Home » Stotras » Adi Sankaracharya’s Guru Ashtakam
Adi shankaracharya guru ashtakam

Adi Sankaracharya’s Guru Ashtakam

శంకరాచార్య విరచిత గురు అష్టకం (గుర్వాష్టకం)

శరీరం సురూపం తథా వా కళత్రం
యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ॥

మంచి దేహధారుడ్యము, అందమైన భార్య, పేరు ప్రతిష్టలు, మేరు సమానమైన ధనం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

కళత్రం ధనం పుత్రపౌత్రాది సర్వం
గృహం బాంధవాః సర్వ మేతద్ద్విజాతం
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ॥

భార్య, ధనము, పిల్లలు, వారి పిల్లలు, ఇళ్ళు, బంధువులు, గొప్ప వంశంలో జన్మ ఉన్నప్పటికి గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

షడంగాదివేదో ముఖే శాస్త్రవిద్యా
కవిత్వాది గద్యం సుపద్యం కరోతి
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ॥

ఆరు వేదాంగములు (శిక్ష, చందస్సు, వ్యాకరణం, నిరుక్త, కల్ప, జ్యోతిష్య), నాలుగు వేదాలు, గద్య పద్య రాయగల జ్ఞానం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః
సదాచారవృత్తేషు మత్తో న చాన్యః
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ॥

విదేశాలలో మంచి పేరు, స్వదేశంలో హోదా పలుకుబడి, అందరూ మెచ్చే గుణము, మంచి జీవితం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

క్షమామండలే భూపభూపాలవృందౌ
సదా సేవితం యస్య పాదారవిందమ్
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ॥

గొప్ప రాజ్యానికి చక్రవర్తివైనా, రాజులు మహారాజుల చేత సేవింపబడుతున్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

యశో మే గతం దిక్షు దానప్రతాపాత్
జగద్వస్తు సర్వం కరే సత్ప్రసాదాత్
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ॥

నీ ఖ్యాతి నలుదెశలా వ్యాపించి ప్రపంచమంతా నీ దయాగుణాన్ని ప్రశంచించినా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

న భోగే న యోగే న వా వాజిరాజౌ
న కాన్తాసుఖే నైవ విత్తేషు చిత్తం
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ॥

భోగము, యోగము, ఇష్టము, అగ్నికార్యము, విషయ సుఖము, విత్తములపై నీ మనస్సు విరక్తి పొందినా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

అరణ్యే న వా స్వస్య గేహే న కార్యే
న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యే
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ॥

నీ మనస్సు అరణ్యమున ఉన్నా, ఇంట్లో ఉన్న, సమాన్య విషయములపై తిరుగుతూ ఉన్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

అనర్ఘ్యాణి రత్నాది ముక్తాని సమ్యక్
సమాలింగితా కామినీ యామినీషు
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ॥

వెలకట్టలేని మణులు, రత్నాలు, వజ్రవైఢూర్యాలు సదా నిన్ను అనిగమించే అంటిపెట్టుకునే భార్య ఉన్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

గురోరష్టకం యః పఠేత్పుణ్యదేహీ
యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహీ
లభేత్ వాంఛితార్థ పదం బ్రహ్మసంజ్ఞం
గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నం ॥

ఫలశ్రుతి:
ఎవరైతే ఈ గుర్వాష్టకాన్ని చెదువుతారో, నేర్చుకుంటారో, మననం చేస్తారో, గురువు చెప్పిన విషయాలను నిత్యం స్మరిస్తూ గురు పాదపద్మములపై మనస్సు లగ్నం చేస్తారో, అటువంటివారు యోగి అయినా, సన్యాసి అయినా, రాజు అయినా, బ్రహ్మచారి అయినా, గృహస్తు అయినా తనికి శాశ్వత పరతత్వమగు పరబ్రహ్మం సిద్ధిస్తుంది.

సదాశివ సమారంభాం, శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతం, వందే గురు పరంపరా

Dwadashaaryula Surya Stuthi

ద్వాదశార్యలు సూర్య స్తుతి (Dwadashaaryula Surya Stuthi) సూర్యభగవానుడి సర్వరోగ నివారణకు స్తోత్రం ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివందేవః | హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశునాశయతు || 1 || తా|| ఇప్పుడే ఉదయించి ఉత్తరదిక్కుగా పయనిస్తూన్న సూర్యదేవుడు నా...

Sivanamavalyastakam

శివనామావల్యష్టకం (Sivanamavalyastakam) హే చంద్రచూడ మదనాంతక శూలపాణే – స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో | భూతేశ భీతభయసూదన మామనాథం – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || 1 || హే పార్వతీహృదయవల్లభ చంద్రమౌళే – భూతాధిప ప్రమథనాథ గిరీశచాప | హే...

Sri Ganapthi Thalam

గణపతి తాళం (Ganapthi Thalam) అగణిత ఫణి ఫణ మణి గణ కిరణై | రరు నిత నిజ తను రవి థథ వధన, థట థట లుట ధలి కుల కళ వినధో గణపతి రభ మత మీహ దిశ...

Shri Chitta Stheeryakam Stotram

చిత్త స్థిర స్త్రోత్రo (Shri ChittaStheeryakam Stotram) అనసూయాత్రి సంభూత దత్తాత్రేయ మహామతే | సర్వదేవాధి దేవత్వం మమ చితం స్థిరీకురు || 1 || భావము: అత్రి అనసూయల దీపకుడిగా ఉద్భవించిన వాడు సర్వ దేవతలలో నిండిన దైవత్వంను, బుద్దిమంతుడు అయిన...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!