శ్రీ  దుర్గా పంచరత్న స్తోత్రం (Sri Durga Pancharatnam Stotram)

తే ధ్యాన యోగానుగతాపస్యన్
త్వామేవ దేవీం స్వగునైర్నిగూడాం
త్వమేవ శక్తిహి పరమేశ్వరస్య
మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి || 1 ||

భావం : ఓ సర్వాధిష్ఠానేశ్వరీ! ఓ మోక్షప్రదాత్రీ! నిరంతరము ధ్యానయోగమునందు మునులు యోగులు మున్నగువారు సత్వరజస్తమో గుణములచే వ్యక్తముకాకుండగానున్న సకలదేవతాస్వరూపిణియగు నిన్నే చూచుచున్నారు. ఆ పరమేశ్వరునియొక్క శక్తివి కూడా నీవే. నన్ను రక్షించు.

దేవాత్మ శక్తీహీ శ్రుతివాక్య గీత
మహర్షిలోకస్య పుర: ప్రసన్న
గుహపరం వ్యోమ సద ప్రతిష్ఠ
మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి || 2 ||

భావం : ఓ సర్వేశ్వరీ! మోక్షధాత్రి ! నీవు దివ్యమగు ఆత్మశక్తిని, వేదవాక్యములచే గానముచేయబడితివి. మహర్షిలోకమును ముందుగా అనుగ్రహించితివి. అత్యంతనిగూఢమగు నివాసము నీది. సత్పదార్థమునకు అధిష్ఠానము నీవు. నన్ను రక్షించు.

పరాస్యశక్తిహీ వివిధైవ శ్రూవ్యసే
శ్వేతాశ్వ వాక్యోదిత దేవీ దుర్గే
స్వాభావికీ జ్ఞాన బలక్రియార్తే
మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి || 3 ||

భావం : ఓ దుర్గా! శ్వేతాశ్వతరోపనిషద్వాక్యములచే చెప్పబడిన దివ్యరూపిణీ, నీవు పరాశక్తివి. అయినను అనేకులచే అనేకవిధములుగా చెప్పబడగా వివిధరూపములుగా వినబడుచునావు. నీయొక్క జ్ఞాన, బల సంబంధమగు క్రియారూపములోని శక్తి నీకు స్వాభావికమైనది. సర్వేశ్వరీ! మోక్షప్రధాత్రి ! నన్ను రక్షించు.

దేవాత్మ శబ్దేన శివాత్మ భూత
యత్కూర్మ వాయవ్య వచో వివృత్య
త్వంపాశ విఛ్చేద కరి ప్రసిద్ద్హ
మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి  || 4 ||

భావం : దేవాత్మశబ్దముచే చెప్పబడు నీవు, కూర్మ వాయుపురాణముల వాక్యవివరణచే శివాత్మురాలివైతివి. నీవు ఈ భవపాశములను ఛేదింపగలిగినదానిగా ప్రసిధ్ధురాలవు. ఓ సర్వేశ్వరీ! మోక్షప్రధాత్రి ! నన్ను రక్షించు

త్వం బ్రహ్మ పుచ్చా వివిధా మయూరీ
బ్రహ్మ ప్రతిష్ఠాసి ఉపతిష్ట గీత
జ్ఞాన స్వరుపాత్మదయఖిలానాం
మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి  || 5 ||

భావం : అమ్మా, నీవు బ్రహ్మమే పుచ్చముగాగల వివిధరూపములనుండు మయూరివి బ్రహ్మమునకు అధిష్టానమైనదానివి. అనేక గీతలను ఉపదేశించిన దానవు. అందరిలోనుండు జ్ఞాన స్వరూపము నీవే. అందరిలోని దయాస్వరూపము నీవే. ఓ సర్వేశ్వరీ! మోక్షప్రధాత్రి ! నన్ను రక్షించు

కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి విరచితం. ప్రతిరోజు దీన్ని చదివిన వారికి మోక్షం తథ్యం.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!