Home » Remedies » Puthrada Ekadashi

Puthrada Ekadashi

పుత్రద ఏకాదశి (Puthrada Ekadashi)

వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీని గొప్పతనాన్ని వివరించే కథ…. పూర్వం మహారాజు “సుకేతుడు” ‘భద్రావతి’ రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని భార్య ‘చంపక’; మహరాణి అయినా, గృహస్ధు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిధి అభ్యాగతులను గౌరవిస్తూ, భర్తను పూజిస్తూ, ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది. వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది. వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్ధాలను సేవిస్తూ, ఒక పుణ్యతీర్ధం వద్ద కొందరు మహర్షులు తపస్సుల చేసుకుంటున్నారనే ‘వార్త’ తెలుసుకొని, వారిని సేవించి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్ధిస్తాడు. వారు మహారాజు వేదనను గ్రహించి, మీకు పుత్రసంతాన భాగ్యము తప్పక కలుగుతుందని దీవిస్తూ, నేడు ‘పుత్రద ఏకాదశి’ గావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన యెడల మీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్తారు. అంత, ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకొని, వారికి మనఃపూర్వకముగా ప్రణమిల్లి శెలవు తీసుకుంటాడు. వెంటనే నగరానికి చేరుకుని జరిగిన విషయాన్ని భార్య ‘చంపక’కు చెప్తాడు. ఆమె సంతోషించి వారిద్దరు భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా ‘ఏకాదశీ వ్రతాన్ని’ చేస్తారు. అనంతరం కొద్దికాలానికి కుమారుడు కలుగుతాడు. ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత తల్లితండ్రుల కోరిక ప్రకారం యువరాజవుతాడు.ఆయన పరిపాలనలో ఏకాదశ వ్రతాన్ని ప్రజలందరిచేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు.

  • కుచేలుడు ఏకాదశీవ్రతాన్ని ఆచరించి మహా ఐశ్వర్యవంతుడైనాడు.
  • ధర్మరాజు ఆచరించి కష్టాలనుండి గట్టేక్కాడు.
  • రుక్మాంగదుడు ఆచరించి పుత్రప్రాప్తినొందాడు. సకల దేవతా కృపాపాత్రుడైనాడు. మోక్షగామి అయినాడు.
  • వైఖానసరాజు ఆచరించి పితరులకు ఉత్తమలోకప్రాప్తి చేకూర్చాడు.
  • అంబరీషుని వ్రత ప్రభావం జగద్విదితమే.
  • క్షీరసాగర మథనం – లక్ష్మీదేవి ఆవిర్భావం ఏకాదశినాడే జరిగింది.

Srimanarayana Ashtakshara Stuthi

శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి (Srimanarayana Ashtakshara Stuthi) (ఓం) నమః ప్రణవార్థార్థ స్థూలసూక్ష్మ క్షరాక్షర వ్యక్తావ్యక్త కళాతీత ఓంకారాయ నమో నమః | 1 | (న)మో దేవాదిదేవాయ దేహసంచారహేతవే దైత్యసంఘవినాశాయ నకారాయ నమో నమః | 2 | (మో)హనం విశ్వరూపం...

Sri Saligram Stotram

శ్రీ శాలగ్రామ స్తోత్రమ (Sri Saligram Stotram) శ్రీరామం సహ లక్ష్మణం సకరుణం సీతాన్వితం సాత్త్వికం వైదేహీముఖపద్మలుబ్ధమధుపం పౌలస్త్వసంహారిణమ్ । వన్దే వన్ద్యపదాంబుజం సురవరం భక్తానుకంపాకరం శత్రుఘేన హనూమతా చ భరతేనాసేవితం రాఘవమ్ ॥ ౧॥ జయతి జనకపుత్రీ లోకభర్త్రీ నితాన్తం...

Sri Dashavatara Stuti

శ్రీ దశావతార స్తుతి (Sri Dashavatara Stuti) వేదోధారవిచారమతే ! సోమకదానవసంహరణ మీనాకారశరీర నమో ! భక్తంతే పరిపాలయ మాం. నామస్మరణా ధన్యోపాయం న హిపశ్యామో భవతరణే రామ హరే ! కృష్ణ హరే తవ నామ పదామి సదా నృహరే...

Sri Hanuman Badabanala Stotram

శ్రీ హనుమాన్ బడబానల స్తోత్రం (Sri Hanuman Badabanala Stotram) ఓం అస్య శ్రీ హనుమద్బడబానల స్తోత్ర మంత్రస్య శ్రీ రామచంద్ర ఋషిః శ్రీ బడబానల హనుమాన్ దేవతా మమ సమస్త రోగ ప్రశమనార్ధం ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్యర్ధం సమస్త పాపక్షయార్ధం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!