభాయై || 15 ||

భావం: తామరపువ్వు వంటి కన్నులు గలదియు, దేదీప్యమానమైనదియు, లోకములకు తల్లియు, దేవతలచే పూజింపబడునదియు, విష్ణువుకు ప్రియురాలు అగు లక్ష్మీదేవికి నమస్కారము..

సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి |
త్వద్వందనాని దురితాహరణోద్యతాని
మామేవ మాతరనిశం కలయంతు మాన్యే || 16 ||

భావం: పద్మములవంటి కన్నులు గల పూజ్యురాలవగు నోయమ్మా, నిన్ను గూర్చి చేసిన నమస్కృతులు సంపదను కల్గించునవి, సకలేంద్రియములకును సంతోషమును కలిగించునవి, చక్రవర్తిత్వము నొసగ గలవి, పాపములను నశింపచేయునవి, ఓ తల్లీ అవి ఎల్లపుడును నన్ను అనుగ్రహించుగాక

యత్కటాక్ష సముపాసనావిధిః
సేవకస్య సకలార్థసంపదః |
సంతనోతి వచనాంగమానసైః
త్వాం మురారిహృదయేశ్వరీం భజే || 17 ||

భావం: ఏ దేవి యొక్క కటాక్ష వీక్షణమున సేవకులకు సకలార్ధ సంపదలు లభించునో, అట్టి మురారి హృదయేశ్వరి యగు లక్ష్మీదేవిని మనోవాక్కాయములచే త్రికరణశుద్ధిగా సేవింతును.

సరసిజనిలయే సరోజహస్తే
ధవళతమాంశుకగంధమాల్యశోభే |
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ || 18 ||

భావం: కమలములవంటి కన్నులు గల ఓ తల్లీ, చేతియందు పద్మమును ధరించి, తెల్లని వస్త్రము, గంధము, పుష్పమాలికలతో ప్రకాశించుచున్న భగవతీ, విష్ణుప్రియా, మనోఙ్ఞురాలా, ముల్లోకములకును సంపదను ప్రసాదించు మాతా, నన్ననుగ్రహింపుము

దిగ్ఘస్తిభిః కనక కుంభముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీమ్ |
ప్రాతర్నమామి జగతాం జననీమశేష
లోకాధినాథగృహిణీ మమృతాబ్ధిపుత్రీమ్ || 19 ||

భావం: దిగ్గజములు కనకకుంభములతో తెచ్చిన వినిర్మల ఆకాశ జలములచే అభిషేకించబడిన శరీరము కలదియు, లోకములకు జననియు, విశ్వప్రభువగు విష్ణుమూర్తి గృహిణియు, క్షీరసాగర పుత్రియు అగు లక్ష్మీదేవికి ఉదయమున నమస్కరించుచున్నాను.

కమలే కమలాక్ష వల్లభేత్వం
కరుణాపూరతరంగితైరపాంగైః |
అవలోకయ మామకించనానాం
ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః || 20 ||

భావం: శ్రీహరి వల్లభురాలివైన ఓ లక్ష్మీదేవి, దరిద్రులలో ప్రధముడను, నీ దయకు తగిన పాత్రమును అగు నన్ను నీ కరుణాకటాక్షముతో చూడుము.

దేవి ప్రసీద జగదీశ్వరి లోకమాతః
కళ్యాణదాత్రి కమలేక్షణజీవనాథే |
దారిద్ర్యభీతిహృదయం శరణాగతం మామ్
ఆలోకయ ప్రతిదినం సదయైరపాంగైః || 21 ||

స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం |
రమామ్ గుణాధికా గురుతరభాగ్యభాగినో
భవంతి తే భువి బుధభావితాశయాః || 22 ||

ఎవరీ స్తోత్రములచే ప్రతిరోజు వేదరూపిణియు, త్రిలోకమాతయు అగు లక్ష్మీదేవిని స్తుతింతురో వారు విద్వాంసులకే భావితాశయులై, గుణాధికులై అత్యంత భాగ్యశాలురగుచున్నరు.

శ్రీ శంకరాచార్యులచే రచించబడిన కనకధారాస్తోత్రమును ప్రతిరోజు, త్రికాలములందు పఠించువారు కుబేరునితో సమానుడగును

శ్రీ శంకర భవత్పాదులు ఒకరోజు భిక్షకు వెళ్ళినపుడు కడు బీదరాలైన ఒక అవ్వ స్వామికి భిక్ష ఇవ్వడానికి తనవద్దయేమిలేకపోయేసరికి బాధతో, ఇల్లంతా వెతికితే ఒక ఉసిరిగకాయ మాత్రమే ఆమెకి దొరికింది. స్వామి నా దగ్గర బిక్ష ఇవ్వడానికి ఈ ఉసిరి మాత్రమే ఉంది. అని గురువుకి సమర్పించింది. ఆమె భక్తికి ఆచార్యుల హృదయం ద్రవించి, ఆమె దారిద్ర్యాన్ని తొలగించడానికి లక్ష్మీదేవిని స్తుతించారు. లక్ష్మీదేవి ప్రసన్నయై, స్వామి కోరినట్లు, ఆ ముసలమ్మ ఇంట కనకవర్షం కురిపించింది. ఆ స్తోత్రమే కనకధారస్తోత్రం.
ఈ స్తోత్రమును పఠించినవారికి లక్ష్మీదేవి ప్రసన్నురాలై సర్వాభీష్ట సిద్ధి కలుగచేస్తుంది.

Sri Indrakshi Stotram

శ్రీ ఇంద్రాక్షీ స్తోత్రం (Sri Indrakshi Stotram) అస్యశ్రీ ఇంద్రాక్షీ స్తోత్ర మంత్రస్య | శచీ పురందర బుషిః | అనుష్టుప్‌ ఛందః | శ్రీ మదింద్రాక్షీ దేవతా | మహా లక్ష్మీ ఇతి బీజం | భువనేశ్వరీతి శక్తిః |...

Sri Rama Pancharatna Stotram

శ్రీ రామపంచరత్నం (Sri Rama Pancharatna Stotram) కంజాతపత్రాయత లోచనాయ కర్ణావతంసోజ్జ్వల కుండలాయ కారుణ్యపాత్రాయ సువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ || 1 || విద్యున్నిభాంభోద సువిగ్రహాయ విద్యాధరైస్సంస్తుత సద్గుణాయ వీరావతారయ విరోధిహర్త్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ || 2 || సంసక్త దివ్యాయుధ...

Sri Vinayaka Stuthi

శ్రీ వినాయక స్తుతి (Sri Vinayaka Stuthi) మూషికవాహన మోదకహస్త చామరకర్ణ విలమ్బితసూత్ర వామనరూప మహేశ్వరపుత్ర విఘ్నవినాయక పాద నమస్తే దేవదేవసుతం దేవం జగద్విఘ్నవినాయకమ్ హస్తిరూపం మహాకాయం సూర్యకోటిసమప్రభమ్ వామనం జటిలం కాన్తం హ్రస్వగ్రీవం మహోదరమ్ ధూమ్రసిన్దూరయుద్గణ్డం వికటం ప్రకటోత్కటమ్ దన్తపాణిం...

Sri Shiva Aksharamala stotram

శ్రీ శివ అక్షరమాల స్తోత్రం (Sri Shiva Aksharamala stotram) అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాదిప్రియ సుందరరూప సురేశ శివ ఈశ సురేశ మహేశ...

More Reading

Post navigation

error: Content is protected !!