Home » Samskruthi » Gopuja Mahima

Gopuja Mahima

గో పూజా మహత్యం (Gopuja mahima)

హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీన్నే గోపూజ అంటారు. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్ట ఉంది. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని ఈ పురాణాలు చెపుతున్నాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయంటాయని వేద పండితులు చెపుతుంటారు.

గోవులో వివిధ భాగాల్లో దాగివున్న వివిధ రకాల దేవదేవతుల వివరాలను ఓ సారి పరిశీలిస్తే.. గోవు నుదురు, కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడట. అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే… త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సు పై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి. అంతేకాకుండా, శివ అష్టోత్తరం, సహస్రనామాలు పఠిస్తూ బిళ్వ దళాలతో పూజిస్తే  సాక్ష్యాత్ కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెపుతుంటారు.

అలాగే, గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే… సంతాన నష్టం ఉండదని, ఆవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉంటారని వారు చెపుతారు. అందువల్ల చెవిని పూజిస్తే… సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందట. ఆవు కన్నుల దగ్గర సూర్య, చంద్రులు ఉంటారనీ, వాటిని పూజించడం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి, సకల సంపదలు కలుగుతాయని చెపుతున్నారు. ఆవు నాలికపై వరుణ దేవుడు ఉండటం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని చెపుతున్నారు.

అదేవిధంగా ఆవు సంకరంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే… విద్యాప్రాప్తి. ఆవు చెక్కిళ్ళలో కుడి వైపున యముడు, ఎడమవైపున ధర్మదేవతలు ఉంటారని ప్రఘాడ విశ్వాసం. కనుక వాటిని పూజిస్తే… యమబాధలుండవని, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెపుతారు. ఆవు పెదవుల్లో ప్రాతఃసంధ్యాది దేవతలుంటారట. వాటిని పూజిస్తే… పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం. అలాగే, ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని, అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ పాఠవాలు, సంతానం కలుగుతుందట.

ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి. కనుక ఆ చోట పూజిస్తే… ధర్మార్థ, కామమోక్షాలు కలుగుతాయని చెపుతున్నారు. ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారట. వాటిని పూజిస్తే… నాగలోక ప్రాప్తి లభిస్తుందని చెపుతున్నారు. వాటితో పాటు.. భూమిపై నాగుపాముల భయం ఉండదట. ఆవు గిట్టల్లో గంధర్వులుంటారు. కనుక గిట్టలను పూజిస్తే… గంధర్వలోక ప్రాప్తి. గిట్టల ప్రక్కన అప్సరసలుంటారు. ఆ భాగాన్ని పూజిస్తే… సఖ్యత, సౌందర్యం లభిస్తుందట. అందువల్ల గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తుంటారు.

పూర్వం సాధువులు అధికంగా గోవు (ఆవు)కు పూజలు జరుపుతుండేవారు. వివిధ మఠాల పీఠాధిపతులు, రామకృష్ణ పరమహంస, వివేకానంద వంటి సాధువులందరూ ఇష్టపడి చేసే పూజ గోపూజ. త్రిమూర్తులు, సకల దేవతలు గోవుమాతపైనే కొలువై ఉన్నట్టు ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

దేవలోక గోవు పటాన్ని గమనించినట్లైతే అందులో గోవు తోక భాగంలో లక్ష్మీదేవి ఉన్నట్టు చూడవచ్చు. అందువల్లనే ఇప్పుడు కూడా చాలా మంది గోవు తోకను స్పర్శించి ప్రార్థిస్తుంటారు. గోవు పాదాల నుంచి కొమ్ముల వరకు దేవతలు, త్రిమూర్తులు కొలువుండటం వలన గోవును దేవతగా భావించి పూజలు చేస్తుంటారు.

విజ్ఞాన పరంగా చూసినట్లైతే గోవు పంచితం క్రిమి సంహారిగాను (రసాయ పదార్థం) ఉపయోపడుతుంది. అంతేకాకుండా గోవు ఇచ్చే పాలు తల్లితో పాటు శ్రేష్టంగా ఉండటం గమనించవచ్చు. గోవు శాఖాహారిగాను, సాధు జంతువుగా ఉన్నందునే కాకుండా, అది మనకు ఉపయోగకారిగా ఉన్నందునే దాన్ని మన గృహాల్లో పెంచుకుంటున్నాము.

కామోద్రేక్తంతో చేసే తప్పుల వలన కలిగే దోషాలను కూడా గోపూజ ద్వారా నివారించుకోవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలలో పేర్కొనడం జరిగింది. అంటే గోవును పూజించడం మాత్రమే కాకుండా గోవును దేవాలయానికి దానంగా ఇవ్వడం, గోవు వలన మనకు సిద్ధించే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి పదార్థాలను ఇతరులకు దానంగా ఇవ్వడం కూడా గోపూజతో సమానమేనని పండితులు భావిస్తున్నారు.

అలాగే దేవ రహస్యాన్ని కనుగొనే మహత్మ్యం గోవుకు మాత్రమే ఉంటుందని శాస్త్రాలు చెపుతున్నాయి. అందువల్లే గోపూజకు శాస్త్రాల్లో కీలక ప్రాముఖ్యత సంతరించుకుంది.

గోవు జంతువే కానీ ప్రపంచంలో మరే జంతువుకూ లేని చాలా ప్రత్యేకతలు గోవుకుంది.
అందుకే హిందువులు తమ తల్లి తర్వాత తల్లి స్థానాన్ని ఇచ్చి ”గోమాత” అని గౌరవంగా పిలుస్తూ పూజిస్తారు.

24 Ekadashalu Names and benefits

ఏకాదశుల పేర్లు – వాటి ఫలాలు (24 Ekadashalu Names and benefits) చైత్ర మాసం చైత్రశుద్ధ ఏకాదశి (పున్నమి ముందు వచ్చే ఏకాదశి) – ‘కామదా’ – కోర్కెలు తీరుస్తుంది చైత్ర బహుళ ఏకాదశి (అమావాస్య ముందు వచ్చే ఏకాదశి)...

Ugadi 2019 Vikari Nama Samavatsaram

Vikari Nama Samavatsaram   రాశి  ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం మేషరాశి 14 14 03 06 వృషభరాశి 08 08 06 06 మిథునరాశి 11 5 2 2 కర్కాటకరాశి 5 5 5 2 సింహరాశి...

Akshaya Truteeya

అక్షయ తృతీయ (Akshaya Truteeya) వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అంటే కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహారంలోకి వచ్చింది. ఇంకా “అక్షయ తృతీయ” నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నారు. అటువంటి...

Vibhuti Mahima

విభూతి మహిమ (Vibhuti Mahima) కైలాసం నుండి శంకరుడు బ్రాహ్మణుని వేషములో ఒకనాడు రాముడి వద్దకు వెల్లెను రాముడు మీ యొక్క నామమును నివాసమును తెలుపుమని అడుగగా ” నా పేరు శంభుడు నేను కైలాసం నా యొక్క నివాసము అని...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!