Home » Stotras » Sri Prudhvi Stotram

Sri Prudhvi Stotram

శ్రీ పృధ్వీ స్తోత్రం (Sri Prudhvi Stotram)

జయజయే జలా ధారే జలశీలే జలప్రదే |
యజ్ఞ సూకరజాయే త్వం జయందేహి జయావహే ||

మంగళే మంగళా ధారే మంగళ్వే ప్రదే |
మంగళార్ధం మంగళేశే మంగళం దేహి మే భవే ||

సర్వాధారే చ సర్వజ్ఞే సర్వశక్తి సమన్వితే |
సర్వకామప్రదే దేవి సర్వేష్టం దేహి మే భవే ||

పుణ్యస్వరూపే పుణ్యానాం బీజరూపే సనాతని |
పూణ్యాశ్రయే పుణ్యవతా మాలయే పుణ్యదే భవే ||

సర్వసస్యాలయే సర్వసస్యాఢ్యే సర్వసస్యదే |
సర్వ సస్యహరేకాలే సర్వసస్మాత్మికే భవే ||

భూమే భూమిప సర్వస్వే భూమిపాలపరారుణే |
భూమిపానాం సుఖకరే భూమిం దేహి చ భూమిదే ||

ఇదంస్తోత్రం మహాపుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్‌ |
కోటిజన్మసు సభవే ద్బలవాన్బూ మిపేశ్వరః ||

భూమి దానకృతం పుణ్యం లభ్యతే పఠనా జ్జనైః.

అత్యంత పుణ్యప్రదమైన పృథివీ స్తోత్రమును భూపూజ చేసి పఠించినచో కోటి జన్మలలో చేసిన పాపమంతయు నాశనమగును. అతడు చక్రవర్తిగా కూడా కాగలడు. అట్లే ఈ స్తోత్రమును పఠించినందున భూమి దానము చేసిన పుణ్యమును పొందును. ఇతరులకు దానము చేయబడిన భూమిని అపహరించినందువలన కలుగు పాపము తొలగును. భూమిని త్రవ్వినచో కలుగు పాపము. దిగుడు బావులలో మైల అంటుకొనిన పాదములనుంచి కడుగుకొనినచో కలుగు పాపము, ఇతరులు ఇంటిలో శ్రాద్ధము చేసినందువలన కలుగు పాపము, భూమిపై వీర్య త్యాగము చేసినందువలన, దీపాది ద్రవ్యములనుంచి నందువలన కలుగు పాపములన్నితొలగును. అంతేగాక ఈ స్తోత్రమును పఠించినందువలన నూరు అశ్వమేధయాగములు చేసినచో కలుగు ఫలితము లభించును.రైతులకు నష్టం కలుగకుండా కాపాడును.. అకాల మృత్యు దోషం తొలగును.

Sri Lakshmi Nrusimha Karavalamba Stotram

లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం (Sri Lakshmi Nrusimha Karavalamba Stotram) శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే | యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౧ || బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత | లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస లక్ష్మీనృసింహ మమ...

Sri Mahalakshmi Aksharamalika Namavali

శ్రీ మహాలక్ష్మీ అక్షరమాలికా నామావళి (Sri Mahalakshmi Aksharamalika Namavali) అశేషజగదీశిత్రి అకించన మనోహరే అకారాదిక్షకారాంత నామభిః పూజయామ్యహం సర్వమంగలమాంగల్యే సర్వాభీష్టఫలప్రదే త్వయైవప్రేరితో దేవి అర్చనాం కరవాణ్యహం సర్వ మంగలసంస్కారసంభృతాం పరమాం శుభాం హరిద్రాచూర్ణ సంపన్నాం అర్చనాం స్వీకురు స్వయం ఓం...

Devendra Kruta Lakshmi Stotram

దేవేంద్రకృత లక్ష్మీ స్తోత్రం (Devendra kruta lakshmi Stotram) నమః కమల వాసిన్యై నారాయన్యై నమోనమః కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మై నమోనమః || ౧ || పద్మపత్రేణాయై చ పద్మాస్యాయై నమోనమః పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమోనమః || ౨...

Ashta dasa Shakti Peeta Stotram

అష్టాదశ శక్తి పీఠ స్తోత్రం ‌ లంకాయా శాంకరీ దేవీ కామాక్షీ కాంచికాపురే ప్రద్యుమ్నేశృంకలాదేవి చాముండి క్రౌంచపట్టనే అల్లంపురే జోగులాంబ శ్రీశైలే బ్రమరాంబికా కొల్హాపురే మహాలక్ష్మీ మాహుర్యే ఏకవీరికా ఉజ్జయిన్యాం మహాకాళి పీటిక్యాం పురుహూతికా ఒడ్యానం గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికే హరిక్షేత్రే...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!