Home » Stotras » Kedareswara Swamy Vratham

Kedareswara Swamy Vratham

కేదారేశ్వర స్వామి వ్రతం (Kedareswara Swamy Vratham)

పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం వుండేది. ఆ పేద దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు వున్నారు. వారి కుటుంబము జరుగుబాటు చాలా దుర్భరంగా ఉన్నందువల్ల పెద్ద వాళ్ళయిన కుమార్తేలిద్దరూ అడవికిపోయి కట్టెలు ఏరుకుని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి కుటుంబ పోషణ కొనసాగిస్తున్దేవారు. ఇలా కాలం గడుస్తుండగా ఒకనాడు వాళ్ళు పుల్లలు ఏరుకుని గ్రామానికి వస్తుండగా పోలిమేరలోని ఒక నీటిలో ఏదో పూజ చేసుకుంటుండడము చూసి ప్రసాదము తెచ్చుకోవాలని అక్కడకు వెళ్ళారు. పూజా క్రమం చూసి ముచ్చట పది ఆ అమ్మాయిలూ ఈ పూజగురించి చేసే విదాన్నాన్ని గురించి ఇంటి యజమానిని అడిగి తెలుసుకున్నారు. ప్రసాదం తీసుకుని ఇంటికి వెడుతున్న వాళ్ళకు ఆ పూజ తాము కూడా చేసుకోవాలన్న ఆశ కలిగింది. ఒక చెట్టు మొదట తమ గంపలు దింపి అక్కడ శుబ్రం చేసి మర్రి ఆకులు పళ్ళు ఊడలు, పత్రీ ప్రోగుచేసుకుని వచ్చి నువ్వే మాదేవుదవని అక్కడగల ఒక రాతిని ఆ చెట్టు మొదలులో పెట్టి పూజ చేసి స్వామి ఇవే తమల పాకులు ఆకులు చేక్కలనుకో అని మర్రి ఆకులు, పళ్ళు పెట్టారు. ఇవే బూరేలనుకో అని మర్రి పళ్ళను నైవేద్యంగా పెట్టారు. ఇవే తోరాలనుకో అని మర్రి ఊడలు స్వామీ ముందు పెట్టి భక్తి టో పూజ పూర్తి చేసారు అక్కాచెల్లెళ్లు. ఇంటికి బయలు దేరుతూ వాళ్ళు తమతమ గంపలను నెత్తిన ఎట్టుకోబోగా వాటిల్లోని పుడకలన్ని బంగారపు పుడకలుగా మారి వున్నాయి. వారు ఆయనత ఆనందంతో ఇంటికి వెళ్లి తల్లి తండ్రులకు జరిగిన సంగతంతా చెప్పి ఆ పుడకలను అమ్ముకుని శ్రీమంతులైనారు.

సిరిసంపదలు పెరిగిన ఆ సుందరాంగులను తూర్పునుండి ఒక మహారాజు వచ్చి పెద్దామేను, పడమరనుండి ఒక మహారాజు వచ్చి చిన్నామేను పరిణయము చేసుకున్నారు. వారి వారి రాజ్యాలకు వెళుతూ శ్రద్దా భక్తులతో ప్రతి ఏటా కార్తీక మాసంలో ఈ నోమును నోచుకున్తున్దవలసిందని చెప్పారు. ఆ ప్రకారముగా చేస్తూ వాళ్ళు కాలం గడుపుతున్నారు. కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు. కార్తీక నోమును భారీగా చెయ్యాలని సంకల్పించుకున్నాది. పాత తోరాలను తీసి పెరటిలో కాకరపాదు మీద వేశాడు. బంగారపుతోరాలు చేయించాడు. నవగాయ పిండివంటలతో గారెలు, బూరెలు క్షీరాన్నంతో భోజనాలు పెట్టాడు. గ్రామస్తులంతా అతనిని ఎంతగానో ప్రశంసించారు. కానీ కేదారేశ్వరిని కరుణ మందగించింది. ఏడాదికేడాది వారి సిరి సంపదలు తొలగి పేదరికం దాపురించింది. తినడానికి తిండిలేని దుస్తుతి కలిగింది. ఏ పని చెయ్యాలన్న జరగక పోగా కష్టాలు కుగుతున్దేవి. ఆ ఇల్లాలు తమ పెరటిలో విరగ కాసిన కాకర పాదును చూసి కొన్ని కాయలు కోసి కొడుకిచ్చి అంగడికి వెళ్లి చారెడు నూకలు పప్పు ఉప్పు తీసుకురమ్మని పంపించింది. ఆవి తీసుకు వెళ్లి అతడు షావుకారు అంగడి ముందు నిలుచున్నాడు. యెంత సేపటికి ఆ షావుకారు చూడలేదు. తరువాత చూసి ఏమిటి తీసుకోచావని ప్రశ్నించాడు. అయ్యా ఈ కాకరకాయలు తీసుకుని చారెడు బియ్యం ఇప్పించండి మీ పేరు చెప్పుకుని ఈ పూట కింత గంజితాగుటాము అన్నాడు. అలానా మీకు దారపోయడానికి మాకేం మధ్యన్తరపు సిరికలుగలేదు. వెళ్ళు వెళ్ళు అని కసురుకున్నాడు. కాళ్ళా వెళ్ళా పది బ్రతిమిలాడినా యితడు వదిలేల లేడు అని దోసెడు బియ్యం పప్పు ఉప్పు ఇప్పించి పంపించాడు. ఆ పూటకు వాళ్ళు ఆకలు తీర్చుకుని మరునాడు మరికొన్ని కాయలు కోసి మరో అంగడికి వెళ్లి అమ్ముకుని రమ్మని పంపింది.

వాటిని పట్టుకుని అంగడి వీధికి వెడుతున్న బాలుడిని షావుకారు ఆపి ఏమి కావాలంటే అవి ఇస్తాను రోజు ఆ కాయలు నాకే ఇవ్వవలసినదిగా చెప్పి భారీగా సెచ్చాలు బియ్యం ఇచ్చాడు. ఆ షావుకారు ఎందువల్ల అతనికింత దయకలిగిందంటే ముందు రోజున తను తీసుకున్న కాకరకాయలు కూర చేసే నిమిత్తము కొస్తే వాటిల్లో నుండి బంగారం ముద్దలుగా రాలి పడ్డాయి. ఇవి ఇంకెవరికి దక్కకూడదని ఆ షావుకారు యెంత ఇవ్వడానికైనా సిద్దపడ్డాడు. రోజు కుర్రవాడు దగ్గర కాకరకాయలు కొంతుండేవాడు. కాకరకాయలు అయిపోయాయి. ఆ షావుకారు చిల్లి గవ్వ కూడా ఇవ్వడం మాని వేశాడు.

ఇక గత్యంతరము లేక తల్లి తన కుమారుడిని ప్రయాణము చేసి తూర్పునగల పెద్ద అక్క దగ్గరకు పంపించింది. కష్టసుఖాలు చెప్పి ఏమైనా సహాయాన్ని అడగమన్నది. అతడు అక్క గారి ఇంటికి చేరుకొని నౌకర్లు లోపలకు పెల్లనివ్వకపోతే అక్కడే వుండగా తల ఆరబోసుకోవడానికి మెడ మీదకు వచ్చిన అక్కగారు తమ్ముడిని చూసి లోపలకు తీసుకు వెళ్ళింది. అక్కగారికి ఇంటి పరిస్థితులన్నీ చెప్పాడు. ఒక గుమ్మడికాయను దోలిపించి అందులో వరహాలు పోసి తమ్ముడికిచ్చి తిన్నగా వెళ్లి దానిని అమ్మకు ఇవ్వవలసినదిగా చెప్పి పంపింది. తిరిగి వస్తూ అక్కగారిచ్చిన చద్ది తినాలని ఆ గుమ్మడికాయను నేలమీద పెట్టి చద్ది తింటున్నాడు. అంతలో ఒక పెద్ద గద్ద వచ్చి దాని తన్నుకు పోయింది. చేసేదేమిలేక ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళలేక పడమట వున్న చిన్న అక్కగారి వద్దకు వెళ్ళాడు. నౌకరు వల్ల అతని రాకను విని ఆమె బయటకొచ్చి తముడిని లోపలకు తీసుకు వెళ్ళింది కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నది. ఒక చెప్పుల జతలో వరహాలు పెట్టి కుట్టించి దానిని ఎక్కడా విడవక తిన్నగా ఇంటికి వెళ్ళు అని చెప్పి పంపించింది. ఆ అక్క ఏమి ఇవ్వలేదు. ఈ అక్కా ఏమి ఇవ్వలేదు అని బాధపడుతూ ఇంటికి బయలు దేరాడు. ఎండ తీవ్రతకు దాహం వేసి ముఖం కడుక్కుని కాసిన్ని మంచి నీళ్ళు త్రాగాలని నిర్ణయించుకున్నాడు. అక్క గారు ఆ జోళ్ళను ఎక్కడా విడవ వద్దు అని చెప్పడం వల్ల చెప్పులతోనే చెరువులోనికి దిగాడు కాని ఆ బురదలో కూరుకుపోయి యెంత వెదికినా జోళ్ళు దొరకలేదు.

ఈ సంగతంతా చెప్పి పెద్ద అక్కగారిని సాయం అడగాలని తిరిగి ఆమె వద్దకు వెళ్ళాడు. అది కార్తీక మాసం ఆమె కార్తీక నోము నోచుకున్తున్నది. ఆడంబరంగా నోము నోయడంవల్లనే తన పుట్టింటిన దారిద్రము తాన్దవిస్తుందని గ్రహించి తమ్ముడిచేత ఆ నోము నోయించి ఆడంబరము కాదు నాయనా ముఖ్యం అని చెప్పి ఇంటికి వెళ్లి కేదారనోమును నోయండి అని చెప్పి కొంత డబ్బిచ్చి పంపించింది. అతడు ఇంటికి వస్తుండగా గుమ్మడికాయ పండు తను లోగడ విడిచిన చోట కనిపించింది. చెరువు ఎండి చెప్పులు పైకి వచ్చాయి. వాటిని తీసుకుని ఇంటికి వచ్చి విషయాలన్నీ వివరించి కేదార నోమును భక్తి ప్రపత్తులతో జరిపించాడు. క్రమక్రమముగా సిరులు పుంజుకుని తిరిగి పూర్వ వైభావముతో జీవించారు.

ఉద్యాపన: ఇది కార్తీక మాసములో సోమవారాల్లో ముఖ్యముగా మూడవ సోమవారము, కార్తీక పౌర్ణమి రోజు కుటుంబ సామ్ప్రదాయమైతే ఆ రోజున చేయాలి. ఉదయం నుండి ఉపవాసము ఉంది సాయంత్రము పరమేశ్వరుణ్ణి ఫల, పుష్ప పత్రితో పూజించాలి. పాత తోరాలను కొత్తవాతితోపాటు స్వామీ సన్నిదానాపెట్టాలి . స్వామికి బూరెలు నైవేద్యం పెట్టాలి. ఈ బూరేలను నోము నోచుకున్న కుటుంబీకులు మాత్రమె తినాలి. పున్నమి చంద్రుడిని చూచి ఆహారం తీసుకోవాలి. తోరాలు చేతికి కట్టుకుని కాసేపు ఉంచుకుని తీసి వాటిని మరుసటి సంవత్సరానికి భద్రపరచాలి. ఈ నోమును కోడళ్ళకు కొడుకులకు ఉద్యాపన చెప్పి అప్పగించి వంశ పారంపర్యంగా చేసు కుండటం సాంప్రదాయం.

Sri Shanaishchara Chalisa

శ్రీ  శనైశ్చర చాలీసా (Sri Shanaishchara Chalisa) దోహా: శ్రీ శనైశ్చర దేవజీ, సునహు శ్రవణ మమ టేర కోటి విఘ్ననాశక ప్రభో, కరో న మమ హిత బేర సోరఠా తవ అస్తుతి హే నాథ, జోరి జుగల కర కరత...

Sri Dhumavathi Hrudayam

శ్రీ ధూమావతీ హృదయ స్తోత్రం  (Sri Dhumavathi Hrudayam) ఓం అస్య శ్రీ ధూమావతీ హృదయస్తోత్ర మహామంత్రస్య పిప్పలాదఋషిః అనుష్టుప్ చందః శ్రీ ధూమావతీ దేవతా- ధూం బీజం- హ్రీం శక్తిః- క్లీం కీలకం -సర్వశత్రు సంహారార్థే జపే వినియోగః ధ్యానం...

Sri Nataraja Stotram

శ్రీ నటరాజ స్తోత్రం (Sri Patanjali Kruta Nataraja Stotram) సదంచిత-ముదంచిత నికుంచిత పదం ఝలఝలం-చలిత మంజు కటకం పతంజలి దృగంజన-మనంజన-మచంచలపదం జనన భంజన కరమ్ కదంబరుచిమంబరవసం పరమమంబుద కదంబ కవిడంబక గళమ్ చిదంబుధి మణిం బుధ హృదంబుజ రవిం పర...

Sri Krishna Ashtottara Shatanama Stotram

శ్రీ కృష్ణ అష్టోత్తర శత నామ స్తోత్రం (Sri Krishna Ashtottara Shatanama Stotram) శ్రీకృష్ణః కమలానాథో వాసుదేవః సనాతనః | వాసుదేవాత్మజః పుణ్యో లీలామానుషవిగ్రహః || ౧ || శ్రీవత్సకౌస్తుభధరో యశోదావత్సలో హరిః | చతుర్భుజాత్తచక్రాసిగదాశంఖాంబుజాయుధః || ౨ ||...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!