Home » Chalisa » Sri Sai Chalisa

Sri Sai Chalisa

శ్రీ సాయి చాలీసా

షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం
త్రిమూర్తి రూపా ఓ సాయీ కరుణించి కాపాడోయి
దర్శన మియ్యగరావయ్య ముక్తికి మార్గం చూపుమయా

కఫిని వస్త్రము ధరియించి భుజమునకు జోలీ తగిలించి
నింబ వృక్షము ఛాయలలో ఫకీరు వేషపుధారణలో
కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి
షిరిడీ గ్రామం నీ నివాస భక్తుల మదిలో నీ రూపం

చాంద్ పాటిల్ ను కలుసుకుని అతని బాధలు తెలుసుకొని
గుఱ్ఱము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి
వెలిగించావు జ్యోతులను నీవుపయోగించీ జలము
అచ్చెరువొందెను ఆ గ్రామం చూసి వింతైన ఆ దృశ్యం

బాయిజా చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవా
నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి
పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి
జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం

నీ ద్వారములో నిలిచిని నిన్నే నిత్యము కొలిచితిని
అభయము నిచ్చి బ్రోవుమయా ఓ షిరిడీశా దయామయా
ధన్యము ద్వారక ఓ మాయీ నీలో నిలిచెను శ్రీసాయి
నీ ధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి

ప్రళయ కాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి
చేసి మహామ్మారీ నాశం కాపాడి షిరిడి గ్రామం
అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహాత్మ్యం చూపించి
శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలగించి

భక్త భీమాజీకి క్షయరోగం నశియించే అతని సహనం
ఊదీ వైద్యం చేసావు వ్యాధిని మాయం చేసావు
కాకాజీకి ఓ సాయి విఠల దర్శన మిచ్చితివి
దామూకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం

కరుణాసింధూ కరుణించు మాపై కరుణా కురిపించు
సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును
ముస్లిమనుకొని నిను మేఘా తెలుసుకుని అతని బాధ
దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము

డాక్టరుకు నీవు రామునిగా బల్వంతుకు శ్రీదత్తునిగా
నిమోనుకరకు మారుతిగా చిడంబరకు శ్రీగణపతిగా
మార్తాండకు ఖండోబాగా గణూకు సత్యదేవునిగా
నరసింహస్వామిగా జోషికి దర్శనము మిచ్చిన శ్రీసాయి

రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం
భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం
పదకొండు నీ వచనాలు బాబా మాకివి వేదాలు
శరణణి వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి

అందరిలోన నీ రూపం నీ మహిమా అతిశక్తిమాయం
ఓ సాయి మేఘ మూఢులము ఒసగుమయా నీవు జ్ఞానమును
సృష్టికి నీవేనయ మూలం సాయి మేము సేవకులం
సాయి నామము తలచెదము నిత్యము సాయిని కొలిచెదము

భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని
చిత్తముతో సాయీ ధ్యానం చేయండీ ప్రతినిత్యం
బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాధి
సమాధి నుండి శ్రీసాయి భక్తులను కాపాడేనోయి

మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు
వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి
సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి
భేద భావమును మానండి సాయి మన సద్గురువండి

వందనమయ్యా పరమేశా ఆపద్భాందవ సాయీశా
మా పాపములా కడతేర్చు మా మది కోరిక నెరవేర్చు
కరుణామూర్తి ఓ సాయి కరుణతో మమ్ము దరిచేర్చోయి
మా మనసే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు షిరిడీ సాయినాథ మహరాజ్ కి జై !!

Sri Durga Devi Chandrakala Stuti

దేవీ చన్ద్రకళాస్తుతీ (Sri Durga Devi Chandrakala Stuti) వేధోహరీశ్వరస్తుత్యాం విహర్త్రీం వింధ్య భూధరే! హర ప్రాణేశ్వరీం వన్దే హన్త్రీం విబుధవిద్విషామ్!!  || 1 || భావం: బ్రహ్మ విష్ణు రుద్రులచే స్తోత్రింపబినది – వింధ్య పర్వతమున విహరించునది, శివుని ప్రాణేశ్వరి, దేవ...

Sri Rama Vaibhava Ashtaratna Malika Stotram

శ్రీ రామ వైభవ అష్టరత్నమాలికా స్తోత్రం (Sri Rama Vaibhava Ashtaratna Malika Stotram) సీతామనోహరభరతలక్ష్మణాగ్రజం శతృఘ్నప్రియవాతాత్మజవందితం ఘోరపాపహరణకరుణారససాగరం రావణాదిభంజన రామచంద్రం భజే || 1 || కాలకాలవందితవిధిసురేంద్రవంద్యం శివధనుర్భంజనప్రచండశౌర్యం సప్తతాలభంజనసుగ్రీవరక్షకం అయోధ్యపాలక రామచంద్రం భజే || 2 || కౌశికమఖసంరక్షకవీరాధివీరం...

Lingodbhava Gadhyam

Lingodbhava Gadhyam జయ జయ శివ లింగ జ్యోతిర్మహాలింగ లింగోద్భవ శ్రీ మహాలింగ వేదత్రయీ లింగ నిర్లింగ సంస్పర్శ లింగ క్షమా లింగ సద్భావ లింగ స్వభావైక లింగ దిగ్దేశ కాల వ్యవఛ్చేద రాహిత్య లింగ స్వయంభూ మహాలింగ పాతాళలింగ క్రియాలింగ...

Sri Bhoothanatha Dasakam

శ్రీ ధర్మ శాస్తా స్తుతి దశకం (Sri Bhoothanatha Dasakam) శ్రీ హరిహరసుతుని పాదాదికేశవర్ణనము చేయుచూ స్తుతించు దశకము. శ్రీ ఆది శంకర భగవత్ పాదులచే రచింపబడినది. ఆజానుబాహ ఫలదం శరణారవింద భాజాం అపార కరుణార్ణవ పూర్ణ చంద్రం నాశాయ సర్వ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!