Home » Stotras » Shri Chitta Stheeryakam Stotram

Shri Chitta Stheeryakam Stotram

చిత్త స్థిర స్త్రోత్రo (Shri ChittaStheeryakam Stotram)

అనసూయాత్రి సంభూత దత్తాత్రేయ మహామతే |
సర్వదేవాధి దేవత్వం మమ చితం స్థిరీకురు || 1 ||

భావము: అత్రి అనసూయల దీపకుడిగా ఉద్భవించిన వాడు సర్వ దేవతలలో నిండిన దైవత్వంను, బుద్దిమంతుడు అయిన శ్రీ దత్తాత్రేయస్వామి. నా మనస్సు నీ మీద స్థిరముగా నిలుపు

శరణాగత దీనార్త తరకాఖిల కారక |
సర్వ చాలక దేవత్వం మమ చిత్తం స్టిరీకురు || 2 ||

భావము : శరణాగతి చెందిన వారికీ,దీనులకు జ్ఞానం ప్రసాదించే వాడు,అందరినీ స్వయం సమృద్ధిగా ఉద్ధరించే వాడు అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి. నా మనస్సు నీ మీద స్థిరముగా నిలుపు.

సర్వ మంగళ మాంగల్య సర్వాధి వ్యాధి భేషజ |
సర్వసంకట హరీన్ త్వం మమ చితం స్థిరీకురు || 3 ||

భావము : అన్ని శుభములకుమంగళ కారివై అన్ని వ్యాధులకు ఔషధం నీవై,అన్ని కష్టములను తొలగించు అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి నా మనస్సు నీ మీద స్థిరముగా నిలుపు.

స్మర్తృగామి స్వ భక్తానాం కామదో రిపు నాశనః |
భుక్తి ముక్తి ప్రద: సత్వం మమ చితం స్థిరీకురు || 4 ||

భావము తన భక్తులు పిలవగానే ప్రత్యక్షమై కామ,క్రోధ,లోభ,మోహం లనే శత్రువులను నాశనం చేసి ఇహ,పర శ్రేయస్సులను సత్వరం మే తీర్చే శ్రీ దత్తాత్రేయ స్వామి..నా మనస్సు నీ మీద స్థిరముగా నిలుపు.

సర్వ పాప క్షయ కర స్తాపదైన్య :నివారణం |
యో భీష్టదః :ప్రభు :సత్వం మమ చితం స్థిరీకురు || 5 ||

భావము అన్ని పాపములు నశింప జేసి,అధ్యామిక,అది బౌతిక,దైవిక తాపాలు నివారించి త్వరగా అభీష్టములు ప్రసాదించు శ్రీ దత్తాత్రేయ స్వామి. నా మనస్సు నీ మీద స్థిరముగా నిలుపు.

య ఏత త్ర్ప్ యతః శ్లోక పంచకం ప్రపటేత్సుదీ:
స్థిర చిత్త స్స భగవాన్ కృపా పాత్రం భవిష్యతి. || 6 ||

భావము శ్రీవాసుదేవానంద సరస్వతి స్వామి విరచిత ఈ పంచకం శ్లోకాలు ఎవరు భక్తితో పఠిస్తారో వారికి భగవాన్ శ్రీ దత్తాత్రేయ అనుగ్రహంతో పాటు స్థిర మైన చిత్తము స్వామి వారిపై కలుగుతుంది.శ్రీ దత్తాత్రేయ స్వామికి అంకితం.

ఈ ఐదు శ్లోకాలు నిత్యము పఠిస్తే దత్తాత్రేయుల వారి అనుగ్రహం తప్పక లభిస్తుంది.

Sri Shyamala Stuti

శ్రీ శ్యామలా స్తుతి (Sri Shyamala Stuti) మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసం ఑ మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసాస్మరామి || 1 || చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగాశోణే | పుండ్రీక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే...

Sri Krishna Ashtakam

శ్రీ కృష్ణాష్టకం (Sri Krishna Ashtakam) వసుదేవసుతం దేవం కంసచాణురమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం || 1 || అతసీ పుష్పసంకాశం హారనూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం || 2 || కుటిలాలక...

Sri Skanda Shatkam

శ్రీ స్కంద షట్కం (Sri Skanda Shatkam) షణ్ముఖం పార్వతీపుత్రం క్రౌంచశైలవిమర్దనం | దేవసేనాపతిం దేవం స్కందం వందే శివాత్మజం || 1 || తారకాసురహంతారం మయూరాసనసంస్థితం | శక్తిపాణిం చ దేవేశం స్కందం వందే శివాత్మజం || 2 ||...

Sri Eswara Prardhana Stotram

శ్రీ ఈశ్వర ప్రార్థనా స్తోత్రం (Sri Eswara Prardhana Stotram) ఈశ్వరం శరణం యామి క్రోధమోహాదిపీడితః అనాథం పతితం దీనం పాహి మాం పరమేశ్వర ప్రభుస్త్వం జగతాం స్వామిన్ వశ్యం సర్వం తవాస్తి చ అహమజ్ఞో విమూఢోస్మి త్వాం న జానామి...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!