Home » Temples » Sri Mahakaleshwara Jyotirlingam

Sri Mahakaleshwara Jyotirlingam

శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం (Sri Mahakaleshwara Jyotirlingam)

విహితావతారం, ముక్తిప్రదానాయచ సజ్జనానాం |
అకాల మ్రుత్యోహ పరిరక్షనార్థం, వందే మహాకాల మహం సురేశం ||

పరమేశ్వరునికి స్మశానమంటే అత్యంత ఇష్టం. ఈ భూమిపైనున్న సిద్ధక్షేత్రాలలో నైమిశారణ్యం, పుష్కరం, కురుక్షేత్రం ముఖ్యమైనవి. కురుక్షేత్రం కంటే పదిరెట్లు కాశీ పుణ్యప్రదమైనది. కాశీ కంటే మహాకాలవనం పదిరెట్లు గొప్పది. తీర్థాలలో అత్యుత్తమైనది ప్రభాసం, శ్రీశైలం దారుకావనం. వీటన్నికంటే మహాకాలవనం గొప్పది. ఎందుకంటే స్మశానం, ఎడారి, పాలం, పీఠం, అరణ్యం అంటూ ఐదు ఒకేచోట ఉన్న ప్రదేశం ఉజ్జయిని. పూర్వం వేదప్రియుడనే శివభక్తునికి దేవ ప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, ధర్మవాహి అనే నలుగురుకుమారులుండేవారు. ఈ నలుగురు కూడా శివభక్తులే. ఇదిలా ఉండగా, రత్నమాల పర్వతంపై నివసిస్తున్నా దూషణాసురుడనే రాక్షసుడు, వీరి పూజలకు ఆటంకాన్ని కలిగిస్తూ, అందరినీ హింసిస్తూండేవాడు. ఆ రాక్షసుని బాధలను తట్టుకోలేని అన్నదమ్ములు పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజించాగా, శివుడు మహాకాలుడై ఆవిర్భవించి, దూషణాసురుని,అతని సైన్యాన్ని భస్మం చెసాడు. అప్పట్నుంచి ఉజ్జయినీ నగరంలో విలసిల్లుతున్న మహాకాలేశ్వరుడు త్రిభువన లింగాలలో ప్రసిద్ధునిగా వెలుగొందుతున్నాడు.

Dwadasha Jyotirlinga Stotram

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం (Dwadasha Jyotirlinga Stotram) సౌరాష్ట్రదేశే విశదేతిరమ్యే జ్యోతిర్మయం చన్ద్రకలావతంసమ్ । భక్తిప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే ॥ 1॥ శ్రీశైలశృఙ్గే విబుధాతిసఙ్గే తులాద్రితుఙ్గేఽపి ముదా వసన్తమ్ । తమర్జునం మల్లికపూర్వమేకం నమామి సంసారసముద్రసేతుమ్ ॥...

Sri Chidambara Digbandhana Mala Mantram

శ్రీ చిదంబర దిగ్బంధన మాలా మంత్రం (Sri Chidambara Digbandhana mala mantram) ఓం అస్య శ్రీ చిదంబర మాలా మంత్రస్య, సదాశివ ఋషిః, మహావిరాట్ ఛందః, శ్రీచిదంబరేశ్వరో దేవతా హం బీజం, సః శక్తిః, సోహం కీలకం, శ్రీమచ్చిదంబరేశ్వర ప్రసాదసిద్ధ్యర్థే...

Sri Omkareshwar Jyotirlingam

శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం (Sri Omkareshwar Jyotirlingam) కావేరికా నర్మదయోహ పవిత్రే, సమాగమే సజ్జనతారనాయ సదివ మాదాత్రుపురే వసంత, మొన్కారమీశం శివమేకామీడే ఒకసారి వింధ్యపర్వతం తనకంటే గొప్పవారేవరూ లేరని విర్రవీగుచుండగా, నీకంటే మేరుపర్వతం గొప్పదని నారదమహర్షి చెప్పగా, కోపితుడై, ఓంకార క్షేత్రానికెళ్ళి...

Palani Kshetram

పళని క్షేత్రం (Palani Kshetram) మధురై కు వాయువ్యం దిశగా 120 కీ.మీ దూరంలో పళని కలదు. ఇది దిండుగల్లు జిల్లా పరిధి లోనికి వస్తుంది. వైగైనది అనకట్టకు అల్లంత దూరన గల కొండ పైన మురుగన్ ఆలయం ఉంటుంది. ఇది...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!