Home » Karthika Puranam » Karthika Puranam Part 5

Karthika Puranam Part 5

కార్తిక పురాణం
5వ అధ్యాయము – వనభోజన మహిమ(Karthika Puranam Part 5)

ఎల్లశరీర దారులకు నిల్లను చీకటి నూతిలోపలన్
ద్రెళ్లక ‘మీరు మే’ మనుమమతి భ్రమణంబున భిన్నులై ప్రవ
ర్తిల్లక సర్వమున్నతని దివ్యకళామయమంచు విష్ణున౦
దుల్లము జేర్చి తారడవిను౦డుట మేలు నిశాచరాగ్రణి ||

ఓ జనక మహారాజా! కార్తీకమాసములో స్నానదాన పూజాన౦తరమున శివాలయమునన౦దుగాని, విష్ణ్వాలయమున౦దుగాని శ్రీ మద్భగవద్గీతా పారాయణము తప్పక చేయవలయును. అట్లు చేసినవారి సర్వ పాపములును నివృత్తియగును. ఈ కార్తీక మాసములో కరవీరపుష్పములు శివకేశవులకు సమర్పించినవారు వైకు౦ఠమునకు వెళ్లుదురు. భగవద్గీత కొంతవరకు పఠి౦చినవారికీ విష్ణులోకం ప్రాప్తించును కడ కందలి శ్లోకములో నొక్క పాదమైననూ కంఠస్థ మొనరించిన యెడల విష్ణుసాన్నిధ్యం పొందుదురు. కార్తీకమాసములో పెద్ద ఉసిరికాయలతో ని౦డి వున్న ఉసిరిచెట్టు క్రింద సాలగ్రామమును యధోచిత౦గా పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరిచెట్టు నీడను భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనంపెట్టి దక్షణ తా౦బూలములతో సత్కరించి నమస్కరించవలయును.

వీలునుబట్టి ఉసిరిచెట్టు క్రింద పురాణకాలక్షేపం చేయవలయును. ఈ విధముగా చేసిన బ్రాహ్మణపుత్రునకు నీచజన్మము పోయి నిజరూపము కలిగెను – యని వశిష్టులవారు చెప్పిరి. అది విని జనకరాజు “మునివర్యా! ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మమేల కలిగెను? దానికి గల కారణమేమి” యని ప్రశ్ని౦చగా వశిష్ఠుల వారు ఈ విధంబుగా చెప్పనారంభి౦చిరి.

కిరాత మూషికములు మోక్షము నొందుట

రాజా! కావేరీతీరమ౦దొక చిన్ని గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. వారి పేరు శివశర్మ. చిన్నతనము నుండి భయభక్తులు లేక అతిగారాబముగా పెరుగుట వలన నీచసహవాసములు చేసి దురాచార పరుడై మెలగుచుండెను. అతని దురచారములును చూచి ఒకనాడతని తండ్రి కుమారుని పిలిచి “బిడ్డా! నీ దురాచారములకు అంతు లేకుండా వున్నది. నీ గురించి ప్రజలు పలువిధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీవల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవుచున్నాను. కాన, నీవు కార్తిక మాసమున నదిలో స్నానం చేసి, శివకేశవులను స్మరించి, సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన యెడల, నీవు చేసిన పాపములు తొలగుటయేకాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును. కాన, నీవు అటులచేయు”మని భోదించెను. అంతట కుమారుడు “తండ్రీ! స్నానము చేయుట వంటి మురికి పోవుటకు మాత్రమేకానీ వేరు కాదు! స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా! దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని యింటిలోనే పెట్టుట మంచిది కాదా?” అని వ్యతెరేకర్ధములతో పెడసరంగా సమాదానమిచ్చెను. కుమారుని సమాధానము విని, తండ్రి “ఓరీ నీచుడా! కార్తికమాస ఫలము నంత చులకనగా చుస్తున్నావు కాన, నీవు అడవిలో రావి చెట్టు తొఱ్ఱయందు యెలుకరూపములో బ్రతికెదవుగాక” అని కుమారుని శపించెను. ఆ శాపంతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై బడి “తండ్రీ! క్షమి౦పుము. అజ్ఞానా౦ధకారములో బడి దైవమునూ, దైవకార్యములనూ యెంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతిని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకా శాపవిమోచన మోప్పుడే విదముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపు”మని ప్రాధేయపడెను. అంతట తండ్రి “బిడ్డా! నాశపమును అనుభవి౦చుచు మూషికము వై పడియుండగా నీ వెప్పుడు కార్తికమహత్మ్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తినొ౦దుదువు” అని కుమారుని వూరడించెను. వెంటనే శివశర్మ యెలుక రూపము పొంది అడవికి పోయి, ఒక చెట్టు తొఱ్ఱలో నివసించుచు ఫలమును తినుచు జీవి౦చుచు౦డెను.

ఆ యడవి కావేరి నది తీరమునకు సమీపమున నుండుటచే స్నానార్థమై నదికి వెళ్లువారు అక్కడనున్న యా పెద్దవటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి, లోకాభిరామాయణము చర్చి౦చుకొనుచు నదికి వెళ్లుచుండెడివారు. ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తికమాసములో నొకరోజున మహర్షియను విశ్వామిత్రులవారు శిష్యసమేతముగా కావేరినదిలో స్నానార్ధమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలికచేత మూషికము వున్న ఆ వటవృక్షం క్రిందకు వచ్చి శిష్యులకు కార్తిక పురాణమును వినిపించుచుండిరి. ఈలోగా చెట్టుతొఱ్ఱలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరనున్న పూజాద్రవ్యములలో నేదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బైటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను. అంతలో నొక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని, “వీరు బాటసారులై వుందురు. వీరి వద్దనున్న ధనమపహరించవచ్చు”ననెడు దుర్భుద్దితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపొయినది. వారికీ నమస్కరించి “మహానుభావులారా! తమరు ఎవరు? ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శన౦తో నా మనస్సులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది? గాన, వివరింపుడు” అని ప్రాధేయపడెను. అంత విశ్వామిత్రుల వారు “ఓయీ కిరాతకా! మేము కావేరీ నదీ స్నానార్దామై యీ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరి౦చి కార్తీక పురాణమునకు పఠించుచున్నాము. నీవును యిచట కూర్చుండి సావధానుడవై యాలకి౦పుము” అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీకమహత్మ్యమును శ్రద్దగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి, పురాణ శ్రవణాన౦తరము వారికి ప్రణమిల్లి తన పల్లెకుపోయెను. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి యుండి పురాణమంతయు వినుచుండిన యెలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము నొంది “మునివర్యా! ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా యీ మూషిక రూపము నుండి విముక్తుడనైతి”నని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను.

కనుక ఓ జనకా! ఇహములో సిరి సంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీకపురాణమును చదివి, యితరులకు వినిపించావలెను.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఐదవ అధ్యయము – ఐదవ రోజు పారాయణము సమాప్తం.

Karthika Puranam Part 20

కార్తీక పురాణం – 20 20వ అధ్యాయము – పురంజయుడు దురాచారుడగుట జనక మహారాజు, చతుర్మాస్య వ్రతప్రభావము వినిన పిమ్మట వశిష్టునితో “గురువర్యా! కార్తీకమాస మహాత్మ్యమును యింకను వినవలయుననెడి కోరిక కల్గుచున్నది. ఈ వ్రత మహాత్మ్యమునందింకను విశేషములు గలవా! యను సంశయము గూడా...

Karthika Puranam Part 2

కార్తిక పురాణం 2వ అధ్యాయము – సోమవార వ్రత మహిమ శ్లో|| ఓమిత్యేకాక్షరం బ్రహ్మవ్యాహరంతీ త్రయశ్శిఖాః | తస్మై తారాత్మనే మేధాదక్షిణామూర్తయే నమః || జనకా! ఇంతవరకు నీకు కార్తీక మాసము న౦దాచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియజేసితిని. కార్తిక మాసములో...

Karthika Puranam Part 16

కార్తీక పురాణం – 16 16వ అధ్యాయము – స్తంభ దీప ప్రశంస వశిష్టుడు చెబుతున్నాడు – “ఓ రాజా! కార్తీకమాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసముందు స్నాన, దాన, వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా...

Karthika Puranam Part 11

కార్తిక పురాణం (Karthika Puranam Part 11 11వ అధ్యాయము – మ౦థరుడు – పురాణ మహిమ ఓ జనక మహారాజా! యీ కార్తిక మాసవ్రతము యొక్క మహత్మ్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకనూ దీనిని గురించి యెంత చెప్పినను...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!