Home » Temples » Sri Mahakaleshwara Jyotirlingam

Sri Mahakaleshwara Jyotirlingam

శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం (Sri Mahakaleshwara Jyotirlingam)

విహితావతారం, ముక్తిప్రదానాయచ సజ్జనానాం |
అకాల మ్రుత్యోహ పరిరక్షనార్థం, వందే మహాకాల మహం సురేశం ||

పరమేశ్వరునికి స్మశానమంటే అత్యంత ఇష్టం. ఈ భూమిపైనున్న సిద్ధక్షేత్రాలలో నైమిశారణ్యం, పుష్కరం, కురుక్షేత్రం ముఖ్యమైనవి. కురుక్షేత్రం కంటే పదిరెట్లు కాశీ పుణ్యప్రదమైనది. కాశీ కంటే మహాకాలవనం పదిరెట్లు గొప్పది. తీర్థాలలో అత్యుత్తమైనది ప్రభాసం, శ్రీశైలం దారుకావనం. వీటన్నికంటే మహాకాలవనం గొప్పది. ఎందుకంటే స్మశానం, ఎడారి, పాలం, పీఠం, అరణ్యం అంటూ ఐదు ఒకేచోట ఉన్న ప్రదేశం ఉజ్జయిని. పూర్వం వేదప్రియుడనే శివభక్తునికి దేవ ప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, ధర్మవాహి అనే నలుగురుకుమారులుండేవారు. ఈ నలుగురు కూడా శివభక్తులే. ఇదిలా ఉండగా, రత్నమాల పర్వతంపై నివసిస్తున్నా దూషణాసురుడనే రాక్షసుడు, వీరి పూజలకు ఆటంకాన్ని కలిగిస్తూ, అందరినీ హింసిస్తూండేవాడు. ఆ రాక్షసుని బాధలను తట్టుకోలేని అన్నదమ్ములు పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజించాగా, శివుడు మహాకాలుడై ఆవిర్భవించి, దూషణాసురుని,అతని సైన్యాన్ని భస్మం చెసాడు. అప్పట్నుంచి ఉజ్జయినీ నగరంలో విలసిల్లుతున్న మహాకాలేశ్వరుడు త్రిభువన లింగాలలో ప్రసిద్ధునిగా వెలుగొందుతున్నాడు.

Shiva Shadakshara Stotram

శివషడక్షరస్తోత్రం (Shiva Shadakshara Stotram) ఓంకారం బిందుసంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః | కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః || ౧ || నమంతి ఋషయో దేవా నమంత్యప్సరసాం గణాః | నరా నమంతి దేవేశం నకారాయ నమో...

Sri Shiva Aparadha Kshama Stotram

శివాపరాధక్షమాపణ స్తోత్రం  (Sri Siva Aparadha Kshama Stotram) ఆదౌ కర్మప్రసంగాత్కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం విణ్మూత్రామేధ్యమధ్యే కథయతి నితరాం జాఠరో జాతవేదాః | యద్యద్వై తత్ర దుఃఖం వ్యథయతి నితరాం శక్యతే కేన వక్తుం క్షంతవ్యో మేపరాధః శివ...

Ananatha Padmanabhaswamy Temple, Thiruvananthapuram

శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం తిరువనంత పురం ( Sri Ananatha Padmanabhaswamy Temple, Thiruvananthapuram) అనంత పద్మనాభస్వామివారు పాలకడలిలోన.. శేషతల్పముపైన శయనించే ఓ స్వామీ… అన్నట్లుగా.. అనంతుడనే సర్పంపై పద్మనాభుడి రూపంలో ఉన్న విష్ణుమూర్తి కన్నులరమోడ్చి, హాయిగా విశ్రాంతి...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!