Home » Stotras » Sri Annapurna Devi Stotram

Sri Annapurna Devi Stotram

శ్రీ అన్నపూర్ణా దేవీ స్తోత్రం (Sri Annapurna Devi Stotram)

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ |
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 1 ||

నానా రత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ
ముక్తాహార విలంబమాన విలసత్-వక్షోజ కుంభాంతరీ |
కాశ్మీరాగరు వాసితా రుచికరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 2 ||

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్ఠాకరీ
చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ |
సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 3 ||

కైలాసాచల కందరాలయకరీ గౌరీ-హ్యుమాశాంకరీ
కౌమారీ నిగమార్థ-గోచరకరీ-హ్యోంకార-బీజాక్షరీ |
మోక్షద్వార-కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 4 ||

దృశ్యాదృశ్య-విభూతి-వాహనకరీ బ్రహ్మాండ-భాండోదరీ
లీలా-నాటక-సూత్ర-ఖేలనకరీ విఙ్ఞాన-దీపాంకురీ |
శ్రీవిశ్వేశమనః-ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 5 ||

ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
వేణీ-నీలసమాన-కుంతలధరీ నిత్యాన్న-దానేశ్వరీ |
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 6 ||

ఆదిక్షాంత-సమస్తవర్ణనకరీ శంభోస్త్రిభావాకరీ
కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శర్వరీ |
స్వర్గద్వార-కపాట-పాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 7 ||

దేవీ సర్వవిచిత్ర-రత్నరుచితా దాక్షాయిణీ సుందరీ
వామా-స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ |
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 8 ||

చంద్రార్కానల-కోటికోటి-సదృశీ చంద్రాంశు-బింబాధరీ
చంద్రార్కాగ్ని-సమాన-కుండల-ధరీ చంద్రార్క-వర్ణేశ్వరీ
మాలా-పుస్తక-పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 9 ||

క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ
సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ |
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 10 ||

అన్నపూర్ణే సాదాపూర్ణే శంకర-ప్రాణవల్లభే |
ఙ్ఞాన-వైరాగ్య-సిద్ధయర్థం బిక్బిం దేహి చ పార్వతీ || 11 ||

మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః |
బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ || 12 ||

సర్వ-మంగల-మాంగల్యే శివే సర్వార్థ-సాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమో‌உస్తు తే || 13 ||

Hanumat Langoolastra Stotram

హనుమత్ లాంగూలాస్త్ర స్తోత్రం (Hanumat Langoolastra Stotram) హనుమన్నంజనీ సూనో మహాబల పరాక్రమ | లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 1 || మర్కటాధిప మార్తాండ మండల గ్రాస కారక| లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ|| 2 || అక్షక్షపణ పింగాక్ష దితిజాసుక్షయంకర | లోలల్లాంగూల...

Sri Anjaneya Bhujanga Stotram

ఆంజనేయ భుజంగ స్తోత్రం (Sri Anjaneya Bhujanga Stotram) ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీత శౌర్యం తుషారాద్రి ధైర్యమ్ | తృణీభూత హేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్త మిత్రమ్ || ౧ || భజే పావనం భావనా నిత్యవాసం భజే బాలభానుప్రభాచారుభాసమ్...

Kali Santaraka Stotram

కలి సంతారక స్తోత్రం (Kali Santaraka Stotram) శేషాచలం సమాసాద్య కశ్య పాద్యా మహర్షయః వేంకటేశం రమానాథం శరణం ప్రాపురంజసా! కలి సంతారకం ముఖ్యం స్తోత్రమేతజ్జపేన్నరః సప్తర్షి వాక్ప్రసాదేన విష్ణుస్తస్మై ప్రసీదతి!! కశ్యప ఉవాచ: కాది హ్రీమంత విద్యాయాః ప్రాప్త్యైవ పరదేవతా!...

Shivalinga Abhisheka Benefits

శివాభిషేక ఫలములు (Shiva linga Abhisheka Benefits) గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము,...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!