Home » Stotras » Sri Saibaba Madhyahana Harathi

Sri Saibaba Madhyahana Harathi

శ్రీ సాయిబాబా మధ్యాహ్న హారతి…

శ్రీ సత్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
చేకొనుమా పంచారతి సాయి బాబా నీకే హారతి
ఈయగ హారతి రారే సాయి బాబాకే హారతి
భక్తులార రారండి కలసి ఇవ్వగ సాయికి హారతి
సాయిరామాథవ స్వామి నీకే హారతి
నిశ్చలమున మనసుంచి మదిని ధ్యానించే మంత్రమ్
సాయిరాముని స్మరణమ్ సర్వజీవాధారమె మంత్రమ్
కృష్ణనాథ దత్తసాయి మా చిత్తము నీదోయి
స్వామి సాయినాథ స్వామి మా సర్వము నీవోయి
హారతి సాయిబాబా

సౌఖ్యదాత మా దేవ శరణమయ్యా స్వామి
భక్త దాసా వికాసా దేవా లోకేశ
హారతి సాయిబాబా

కామక్రోధమొదిలించు సత్యమేదో వచించు
ముముక్ష మానవుల వసియించేవు రంగ నీవే శ్రీరంగ
హారతి సాయిబాబా

భావన ఏదైతే అదే అనుగ్రహించె దయాధనా సాయి
ఇది ఏమి మాయ ఇది నీ మాయ
హారతి సాయిబాబా

స్వామి సాయి నామమే సుఖః సంతోష తీరమ్
అనాధ జీవులకే అదె ఆశ్రయసదనమ్ ఆనంద సదనమ్
హారతి సాయిబాబా

కలియుగ అవతార పరబ్రహ్మావతార అవధరించినావయ్య
ఇల దత్తస్వరూప సాయి స్వరూప
హారతి సాయిబాబా

ప్రియమాయె గురువారమ్ పర్వదినమాయె భక్తుల ప్రభుపదసేవలలో
భవభయములు బాపగ నీవే బాసట
హారతి సాయిబాబా

కోరము ఏ వరమూ నీ పదసేవ తప్ప
ఆ అభయముమీద స్వామి సాయిస్వరూప ప్రేమస్వరూప
హారతి సాయిబాబా

దీనుల మము దయతో పాలింపుము దేవ
ఆశ్రిత వదనుడవై ఆలింపుము దేవ మమ్ముల బ్రోవ
హారతి సాయిబాబా

సౌఖ్యదాత మా దేవ శరణమయ్యా స్వామి
భక్త దాసా వికాసా దేవా లోకేశ
హారతి సాయిబాబా

జయదేవ జయదేవ దత్త అవధూత ఓ సాయి అవధూత
శిరమొంచి పదమంటెదమయ్యా నీ చెంత

జయదేవ జయదేవ ధర్మము నిలకావగనే అవతారము దాల్చి
నాస్తికులను సైతము తన ఆస్తికులుగ జేసె
నీలీలు సాగె ఎన్నెన్నో రూపాలై దీనులను కాచేనిక సంకటములు బాపి
జయదేవ జయదేవ దత్త అవధూత ఓ సాయి అవధూత
శిరమొంచి పదమంటెదమయ్యా నీ చెంత

జయదేవ జయదేవ యవన రూపమున మాకు దర్శనమే ఇచ్చి
సంశయముల పిడదీసి సాగిల పడవేసి
మూఢులను కరుణించి తరియింపగజేసి
మోవిన వంశీ జన్ముడ లోకము పాలించె
జయదేవ జయదేవ దత్త అవధూత ఓ సాయి అవధూత
శిరమొంచి పదమంటెదమయ్యా నీ చెంత

జయదేవ జయదేవ భేధములెంచక హిందు ముస్లీమ్ ఒకటంటు
నరులంత ఒకటేయని పరభేధము వలదంటు
పలువురిని ఒకపరినే చూసేవుగ స్వామి
పరమాత్మవు నీవై సర్వమ్ముకు సాయి
జయదేవ జయదేవ దత్త అవధూత ఓ సాయి అవధూత
శిరమొంచి పదమంటెదమయ్యా నీ చెంత

జయదేవ జయదేవ దేవా సాయీనాథ వందనము స్వామి
మాయామోహమునుండి మరలించుము మమ్ము
సంకటములనెల్ల నీ కృపతో తొలగించి
సేవించే భాగ్యమ్మును శక్తిని మాకిమ్మ
జయదేవ జయదేవ దత్త అవధూత ఓ సాయి అవధూత
శిరమొంచి పదమంటెదమయ్యా నీ చెంత

జయదేవ జయదేవ శిరిడి మా పండరీపురమ్ సాయిబాబా రమావరుడు
బాబా రమావరుడు సాయిబాబా రమావరుడు
శుధ్ధభక్తియె చంద్రభాగ భావరూపుడే పుండరీకుడు
పుండరీకునీ భాగ నా భావరూపమె కాగ
రండు రండి భక్తుల్లార చేయగ సాయికి వందనమ్
సాయికి వందనమనరె స్వామి సాయికి వందనమనరె
పరుగునచేరి కావుము తండ్రి పతిత జనులను బ్రోవుము తండ్రి
పరుగునచేరి కావుము తండ్రి పతిత జనులను బ్రోవుము తండ్రి
సాయికి సాష్టాంగ వందనము పావనమూర్తికి వందనము
పండరినాథ వందనము జయ జయ సాయికి వందనము
త్వమేవమాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుచ్య సఖత్వమేవ
త్వమేవవిద్యా దర్యంత్వమేవ త్వమేవ సర్వమ్ మమదేవ దేవ
సాయేనవాచ మనసేంద్రియైవ ఉద్యాత్మనావ ప్రకృతి స్వభావ
తరీనియద్యత్ సకలమ్ పరస్మయ్ నారాయణాయైచి సమర్పయామి
అచ్యుతమ్ కేశవమ్ రామనారాయణమ్ కృష్ణ దామోదరమ్ వాసుదేవంభని
శ్రీధరమ్ మాధవమ్ గోపికా వల్లభమ్ జానకీ నాయకమ్ రామచంద్రమ్ భజే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరిహి ఓం గురుదేవదత్త హరిహి ఓం

Sri Garuda Dhwaja Stotram

శ్రీ గరూడ ధ్వజ స్తోత్రం (Garuda Dhwaja Stotram) ధ్రువ ఉవాచ యోన్తః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సఞ్జీయత్యఖిలశక్‍తిధరః స్వధామ్నా । అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్- ప్రాణాన్నమో భగవతే పురూషాయ తుభ్యమ్ ॥ 1॥ ఏకస్త్వమేవ భగవన్నిదమాత్మశక్‍త్యా మాయాఖ్యయోరూగుణయా మహదాద్యశేషమ్ ।...

Sri Sarada Devi Stotram

శ్రీ శారద దేవీ స్తోత్రం( Sri Sarada Devi Stotram) నమస్తే శారదా దేవీ కాశ్మీరపురవాసిని | త్వామహం ప్రార్ధయే నిత్యం విధ్యాదానం చ దేహిమే || 1 || యాశ్రద్ధ ధారణా మేధా వాగ్దేవి విధివల్లభ | భక్తి జిహ్వగ్రా...

Sri Datta Atharvashirsham

శ్రీ దత్త అథర్వ శీర్షం (Sri Datta Atharvashirsham) ఓం నమో భగవతే దత్తాత్రేయాయ అవధూతాయ దిగంబరాయవిధిహరిహరాయ ఆదితత్త్వాయ ఆదిశక్తయే || 1 || త్వం చరాచరాత్మకః సర్వవ్యాపీ సర్వసాక్షీ త్వం దిక్కాలాతీతః త్వం ద్వంద్వాతీతః || 2 || త్వం...

Sri Kanchi Kamakshi Stotram

శ్రీ కంచి కామాక్షీ స్తోత్రమ్ (Sri Kanchi Kamakshi Stotram) కాంచినూపురరత్నకఙ్కణలసత్కేయూరహారోజ్జ్వలాం కాశ్మీరారుణకఞ్చుకాఞ్చితకుచాం కస్తూరికాచర్చితామ్ । కల్హారాఞ్చితకల్పకోజ్జ్వలముఖీం కారుణ్యకల్లోలినీం కామాక్షీం కలయామి కల్పలతికాం కాఞ్చీపురీదేవతామ్ ॥ ౧॥ కామారాతిమనఃప్రియాం కమలభూసేవ్యాం రమారాధితాం కన్దర్పాధికదర్పదానవిలసత్సౌన్దర్యదీపాఙ్కురామ్ । కీరాలాపవినోదినీం భగవతీం కామ్యప్రదానవ్రతాం కామాక్షీం కలయామి...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!