Home » Stotras » Sri Rama Vaibhava Ashtaratna Malika Stotram

Sri Rama Vaibhava Ashtaratna Malika Stotram

శ్రీ రామ వైభవ అష్టరత్నమాలికా స్తోత్రం (Sri Rama Vaibhava Ashtaratna Malika Stotram)

సీతామనోహరభరతలక్ష్మణాగ్రజం
శతృఘ్నప్రియవాతాత్మజవందితం
ఘోరపాపహరణకరుణారససాగరం
రావణాదిభంజన రామచంద్రం భజే || 1 ||

కాలకాలవందితవిధిసురేంద్రవంద్యం
శివధనుర్భంజనప్రచండశౌర్యం
సప్తతాలభంజనసుగ్రీవరక్షకం
అయోధ్యపాలక రామచంద్రం భజే || 2 ||

కౌశికమఖసంరక్షకవీరాధివీరం
పితృవాక్యపాలకఘోరవిపినవాసం
జన్మజన్మాంతరపాశవిమోచకం
తాటకసంహర రామచంద్రం భజే || 3 ||

పూర్వభాషణప్రియస్మితమందహాసం
రామదాసత్యాగరాజరచనావైభవం
జామదగ్న్యమదదర్పగర్వభంజనం
బ్రహ్మవిద్యానిధిం రామచంద్రం భజే || 4 ||

శరభంగనారదాదిమునివందితపదం
శశాంకరవివహ్నికోటిప్రభాభాసురం
శాశ్వతైశ్వర్యప్రదతారకమంత్రం
వీరాసనసంస్థిత రామచంద్రం భజే || 5 ||

ధర్మనిష్ఠాపరభవ్యనిశ్చయాత్మకం
రాజ్యకాంక్షారహితనిర్మలమానసం
జటాయుమోక్షప్రదభవ్యరాజఋషిం
నీలమేఘశ్యామ రామచంద్రం భజే || 6 ||

దుర్మదాంధవాలిహరసుగ్రీవరాజ్యదం
దుర్నిరీక్ష్యప్రతాపచండప్రచండం
దోర్దండకోదండధరభక్తరక్షకం
భద్రాచలవాస రామచంద్రం భజే || 7 ||

నాదబిందుకళాతీతనాదపరబ్రహ్మం
నమ్రవినయశీలగురువాక్యపాలకం
నదీసరయూవిహారసీతాసమేతం
మోహహరకుఠారం రామచంద్రం భజే ||8 ||

సర్వం శ్రీరామ చంద్ర దివ్యచరణారవిందార్పణమస్తు

Garbha Rakshambika Stotram

శౌనక మహర్షి విరచిత గర్భరక్షాంభికా స్తోత్రం (Garbha Rakshambika Stotram) శౌనక మహర్షి విరచిత శ్రీ గర్భరక్షా స్తోత్రం  ఏహ్యేహి భగవాన్ బ్రహ్మన్ ప్రజా కర్తా, ప్రజా పతే ప్రగృహ్షీణివ బలిం చ ఇమం ఆపత్యాం రక్ష గర్భిణీం || 1 ||...

Mangalagiri Kshetram

మంగళగిరి పానకాల నరసింహ స్వామి క్షేత్రం (Sri Mangalagiri Lakshmi Narasimha Swamy Temple (Kshetram)) మంగళగిరి గుంటూరు జిల్లాలో ఉన్నది. గుంటూరు – విజయవాడ జాతీయ రహదారి పై గుంటూరుకు 20 కి.మీ దూరంలో ఉన్న ఈ చారిత్రక పట్టణములో...

Sri Skandamatha Dwadasa Nama Stotram

శ్రీ స్కంద మాతా ద్వాదశ నామ స్తోత్రం (Sri Skandamatha Dwadasa Nama Stotram) ప్రధమం స్కందమాతా చ, ద్వితీయం పద్మాసనీం తృతీయం ధవళవర్ణాంశ్చ, చతుర్ధం సింహావాహినీం పంచమం అభయముద్రాంశ్చ , షష్టం మోక్షదాయినీం సప్తమం విశుద్ధ చక్రస్తాం, అష్టమం త్రిలోచయనీం...

Sri Mangala Gowri Vratham

శ్రీ మంగళ గౌరీ వ్రత కథ (Sri Mangala Gowri Vratham) పూర్వం ధర్మపాలుడనే ఒక ధనికునికి సదాచార సంపన్నురాలైన భార్య ఉండేది. కానీ వారికి పుత్ర సంతానం లేదు. వారు ఎన్నో వ్రతాలు చేశారు. దానాలు చేశారు. కానీ సంతానం...

More Reading

Post navigation

error: Content is protected !!