Home » Sri Devi » Sri Gauri Dashakam

Sri Gauri Dashakam

శ్రీ గౌరి దశకం (Sri Gauri Dashakam)

లీలారబ్ధస్థాపితలుప్తాఖిలలొకాం
లొకాతీతైర్యోగిభిరన్తశ్చిరమృగ్యామ్|
బాలాదిత్యశ్రెణిసమానద్యుతిపుంజాం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడె||౧||

తన లీలచే సమస్తలోకములను సృష్టించి కాపాడి నశింపచేయునదీ, లోకాతీతులైన యోగులచే చిరకాలముగా వెతకబడుచున్నదీ, బాలసూర్యసమూహము వంటి కాంతి మండలము కలదీ, పద్మములవంటి కన్నులు కలదీ అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

ప్రత్యాహారధ్యానసమాధిస్థితిభాజాం
నిత్యం చిత్తే నిర్వృతికాష్టాం కలయంతీమ్|
సత్యజ్ఞానానన్దమయీం తాం తనురూపాం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడె||౨||

ప్రత్యాహారము-ధ్యానము-సమాధి అనుయోగముల నాచరించు యోగుల మనస్సునందు ఎల్లప్పుడు సంతోషమును కలిగించునదీ, సత్యము- జ్ఞానము- ఆనందములు స్వరూపముగా కలదీ, సూక్ష్మరూపమున్నదీ, పద్మములవంటి కన్నులు కలదీ,అగు జగదంబయైన గౌరీదేవిని నేనుస్తుతించుచున్నాను.

చన్ద్రాపీడానన్దితమన్దస్మితవక్త్రాం
చన్ద్రాపీడాలంకృతనీలాలకశొభామ్|
ఇంద్రొపెంద్రాద్యర్చితపాదామ్బుజయుగ్మాం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడె||౩||

చంద్రచూడుడగు శివునిచే ఆనందింపచేయబడిన చిరునవ్వు ముఖము కలదీ, తన నల్లని కురులలో చంద్రుని అలంకరించుకున్నదీ, ఇంద్రుడు- విష్ణువు మొదలగు దేవతలచే పూజింపబడు పాదపద్మములు కలదీ, పద్మముల వంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

ఆదిక్షాన్తామక్షరమూర్త్యా విలసన్తీం
భూతె భూతె భూతకదంబప్రసవిత్రీమ్|
శబ్దబ్రహ్మానందమయీం తాం తటిదాభాం
గౌరీమంబామంబురుహాక్షీమహమీడే||౪||

’అ’ కారము మొదలు ’క్ష’ కారము వరకు ఉన్న అక్షరములు తన స్వరూపముగా విలసిల్లుచున్నదీ, పంచమహాభూతములలో (భూమి- నీరు- గాలి- అగ్ని- ఆకాశము) ప్రతి దానియందు అనేక ప్రాణులను సృష్టించునదీ, శబ్దబ్రహ్మస్వరూపిణియైనదీ, ఆనందముతో నండినదీ మెరుపువలే ప్రకాశించునదీ, పద్మముల వంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీ దేవిని నేను స్తుతించుచున్నాను.

మూలాధారాదుత్థితవీథ్యా విధిరన్ధ్రం
సౌరం చాన్ద్రం వ్యాప్య విహారజ్వలితాఙ్గీమ్|
యేయం సూక్ష్మాత్సూక్ష్మతనుస్తాం సుఖరూపాం
గౌరీమంబామమ్బురుహాక్షీమహమీడే||౫||

సుషుమ్నానాడీ మార్గము ద్వారా మూలాదారచక్రము నుండి బ్రహ్మరంధ్రము వరకు సూర్య చంద్రస్థానములైన ’ఇడా’ ’పీంగళా’ నాడుల యందు విహారించు తేజోమూర్తియైనదీ, సూక్ష్మమైన పధార్థము కంటే సూక్ష్మమైనదీ, సుఖస్వరూపిణియైనదీ, పద్మముల వంటి కన్నుల కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని స్తుతించుచున్నాను.

నిత్యః శుద్ధో నిష్కల ఎకో జగదీశః
సాక్షీ యస్యాః సర్గవిధౌ సంహరణే చ|
విశ్వత్రాణక్రీడనలోలాం శివపత్నీం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే||౬||

నిత్యుడు- శుద్దుడు- పరిపూర్ణుడు- ఒక్కడు- జగదీశుడు అగు పరమేశ్వరుడు గౌరీదేవిని చేయు సృష్టి స్థితిలయలకు సాక్షి, ప్రపంచరక్షణము అను క్రీడయందు ఇష్టము కలదీ, శివుని భార్య యైనదీ, పద్మములవంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

యస్యాః కుక్షౌ లీనమఖణ్డం జగదణ్డం
భూయోభూయః ప్రాదురభూదుత్థితమేవ|
పత్యా సార్ధం తాం రజతాద్రౌ విహరన్తీం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే||౭||

గౌరీదేవి గర్భమునందున్న సమస్తలోకములు మరల మరల పుట్టుచుండును. లీనమగుచుండును. భర్తతో కలిసి వెండికొండపై విహరించునదీ,పద్మములవంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

యస్యామోతం ప్రోతమశేషం మణిమాలా
సూత్రే యద్వత్ క్వాపి చరం చాప్యచరం చ|
తామధ్యాత్మజ్ఞానపదవ్యా గమనీయాం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే||౮||

చరాచరరూపమైన ఈ ప్రపంచమంతయు, దారము నందు మణులవలే గౌరీ దేవియందు అల్లుకుని ఉన్నది. అద్యాత్మజ్ఞానమార్గముచే తెలుసుకొనదగినదీ, పద్మములవంటి కన్నులు కలదీ. అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

నానాకారైః శక్తికదమ్బైర్భువనాని
వాప్య స్వైరం క్రీడతి యేయం స్వయమేకా|
కల్యాణీం తాం కల్పలతామానతిభాజాం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే||౯||

గౌరీదేవి తాను ఒక్కతేగానే ఉండి శక్తివంతములైన నానారూపములతో లోకములనన్నిటినీ వ్యాపించి స్వేచ్చగా క్రీడించిచున్నది. కళ్యాణస్వరూపిణి, భక్తుల పాలిట కల్పలత, పద్మములవంటి కన్నులు కలదీ. అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

ఆశాపాశక్లేశవినాశం విదధానాం
పాదామ్భోజధ్యానపరాణాం పురుషాణామ్|
ఈశామీశార్ధాఙ్గహరాం తామభిరామాం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే||౧౦||

తన పద్మములను ధ్యానించు మనుషులకు ఆశాపాశములవలన కలుగు బాధలను నశింపచేయునదీ, పరమశివుని అర్ధాంగి, పరమేశ్వరీ, పద్మములవంటి కన్నులు కలదీ అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

ప్రాతఃకాలే భావవిశుద్ధః ప్రణిధానా-
ద్భక్త్యా నిత్యం జల్పతి గౌరీదశకం యః|
వాచాం సిద్ధిం సంపదమగ్ర్యాం శివభక్తిం
తశ్యావశ్యం పర్వతపుత్రీ విదధాతి||౧౧||

ఎవరైతే శుద్ధమైన హృదయమును కలవాడై భక్తితో ప్రాతఃకాలమునందు ఈ గౌరీ దశకమను స్తోత్రమును పఠించునో అతనికి వాక్సిద్దినీ, ఉన్నతమైన సంపదను, శివభక్తినీ గౌరీదేవి తప్పక ప్రసాదించును.

Ashta dasa Shakti Peeta Stotram

అష్టాదశ శక్తి పీఠ స్తోత్రం ‌ లంకాయా శాంకరీ దేవీ కామాక్షీ కాంచికాపురే ప్రద్యుమ్నేశృంకలాదేవి చాముండి క్రౌంచపట్టనే అల్లంపురే జోగులాంబ శ్రీశైలే బ్రమరాంబికా కొల్హాపురే మహాలక్ష్మీ మాహుర్యే ఏకవీరికా ఉజ్జయిన్యాం మహాకాళి పీటిక్యాం పురుహూతికా ఒడ్యానం గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికే హరిక్షేత్రే...

Sri Jonnawada Kamakshi Taayi Pancharathnam

శ్రీ జొన్నవాడ కామాక్షి తాయి పంచరత్న స్తోత్రం (Sri Jonnawada Kamakshi Pancharathnam) శ్రీ శ్వేతాచల వాసినీ భగవతీ చిన్ముద్రికా రూపిణీ హ్రీంకారైక పరాయిణీ రసమయీ సానంద సమ్మోహినీ వందే ఆశ్రిత భాక్తరక్షిణీ సతీ శ్రీ యజ్ఞ వాటీశ్వరీ కామాక్షీ వర...

Devi Shatkam

దేవీషట్కం (Devi Shatkam) అంబ శశిబింబవదనే కంబుగ్రీవే కఠోరకుచకుంభే అంబరసమానమధ్యే శంబరరిపువైరిదేవి మాం పాహి || 1 || కుందముకులాగ్రదంతాం కుంకుమపంకేన లిప్తకుచభారాం ఆనీలనీలదేహామంబామఖిలాండనాయకీం వందే || 2 || సరిగమపధనిసతాంతాం వీణాసంక్రాంతచారుహస్తాం తామ్ శాంతాం మృదులస్వాంతాం కుచభరతాంతాం నమామి శివకాంతాం || 3...

Sri Mahishasuramardhini ashtottara Sathanamavali

శ్రీ మహిషాసుర మర్ధిని అష్టోత్తర శతనామావళి (Sri Mahishasura Mardini ashtottara Shatanamavali) ఓం మాహత్యై నమః ఓం చేతనాయై నమః ఓం మాయాయై నమః ఓం మహాగౌర్యై నమః ఓం మహేశ్వర్యై నమః ఓం మహోదరాయై నమః ఓం మహాకాళ్యై...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!