Home » Dandakam » Sri Anjaneya Dandakam

Sri Anjaneya Dandakam

శ్రీ ఆంజనేయ దండకం (Sri Anjaneya Dandakam)

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం
భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి
నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవై
రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే
అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్ దగ్గరన్ నిల్చియున్ దొల్లి
సుగ్రీవుకున్-మంత్రివై స్వామి కార్యార్థమై యేగి శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి
వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్
లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్య భ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి
యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్‌జేసి సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్ గూడి
యాసేతువున్ దాటి వానరుల్‍మూకలై పెన్మూకలై యాదైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి
బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్‍వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే నీవు సంజీవినిన్‍దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా
కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ
నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి, సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,
యంతన్నయోధ్యాపురిన్‍జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా
నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్‍ల్బాయునే భయములున్ దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో
వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్ వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్ తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామ నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్ పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టి ఘాతంబులన్
బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి
రారోరి నాముద్దు నరసింహ యన్‍చున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా నమస్తే సదా బ్రహ్మచారీ
నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమః

Sri Anjaneya Mangalashtakam

శ్రీ ఆంజనేయ మంగలాష్టకం (Sri Anjaneya Mangalashtakam) వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మంద వాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హానూమతే || 1 || కరుణారస పూర్ణాయ, ఫలా పూప ప్రియాయచ మాణిక్య హార కం థాయ మంగళం...

Sri Vasavi Dandakam

శ్రీ వాసవి దండకం (Sri Vasavi Dandakam) శ్రీమన్ మహాదేవ దేవేశ్వరి యోగ మాయా హార శక్తి చిద్రూపిని నీదుకారుణ్య దీప్తి ప్రసారంబునన్ జ్యేస్ట శైలంబునన్ వైశ్యా వంశంబూనన్ దివ్య లీలావతారంబు మే దాల్చి వైశ్యా ప్రజా నాధుడై నట్టి కౌషూంబ...

Sri Hanuman Chalisa

శ్రీ హనుమాన్ చాలీసా (Sri Hanuman Chalisa) దోహా శ్రీ గురు చరన సరోజ రజ నిజ మను ముకుర సుధార బరణౌం రఘువర విమల యశ  జో దాయకు ఫలచార || బుద్ధిహీన తను జానికే సుమిరౌం పవనకుమార బల...

Sri Veerabrahmendra Swamy Dandakam

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దండకం (Sri Veerabrahmendra Swamy Dandakam) శ్రీ మన్మహా వీర బ్రహ్మేంద్ర యోగీశ్వరా !! భక్త మందార దుర్వార దుర్దోష దుర్భిక్ష దూరా!! మహావీరా!! మీ శక్తి మీ యుక్తి మీ రక్తి మీ భక్తి మీ సూక్తులెన్నంగ సామాన్యమే!!...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!