Home » Jyotirlingalu » Sri Vaidyanath Jyotirlingam

Sri Vaidyanath Jyotirlingam

శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం (Sri Vaidyanath Jyotirlingam)

పూర్వోత్తరే పారలికాభిదానే, సదాశివం తం గిరిజాసమేతం
సురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్యనాథం సతతం నమామి

వైద్యానాథ జ్యోతిర్లింగ విషయంలో అనేక భేధాభిప్రాయాలున్నాయి. మహారాష్ట్ర పర్లీ గ్రామంలోనిదే అసలైన జ్యోతిర్లింగమని, గంగా ఖేడలోనిలింగం, పంజాబ్ కీరగ్రామం లోని లింగం, హిమాచల్ ప్రదేశ్ లోని పఠాన్ కోట్ కు సమీపంలోని లింగం, కర్ణాటకలోని గోకర్ణ లింగం ఇవన్నీ శివుని ఆత్మలింగాలేనన్న వాదన బలంగా ఉంది. అయితే జార్ఘండ్ వైద్యనాథంలో వెలసినదే అసలైన జ్యోతిర్లింగమని విజ్ఞుల వాదన. పూర్వం రావణాసురుడు కఠోరనియమాలతో, ఒక చెట్టుకింద అగ్ని గుండాన్ని ఏర్పరచి, పార్థివలింగాన్ని, ప్రతిష్టించి, శివపంచాక్షరీమంత్రంతో, హవన కార్యక్రమంతో నిష్ఠతో ప్రార్థించగా,శివుడు రావణుని కోరికననుసరించి తన ఆత్మలింగాన్ని ప్రసాదించాడు. అయితే ఆ లింగాన్ని భూమికి తాకించిన వెంటనే అక్కడే స్థిరపడుతుందని హెచ్చరించాడు. ఆత్మలింగంతో లంకానగరాంకి తిరుగు ప్రయాణమైన రావణుడు సంధ్యావందనం చేసేందుకు ఒక పశువుల కాపరికి (దేవతల కోరికపై వినాయకుడు ఈ వేషాన్ని ధరించాడు) లింగాన్ని ఇవ్వగా, ఆ కాపరి ఆత్మలింగాన్ని కిందపెడతాడు. ఫలితంగా ఆ లింగం అక్కడే స్థిరపడుతుంది. రవణుడు ఎంతగా ఆత్మలింగాన్ని పెకలించి లంకానగరానికి తీసుకెళదామని ప్రయత్నించినప్పటికీ ఫలితం ఉండదు. వైధ్యనాథ్ దేవాలయంలో ఒక విశేషం ఉంది. సాధారణంగా శివాలయ మందిర శిఖరంపై త్రిశూలం ఉంటుంది కానీ, ఈ ఆలయ మందిర శిఖరంపై పంచశూలం ఉంది. మరి ఏ ఇతర జ్యోతిర్లింగ ఆలయాలలో ఇలాంటి అమరిక లేదు. పంచాక్షరీమంత్రంగా కలిగిన పంచముఖ శివునకు పంచప్రాణాలు అంతర్నిహితంగా కలిగిన శివతత్త్వమే ఇందులోని గూఢార్థం.

Siva Mangala Ashtakam

శివ మంగళాప్టకము (Siva Mangala Ashtakam) భవాయ చంద్రచూడాయు, నిర్గుణాయ గుణాత్మనే కాల కాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్‌ వృషారూఢాయ భీమాయ, వ్యాఘ్ర చర్మాంబరాయ చ పశూనాంపతయే తుభ్యం, గౌరీ కాంతాయ మంగళమ్‌ భస్మోధూళిత దేహోయ వ్యాళ యజ్ఞోపవీతినే రుద్రాక్షమాలా భూషాయ,...

Vontimitta Sri Rama Kshetram Kadapa

ఒంటిమిట్ట శ్రీ రాముని క్షేత్రం (Vontimitta Sri Rama Temple Kadapa) శ్రీరాఘవం దాశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం! ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి!! అంటూ శ్రీరామ నామ స్మరణతో మారుమ్రోగుతున్న దివ్య క్షేత్రం ఒంటిమిట్ట. ఏకశిలానగరంగా...

Sri Samba Sada Shiva bujanga Prayatha Stotram

శ్రీ సాంబసదాశివ భుజంగ ప్రయాత స్తోత్రం (Sri Samba Sada Shiva bujanga Prayatha Stotram) కదా వా విరక్తిః కదా వా సుభక్తిః కదా వా మహాయోగి సంసేవ్య ముక్తిః  | హృదాకాశమధ్యే సదా సంవసన్తం సదానందరూపం శివం సాంబమీడే...

Vedasara Shiva Stavah

వేదసార శివ స్తవమ్: (VedaSara Shiva Stavah) పశూనాం పతిం పాపనాశం పరేశం గజేంద్రస్య కృత్తిం వసానం వరేణ్యం | జటాజూటమధ్యే స్ఫురద్గాంగవారిం మహాదేవమేకం స్మరామి స్మరామి || 1 || మహేశం సురేశం సురారాతినాశం విభుం విశ్వనాథం విభూత్యఞ్గభూషం |...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!