ద్వారకా తిరుమల (Dwaraka Tirumala)

శ్రీ లక్ష్మీనివాసుడైన వేంకటేశ్వరుడు స్వయంభువు గా వెలసిన దివ్యక్షేత్రం ఈ ద్వారకా తిరుమల. ద్వారకా తిరుమల క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు 41 కి.మి. దూరం లో నెలకొని ఉంది.

ఈ క్షేత్రం లో ఒకే విమాన శిఖరం క్రింద రెండు విగ్రహాలు ఉండటం ఇక్కడి విశేషం. ఒక విగ్రహం సంపూర్ణమైనదిగా, రెండవది స్వామివారి పై భాగం మాత్రమే కనిపించేటట్లుగా ఉండే అర్థవిగ్రహంగా ఉంటుంది.ద్వారకా తిరుమలలోని స్వామి వారికి అభిషేకం చేయకపోవటం విశేషంగా చెప్పవచ్చు. ఎందుకంటే స్వామివారిపై ఒక చిన్న నీటి బొట్టుపడినా అది స్వామివారి విగ్రహం క్రిందనుండే ఎర్రచీమలను కదుల్చుతుందని అభిషేకం చేయరు. 

ద్వారకా తిరుమల క్షేత్రం లో నిత్య కళ్యాణ మహోత్సవం జరిగే తీరు చాల చెప్పుకో దగిన విశేషం. కల్యాణం కమనీయం గా ఉంటుంది, అక్కడ నిత్యం కళ్యాణానికి సుమారు 100 నుంచి 150 పుణ్య దంపతులు హాజరు అవుతారు. అక్కడ ఉన్న ప్రధాన పూజారి గారు కళ్యాణం జరిపించే విదానం చూసి ముక్కు మీద వేలువేసుకోక తప్పదు, హాజరయిన దంపతుల పేర్లు అందరివి వారి వారి గోత్రనామాలు కాగితం చూడకుండా ,వరసక్రమము తప్పకుండ కార్యక్రమం లో ముమ్మారు గుర్తు ఉంచుకొని చదివే తీరు మనలను మంత్ర ముగ్దులను చేస్తుంది. “ఏమో అయన ద్వారకా తిరుమల రాయుడెమో” కల్యాణానికి చెల్లించే దాని కంటే ఆలయ మర్యాదల రూపం లో దేవస్థానం వారు మనకు తిరగి ముట్ట చెప్పేది చాలా ఎక్కువ . మగ వారికీ శాలువ , ఆడవారికి నేత చీర, రవిక , 4 గురికి అంతర ఆలయ ప్రవేశం, లడ్డులు , భోజన ఏర్పాటు ఉంటుంది. ఒక్కసారి మీరు వెళ్లి కళ్యాణం చేసి రండి.

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!