Home » Ashtakam » Sri Sheetala Devi Ashtakam
sheethala ashtakam

Sri Sheetala Devi Ashtakam

శ్రీ శీతలా దేవి అష్టకం (Sri Sheetala Devi Ashtakam)

అస్యశ్రీ శీతలాస్తోత్రస్య మహాదేవ ఋషిః
అనుష్టుప్ ఛన్దః శీతలా దేవలా దేవతా
లక్ష్మీర్బీజం – భవానీశక్తిః
సర్వ విస్ఫోటక నివృత్తయే జపే వినియోగః

ఈశ్వర ఉవాచ:

వన్దేహం శీతలాం దేవీం రాసభస్థాం దిగమ్బరామ్|
మార్జనీకలశోపేతాం శూర్పాలంకృత మస్తకామ్||

వన్దేహం శీతలాం దేవీం సర్వరోగ భయాపహామ్|
యామాసాద్య నివర్తేత విస్ఫోటక భయం మహత్||

శీతలే శీతలే చేతి యో బ్రూయాద్దాహ పీడితః|
విస్ఫోటక భయం ఘోరం క్షిప్రం తస్య ప్రణశ్యతి||

యస్త్వా ముదకమధ్యేతు ధృత్వా పూజయతే నరః|
విస్ఫోటకం భయం ఘోరం గృహే తస్య న జాయతే||

శీతలే జ్వర దగ్ధస్య పూతిగంధయుతస్యచ|
ప్రనష్టచక్షుషః పుంస్ః త్వామాహుర్జీవనౌషధమ్||

శీతలే తనుజాన్రోగాన్ నృణాం హరసి దుస్త్యజాన్|
విస్ఫోటక విదీర్ణానాం త్వమేకామృతవర్షిణీ||

గలగండగ్రహా రోగా యే చాన్యే దారుణా నృణామ్|
త్వదనుధ్యాన మాత్రేణ శీతలే యాన్తి సంక్షయమ్||

నమన్త్రోనౌషధం తస్య పాపరోగస్య విద్యతే|
త్వామేకాం శీతలే ధాత్రీం నాన్యాం పశ్యామి దేవతామ్||

మృణాల తంతు సదృశీం నాభి హృన్మధ్య సంశ్రితామ్|
యస్త్వాం సంచిత యేద్దేవి తస్య మృత్యుర్నజాయతే||

అష్టకం శీతలాదేవ్యా యోనరః ప్రపఠేత్సదా|
విస్ఫోటక భయం ఘోరం గృహేతస్య నజాయతే||

శ్రోతవ్యం పఠితవ్యం చ శ్రద్ధాభక్తి సమన్వితైః|
ఉపసర్గ వినాశాయ పరం స్వస్త్యయనం మహత్||

శీతలే త్వం జగన్మాతా శీతలే త్వం జగత్పితా|
శీతలే త్వం జగద్ధాత్రీ శీతలాయై నమోనమః||

రాసభో గర్దభశ్చైవ ఖరో వైశాఖనందనః|
శీతలా వాహనశ్చైవ దూర్వాకంద నికృంతనః||

ఏతాని ఖరనామాని శీతలాగ్రేతు యఃపఠేత్|
తస్యగేహే శిశూనాం చ శీతలా రుజ్ఞజాయతే||

శీతలాష్టక మేవేదం నదేయం యస్యకస్యచిత్|
దాతవ్యం చ సదా తస్మై శ్రద్ధా భక్తియుతాయవై||

ఇతి శ్రీస్కన్దపురాణే శీతలాష్టకం సంపూర్ణం

జ్వరాది వ్యాధుల్ని పోగొట్టే ’శీతలాదేవి’

విశ్వచక్రంలోనున్న దేవతాశక్తుల్ని దివ్య మంత్ర,నామ స్తోత్రాదులతో స్పందింపజేసి అభీష్టసిద్ధుల్ని సాధించే ’శబ్దచికిత్సా’ విధానాలను మన ఋషులు ఏర్పాటు చేశారు.
వ్యాధుల్ని నివారింపజేసి, జ్వరాలను తొలగించే శక్తి ఉన్న శీతలాదేవిని ఉత్తరాది, వంగదేశం, ఉత్కళ రాష్ట్రాలలో ఎక్కువగా ఆరాధిస్తారు. సుమారు ప్రతి దేవాలయంలో శీతలాదేవికి చిన్న ఆలయముండడమే కాక, ప్రత్యేకించి శీతలా మందిరలు సైతం కనిపిస్తుంటాయి. శీతలా స్తోత్రాలు నిత్యపారాయణాలుగా ఉండడమే కాక, అతి సామాన్యులు సైతం ఈ తల్లిని ఆరాధిస్తుంటారు.
అనంతశక్తి స్వరూపిణియైన జగదంబ తన అనంత అనుగ్రహాన్ని వివిధ విధాలుగా అందించడానికి అనంత రూపాలను ధరించింది. అలాంటి రూపాలలో ఈ శీతలాదేవి ఒకటి, జ్వరహరణ శక్తులలో ఒకటి. గాడిద వాహనంపై కూర్చుని చేట, చీపురు, కలశంవంటి వాటితో ప్రకాశించే ఈ తల్లిరూపం రోగనాశక శక్తులకు సంకేతం.
జంతువులలో కూడా అనేక రహస్య శక్తులుంటాయి. ఆ శక్తుల్ని గమనిస్తే – కొన్ని జంతువుల ఇంద్రియాలలో సూక్ష్మశక్తులున్న విషయం స్పష్టమౌతుంది. ఆ ప్రత్యేకతలన్నీ విశ్వశక్తిలోని అంశాలే.
శక్తులకు సూక్ష్మ జగత్తులో ఉన్న ఆకృతులను మంత్రద్రష్టలు దర్శించి, వాటిద్వారా మనం తగిన ప్రయోజనాలను పొందాలని వివిధ స్తోత్రాలనందించారు.

గాడిద, చేట, చీపురు, కలశం – ఈపరికరాలు రోగకారక క్రిమినాశన, జ్వరహరణ శక్తులకు సంకేతాలు.
స్ఫోటకము, ఉష్ణతలు, తీవ్రజ్వరాలు నశించడానికి, పిల్లలకు వచ్చే ఆటలమ్మవంటి ’మారీ’ వేదనలు తొలగడానికి, శీతలాదేవిని తలంచి ఈ స్తోత్రం చదివితే చాలు – తప్పక ఆ వ్యాధులు నివారణ అవుతాయని శాస్త్రోక్తి. “శీతలా” నామస్మరణమే జ్వరతాపాలను పోగొడుతుందని పురాణవచనం.

Sri Sadashiva Ashtakam

శ్రీ సదాశివాష్టకం (Sri Sadashiva Ashtakam) సదా ఇందుమౌళిం సదా జ్ఞానగమ్యం సదా చిత్ప్రకాశం సదా నిర్వికారం సదానందరూపం సదా వేదవేద్యం సదా భక్తమిత్రం సదా కాలకాలం భజే సంతతం శంకరం పార్వతీశం || 1 || సదా నీలకంఠం సదా...

Sri Sarwamandala Ashtakam

श्री सर्वमङ्गलाष्टकम्श्री (Sri Sarwamandala Ashtakam) गणेशाय नमः । लक्ष्मीर्यस्य परिग्रहः कमलभूः सूनुर्गरुत्मान् रथः पौत्रश्चन्द्रविभूषणः सुरगुरुः शेषश्च शय्यासनः । ब्रह्माण्डं वरमन्दिरं सुरगणा यस्य प्रभोः सेवकाः स त्रैलोक्यकुटुम्बपालनपरः कुर्यात् सदा मङ्गलम् ॥...

Sri Ranganatha Ashtakam

శ్రీ రంగనాథా అష్టకం (Sri Ranganatha Ashtakam) పద్మాదిరాజే గురుదౌదిరాజే విరచరాజే సుర రాజరాజే | త్రైలోక్య రాజే అఖిల రాజరాజే శ్రీ రంగరాజే నమతా నమామి || 1 || శ్రీ చిత్తశాయీ భజగేంద్రశాయీ, నాదార్కశాయీ, ఫణిభోగశాయీ అంబోదిశాయీ, వతత్రశాయీ,...

Sri Mahalakshmi Ashtakam

శ్రీ మహా లక్ష్మీ అష్టకం (Sri Mahalakshmi Ashtakam) ఇంద్ర ఉవాచ  నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోఽస్తుతే || 1 || మహామాయరూపినివై, శ్రీపీఠ నివాసినివై, దేవతలచే సేవించబడుతూ, శంఖ, చక్ర, గదలు ధరించిన ఓ మహాలక్ష్మీ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!