షోడశ గణపతి స్తోత్రం (Sri Shodasha Ganapathy Stotram)
విఘ్నేశవిధి మార్తాండ చండేంద్రోపేంద్ర వందితః |
నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే ||
ప్రథమం బాల విఘ్నేశం, ద్వితీయం తరుణం భవేత్ |
తృతీయం భక్త విఘ్నేశం, చతుర్థం వీరవిఘ్నకమ్ ||
పంచమం శక్తి విఘ్నేశం, షష్ఠం ధ్వజ గణాధిపమ్ |
సప్తమం పింగళదేవ మష్ట మోచ్చిష్టనాయకమ్ ||
నవమం విఘ్నరాజం చ దశమం క్షిప్ర నాయకమ్ ||
ఏకాదశం తు హేరంబం, ద్వాదశం లక్ష్మీ నాయకమ్ ||
త్రయోదశం మహావిఘ్నం భువనేశం చతుర్దశమ్ |
నృత్తాఖ్యం పంచదశకం, షోడశోర్ధ్వ గణాధిపమ్ ||
గణేశ షోడశం నామ ప్రయతః ప్రాతరుత్థతః |
సంస్మరేత్ సర్వకుశలం స ప్రయాతిన సంశయః ||
కార్యారంభే గణేశశ్చ పూజనీయః ప్రయత్నతః |
సర్వే విఘ్నాశ్శమం యాంతి గణేశస్తవ పాఠతః ||
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం |
పుత్రార్థీ లభతే పుత్రం మోక్షార్థీ పరమం పరమ్ ||
Leave a Comment