Home » Stotras » Sri Nandeeshwara Janma Vruthantham

Sri Nandeeshwara Janma Vruthantham

శ్రీ నందీశ్వర వృతాంతం (Sri Nandeeshwara swamy)

శివాలయంలోకి అడుగుపెట్టగానే శివుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటారు. నంది రెండు కొమ్ముల మధ్య నుండి శివుడ్ని చూస్తే మరికొందరు నంది చెవి లో తమ కోరికలను చెప్పుకుంటారు. మరియు నంది యొక్క చరిత్ర, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

శిలాదులనే ఋషి ఉండేవాడు ఎంతో జ్ఞానాన్ని సంపాదించినా ఆ ఋషికి పిల్లలు లేకపోవటం లోటుగా ఉండేది. ఎలాగైనా తనకు సంతాన భాగ్యం కలిగేందుకు శివుడికి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. అలాగే కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తూనే వున్నాడు. అతని వంటినిండా చెదలు పట్టినా సరే శిలాదుడు ఆపలేదు. చివరికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. తనకి సంతానం ప్రసాదించమని ఆ శివుడ్ని వేడుకున్నాడు.

అతని పరమభక్తి కి మెచ్చిన శివుడు తధాస్తు అన్నాడు. శివుడి వరాన్ని పొందిన శిలాదుడు ఒకసారి యజ్ఞం చేస్తుండగా ఆ అగ్ని నుంచి బాలుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుడికి నంది అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుతున్నాడు శిలాదుడు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడు అని అర్ధం. ఆ బాలుడి మేధస్సు అసాధారణంగా ఉండేదట. అతను చిన్నతనంలోనే వేదాలన్నీ అవపోసన పట్టేసాడు. ఒకనాడు శిలాదుడు ఆశ్రమానికి మిత్ర వరధులు అనే దేవతలు వచ్చారు. ఆ ఆశ్రమంలో తిరుగుతున్న నందిని చూసి అతను తమకు చేసిన అతిధి సత్కారాలు చూసి మురిసిపోయారు. ఆ దేవతలు వెళుతూ వెళుతూ ఆ పిల్లవాడ్ని దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించబోయి ఒక్కసారి ఆగారు. నంది వంక దీక్షగా చూస్తున్నారు. శిలాధుడు అంత భాదలో ఎందుకు వున్నారో అర్ధం కాలేదు. ఎంతగానో ప్రాధేయపడిన తర్వాత నంది ఆయుషు త్వరలోనే తీరిపోతుందనే వార్త శిలాదుడికి తెలిసింది.

ఈ విషయం తెలిసి నంది దీనికి మార్గం కూడా శివుడే చూపిస్తాడని శివుని కోసం తపస్సు చేయసాగాడు. బాలుని తపస్సుకి మెచ్చి శివుడు త్వరలోనే బాలునికి ప్రత్యక్షమయ్యాడు. శివుడ్ని చూసిన నందికి నోటమాట రాలేదు. శివుడి పాదాల చెంత ఎంత బాగుందో కదా అనుకున్నాడు. అందుకే తన ఆయుష్షు గురించి వరం కోరుకోకుండా చిరకాలం నీ చెంతే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని కోరుకున్నాడు. అలాంటి భక్తుడు తన చెంతనే ఉంటే శివుడికి కూడా సంతోషమే కదా. అందుకే నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండిపొమ్మంటూ అనుగ్రహించాడు శివుడు. ఆనాటి నుంచి శివుడి ద్వారపాలకుడిగా తనని కాచుకొని ఉంటూ కైలాసానికి రక్షణ నందిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది.

శివునికి సంబంధించిన చాలా కధలలో నంది ప్రసక్తి ఉంటుంది. ఒకసారి క్షీరసాగర మధనంలో హాలాహలం అనే విషం వెలువడినప్పుడు దాని నుంచి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని తాగాడు. ఆ సమయంలో కొద్దిపాటి విషం కిందికి ఒలికిందట. అప్పుడు శివుడి చెంతనే ఉన్న నంది ఏ మాత్రం ఆలోచించకుండా ఆ కాస్త విషాన్ని తాగేసాడట. మహామహా దేవతలే ఆ విషానికి భయపడి పారిపోతుంటే నంది శివుని మీద నమ్మకంతో ఈ మాత్రం ఆలోచించకుండా ఆ విషాన్ని తాగేసిందట. నంది గురించి ఇంత చరిత్ర ఉంది కాబట్టే ఆయన్ని శివుడికి సేవకుడిగానే కాకుండా ముఖ్య భక్తుడిగా కూడా భావిస్తారు పెద్దలు.

Sri Nrusimha Saraswathi Ashtakam

శ్రీ నృసింహ సరస్వతీ అష్టకం (Sri Nrusimha Saraswathi Ashtakam) ఇందుకోటి తేజకర్ణ సింధు భక్తవత్సలం|నందనాత్రిసూను దత్తమిందిరాక్ష శ్రీగురుమ్ | గంధమాల్య అక్షతాది బృందదేవ వందితం|వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ || 1 || మోహపాశ అంధకార జాతదూర భాస్కరం...

Shiva Nindha Stuthi

శివ నిందా స్తుతి (Shiva Nindha Stuthi) ఇసుక రేణువులోన దూరియుందువు నీవు బ్రహ్మాండమంతయును నిండియుందువు నీవు చివురాకులాడించు గాలిదేవర నీవు ఘన కానలను గాల్చు కారుచిచ్చువు నీవు క్రిమికీటకాదులకు మోక్షమిత్తువు నీవు కాలయమునిబట్టి కాలదన్ను నీవు పెండ్లి జేయరాగ మరుని...

Saraswati stotram

శ్రీ వేదవ్యాస కృత సరస్వతీ స్తోత్రమ్ (Saraswati stotram) సరస్వతి నమస్తేస్తు పరమాత్మ స్వరూపిణి జగతామాదిభూతా త్వం జగత్వం జగదాకృతిః ఇంద్రనీలాలకా చంద్రబింబాననా పక్వబింబాధరా రత్నమౌళీధరా చారువీణాధరా చారు పద్మాసనా శారదా పాతుమాం లోకమాతా సదా స్వర్ణముక్తామణి ప్రోతహారాన్వితా ఫాల కస్తూరికాయోగి...

Sri Shiva Bhujanga Stotram

శ్రీ శివ శివభుజంగం(Sri Shiva Bhujanga Stotram) గలద్దానగణ్డం మిలద్భృఙ్గషణ్డం చలచ్చారుశుణ్డం జగత్త్రాణశౌణ్డమ్ కనద్దన్తకాణ్డం విపద్భఙ్గచణ్డం శివప్రేమపిణ్డం భజే వక్రతుణ్డమ్ ౧ అనాద్యన్తమాద్యం పరం తత్త్వమర్థం చిదాకారమేకం తురీయం త్వమేయమ్ హరిబ్రహ్మమృగ్యం పరబ్రహ్మరూపం మనోవాగతీతం మహః శైవమీడే ౨ స్వశక్త్యాదిశక్త్యన్తసింహాసనస్థం మనోహారిసర్వాఙ్గరత్నోరుభూషమ్...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!