Home » Stotras » Sri Vinayaka Stotram
vinayaka stotram

Sri Vinayaka Stotram

శ్రీ వినాయక స్తోత్రం (Sri Vinayaka Stotram)

తొండమునేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయగజ్జెలను మెల్లని చూపులు మంద హాసమున్ కొండొక గుజ్జ రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడు పార్వతి తనయయోయి గణాదిపా నీకు మ్రోక్కెన్ || 1 ||

తొలుతన విఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయుమయ్య నిన్ను ప్రార్ధన చేసేద నేకదంత నా వలపటి చేతి ఘంటమును వాక్కును నెప్పుడు బాయకుండుమీ తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోకనాయక || 2 ||

తలచెదనే గణనాధుని తలచెదనే విఘ్న పతిని దలచిన పనిగా ధలచనే హీరంభుని దలచెద నా విఘ్నములను తొలగుట కోరుకున్ || 3 ||

అటుకులు కొబ్బరి పలుకులు చిట్టి బెల్లము నానబ్రాలు చెరుకురసంభున్ విటలాక్షునగ్ర సుతునకు పటుతరముగ విందుచేతు ప్రార్దింతు మదిన్ || 4||

అంకముజేరి శైలతనయా స్తన దుగ్ధము లానువేళ బా ల్యాంకవిచేష్ట తుండమున యవ్వలిచ న్గబలింపబోయి యావంక కుచంబుగాన కహివల్లభ హారముగాంచి వేమృణా లాంకుర శంకనంటెడు గాజాస్యుని గొల్తు నభీష్టసిద్ధికిన్ || 5 ||

ఈశునంతవాని ఎదురించి పోరాడి మడిసివాని చేత మరళాబ్రతికి
సర్వవంద్యు డైన సామజాతమూర్తి – కంజలింతు విఘ్న భంజనునకు

Sri Sandhya Krutha Shiva Sthotram

శ్రీ సంధ్యా కృత శివ స్తోత్రం (Sri Sandhya Krutha Shiva Sthotram) నిరాకారం జ్ఞానగమ్యం పరం యత్ ,నైనస్థూలం నాపి సూక్ష్మం న చోచ్చమ్| అంతశ్చింత్యం యోగిభిస్తస్య రూపం, తస్మై తుభ్యం లోకకర్తె నమోస్తు || 1 || సర్వం...

Gakara Ganapathy Ashtothra Shatanamavali

గకార గణపతి అష్టోత్తర శతనామావళి (Gakara Ganapathy Ashtothra Shatanamavali) ఓం గకారరూపాయ నమః ఓం గం బీజాయ నమః ఓం గణేశాయ నమః ఓం గానవందితాయ నమః ఓం గణనీయాయ నమః ఓం గణాయ నమః ఓం గణ్యాయనమః ఓం...

Sri Durga Stotram

శ్రీ దుర్గా స్తోత్రం (Sri Durga Stotram) విరాటనగరం రమ్యం గచ్ఛమానో యుధిష్ఠిరః | అస్తువన్మనసా దేవీం దుర్గాం త్రిభువనేశ్వరీమ్ || ౧ || యశోదాగర్భసంభూతాం నారాయణవరప్రియాం నందగోపకులేజాతాం మంగళాం కులవర్ధనీమ్ || ౨ || కంస విద్రావణకరీం అసురాణాం క్షయంకరీం...

Sri Ganesha Suprabhatha Stuthi

శ్రీ గణేశ సుప్రభాత స్తుతి (Sri Ganesha Suprabhatha Stuthi) శాంకరీసుప్రజా దేవ ప్రాతః కాలః ప్రవర్తతే ఉత్తిష్ట శ్రీ గణాధీశ త్రైలోక్యం మంగళం కురు || 1 || ఉత్తిష్ట భో! దయసింధో! కవినాం త్వం కవి: ప్రభో |...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!