Home » Shakti Peethalau » Srisaila Bhramarambika Devi Shakti Peetam
srisaila bramarambika devi shakthi peetam

Srisaila Bhramarambika Devi Shakti Peetam

శ్రీ భ్రమరాంబిక దేవీ శక్తి పీఠం (Srisaila Bramarambika Devi Shakti Peetam)

శ్రీశైల క్షేత్రం లో  సతి మెడ భాగం పడిన చోటు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకూ మునులకూ కంటకుడుగా తయారయ్యాడట. రెండు, నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ని సంహరించేందుకు అమ్మవారు ఇక్కడ కొలువైన సతి ‘శక్తి’ భ్రమర (తుమ్మెద) రూపంలో అవతరించిందట. అసురవధ అనంతరం భ్రమరాంబికగా అమ్మవారు ఈ క్షేత్రంలోనే మల్లికార్జునస్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థలపురాణం. శంకరాచార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీ చక్ర ప్రతిష్ఠాపన చేసి, భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైలక్షేత్రంలోనే ఆయన ‘సౌందర్య లహరి’ కూడా రచించారని చెబుతారు.

Sri Kamakhya Devi Shakti Peetam

శ్రీ కామాఖ్య దేవి శక్తి పీటం (Sri Kamakhya Devi Shakti Peetam) అసోం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వతశిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారనీ స్థలపురాణం. అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం...

Sri Ujjaini Mahakali Shakti Peetam

శ్రీ ఉజ్జయినీ మహాకాళీ శక్తి పీఠం(Sri Ujjaini Mahakali Shakti Peetham) సప్త వోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయినీ నగరంలో సతీదేవి పై పెదవి పడిందని దేవీ భాగవతం చెబుతోంది. ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి. ఈ...

Kanchi Kamakshi Shakti Peetam

కంచి కామాక్షీ శక్తి పీఠం  (Kanchi Kamakshi Shakti Peetam) ఈ క్షేత్రం తమిళనాడు రాజధాని చెన్నై కి 70 కిలోమీటర్ల దూరం లో  నెలకొని ఉంది ఇక్కడ సతీ దేవి వీపు భాగం పడింది అని చెబుతారు. ఇక్కడ అమ్మవారు...

Sri Chamundeshwari Shakti Peetam, Mysore

శ్రీ చాముండేశ్వరి శక్తి పీఠం, మైసూరు (Sri Chamundeshwari Shakti Peetam) ఈ క్షేత్రం కర్ణాటక రాజధాని అయిన బెంగుళూరు కి 120 కిలోమీటర్ల దూరం లో  మైసూరు లో ఉంటుంది దీనినే క్రౌంచ పట్టణం అని కూడా అంటారు. ఇక్కడ అమ్మవారి...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!