Home » Stotras » Sri Vinayaka Stotram
vinayaka stotram

Sri Vinayaka Stotram

శ్రీ వినాయక స్తోత్రం (Sri Vinayaka Stotram)

తొండమునేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయగజ్జెలను మెల్లని చూపులు మంద హాసమున్ కొండొక గుజ్జ రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడు పార్వతి తనయయోయి గణాదిపా నీకు మ్రోక్కెన్ || 1 ||

తొలుతన విఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయుమయ్య నిన్ను ప్రార్ధన చేసేద నేకదంత నా వలపటి చేతి ఘంటమును వాక్కును నెప్పుడు బాయకుండుమీ తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోకనాయక || 2 ||

తలచెదనే గణనాధుని తలచెదనే విఘ్న పతిని దలచిన పనిగా ధలచనే హీరంభుని దలచెద నా విఘ్నములను తొలగుట కోరుకున్ || 3 ||

అటుకులు కొబ్బరి పలుకులు చిట్టి బెల్లము నానబ్రాలు చెరుకురసంభున్ విటలాక్షునగ్ర సుతునకు పటుతరముగ విందుచేతు ప్రార్దింతు మదిన్ || 4||

అంకముజేరి శైలతనయా స్తన దుగ్ధము లానువేళ బా ల్యాంకవిచేష్ట తుండమున యవ్వలిచ న్గబలింపబోయి యావంక కుచంబుగాన కహివల్లభ హారముగాంచి వేమృణా లాంకుర శంకనంటెడు గాజాస్యుని గొల్తు నభీష్టసిద్ధికిన్ || 5 ||

ఈశునంతవాని ఎదురించి పోరాడి మడిసివాని చేత మరళాబ్రతికి
సర్వవంద్యు డైన సామజాతమూర్తి – కంజలింతు విఘ్న భంజనునకు

Sri Mahasastha Kavacham

శ్రీ మహాశాస్తా కవచం (Sri Maha Sastha Kavacham) శ్రీ దేవ్యువాచ భగవాన్ దేవదేవేశ సర్వజ్ఞ త్రిపురాంతక ప్రాప్తే కలియుగే ఘోరే మహా భూతై సమావృతే మహావ్యాధి మహావ్యాళ ఘోరరాజై: సమావృతే దు: స్వప్న శోకసంతాపై:, దుర్వినీతై: సమావృతే స్వధర్మ విరతే...

Sri Durga Stotram

శ్రీ దుర్గా స్తోత్రం (Sri Durga Stotram) విరాటనగరం రమ్యం గచ్ఛమానో యుధిష్ఠిరః | అస్తువన్మనసా దేవీం దుర్గాం త్రిభువనేశ్వరీమ్ || ౧ || యశోదాగర్భసంభూతాం నారాయణవరప్రియాం నందగోపకులేజాతాం మంగళాం కులవర్ధనీమ్ || ౨ || కంస విద్రావణకరీం అసురాణాం క్షయంకరీం...

Sri Varahi Anugraha Ashtakam

శ్రీ వారాహి అనుగ్రహాష్టకం(Sri Varahi Anugraha Ashtakam) ఈశ్వర ఉవాచ మాతర్జగద్రచన-నాటక-సూత్రధార స్త్వద్రూపమాకలయితుం పరమార్థతోయమ్ । ఈశోప్యమీశ్వరపదం సముపైతి తాదృక్ కోన్యః స్తవం కిమివ తావకమాదధాతు ॥ ౧॥ నామాని కిన్తు గృణతస్తవ లోకతుణ్డే నాడమ్బరం స్పృశతి దణ్డధరస్య దణ్డః ।...

Thiruchendur Sri Subrahmanya Swamy temple

తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య  స్వామి క్షేత్రం (Thiruchendur Sri Subrahmanya Swami temple) పూర్వం అగస్త్య మహర్షి కైలాసానికి వెళ్ళి శివుడిని దర్శించి తిరిగి వెళ్ళే సమయంలో శివుడు రెండు కొండలను బహుకరించి శివశక్తి రూపంగా దక్షిణాదికి తీసుకు వెళ్ళి కొలవవలసిందిగా...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!