Home » Stotras » Singarakonda Sri Prasannanjaneya Swamy temple

Singarakonda Sri Prasannanjaneya Swamy temple

శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం(Singarakonda Sri Prasannanjaneya Swamy temple)

శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం శింగరాయ కొండ గ్రామము నందు ప్రకాశం జిల్లా లో ఉంది. ఈ ఆలయానికి సుమారు 600 సంవత్సరాల చరిత్ర ఉన్నది. శ్రీవరాహ నరసింహ స్వామి వారి ఆలయం కొండ దిగువన భవనాశిని అనబడే చెరువు ఒడ్డున ఈ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ఉంది.

ఇదిచాలా పురాతనమైన ఆలయం.ఈ స్వామి వారు గొప్ప శక్తిమంతునిగా పేరు పొందారు.ఈ స్వామి వారిని భక్తితో స్మరిస్తే ప్రసన్నులవుతారని నానుడి. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా దర్శించినంత మాత్రముననే భూత, ప్రేత, పిశాచ పీడలు నివారణ అవుతాయని, అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు కూడా మటుమాయమై అవుతాయని భక్తుల విశ్వాసం.
అభయ హస్తంతో శ్రీఆంజనేయ స్వామి భక్తులను ఆశీర్వదించడం ఇక్కడి ప్రత్యేకత. ఇచ్చట స్వామి వారు దక్షిణ ముఖుడై కనిపిస్తారు. దక్షిణ ముఖ హనుమంతుడు అపమృత్యువును హరిస్తాడని ప్రతీతి

ఇచ్చట ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుధ్ధ దశమి నుండి బహుళ పాడ్యమి వరకు బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి. శ్రీరామ నవమి, హనమజ్జయంతి ఉత్సవాలు ఇచ్చట ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి శని, ఆది, మంగళ వారాలలో భక్తులు ఎక్కువ సంఖ్యలో  స్వామి వర్లని దర్శిస్తారు.

క్షేత్ర చరిత్ర:

కొండపై శ్రీ వరాహ నరసింహ స్వామి ఆలయ నిర్మాణం జరుగుతున్న దశలో మహా తేజశ్శాలి అయిన ఒక మహాయోగి శింగరాయకొండ గ్రామానికి వచ్చి కొండ దిగువ భాగాన చెరువు గట్టున శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వెంటనే అంతర్ధానమయ్యారు. అలా మహర్షి ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, కొండపై నుండి ఈ అద్భుతలీలను చూచినవారు, కొండ దిగి వచ్చినవారికి ఆ మహర్షి ప్రతిష్ఠించిన విగ్రహం మహోజ్వలంగా వెలిగి పోతూ కనిపించింది. ఆ దివ్య తేజస్సుకు నమస్కరించి ఒక ఆలయాన్ని నిర్మించి పూజించారు.

ప్రతి ఉదయం 6 గంటలనుండి, రాత్రి 7 గంటల వరకు ఈ ఆలయం తెరచి ఉంటుంది.

Runa Vimochana Ganesha Stotram

ఋణ విమోచన గణేశ స్తోత్రం (Runa Vimochana Ganesha Stotram) అస్య శ్రీ ఋణహర్తృ గణపతి స్తోత్ర మంత్రస్య సదాశివ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ ఋణహర్తృ గణపతి దేవతా గౌం బీజం గం శక్తిః గోం కీలకం సకల ఋణనాశనే...

Sri Ganapathy Suprabhatam

శ్రీ గణపతి సుప్రభాతం (Ganapati Suprabhatam) శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ప్రసన్న వదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే. శ్రీకరా! శుభకర! దేవ! శ్రీ గణేశ! అభయమిడి మమ్ము రక్షించి...

Sri Krishnarjuna Kruta Shiva Stuti

శ్రీ కృష్ణార్జున కృత శివ స్తుతి: (Sri Krishnarjuna Kruta Shiva Stuti) నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ! పశూనాం పతయే నిత్యముగ్రాయ చ కపర్దినే!! మహాదేవాయ భీమాయ త్ర్యంబకాయ చ శాంతయే! ఈశానాయ మఖఘ్నాయ నమోస్త్వంధక ఘాతినే!!...

Sri Kanakadhara Stotram

కనకధారా స్తోత్రం (Kanakadhara Stotram) అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ భృఙ్గాఙ్గనేవ ముకుళాభరణం తమాలం | అంగీకృతాఖిల విభూతిర పాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః || 1 || భావం: మొగ్గలతో నిండియున్న చీకటి కానుగ చెట్టుకు ఆడుతుమ్మెదలు ఆభరణములైనట్లు, పులకాంకురములతోడి...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!