Home » Chalisa » Sri Lalitha Chalisa

Sri Lalitha Chalisa

శ్రీ లలితా చాలీసా (Sri Lalitha Chalisa)

1. లలితా మాతా, శంభుప్రియా, జగతికి మూలము నీవమ్మా!
శ్రీభువనేశ్వరి అవతారం. జగమంతటికీ ఆధారం.

2. హేరంబునికీ మాతవుగా హరిహరాదులు సేవింప
చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం.

3. పద్మరేకుల కాంతులతో బాలా త్రిపుర సుందరిగా
హంస వాహన రూపిణిగా వేదమాతవై వచ్చితివి.

4. స్వేత వస్త్రము ధరియించి, అక్షర మాలను పట్టుకొని
భక్తి మార్గము చూపితివి. జ్ఞాన జ్యోతిని నింపితివి.

5. నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ
ఆదిభిక్షువై వచ్చాడు సాక్షాత్తాపరమేశ్వరుడు.

6. కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రమ్ముగా
కామితార్థప్రదాయినిగా కంచికామాక్షివైనావు.

7. శ్రీచక్ర రాజ నిలయనిగా శ్రీమత్రిపుర సుందరిగా
సిరిసంపదలను యివ్వమ్మా! శ్రీమహాలక్ష్మిగ రావమ్మా!

8. మణిద్వీపమున కొలువుండి, మహాకాళి అవతారముతో
మహిషాసురునీ చంపితివీ. ముల్లోకాలను ఏలితివీ.

9. పసిడివెన్నెల కాంతులతో పట్టువస్త్రపు ధారణలో
పారిజాతపు మాలలలో పార్వతీ దేవిగ వచ్చితివి

10. రక్తవస్త్రమును ధరియించి రణరంగమును ప్రవేశించి
రక్తబీజుని హతమార్చి రమ్యకపర్థినివైనావు.

11. కార్తికేయునికి మాతవుగా, కాత్యాయినిగా, కరుణించి
కలియుగమున మము కాపాడ, కనకదుర్గవై వెలసితివి.

12. రామలింగేశ్వరు రాణివిగా, రవికుల సోముని రమణివిగా
రమా వాణీ సేవితగా రాజరాజేశ్వరివైనావు.

13. ఖడ్గం శూలం ధరియించి, పాశుపతాస్త్రము చేబూని,
శుంభ నిశుంభుల దునుమాడి, వచ్చితివీ శ్రీ శ్యామలగా.

14. మహామంత్రాధిదేవతగా లలితా త్రిపుర సుందరిగా
దరిద్ర బాధలు తొలగించి పరమానందము కలిగించి.

15. ఆర్తత్రాణ పరాయణివే అద్వైతామృత వర్షిణివే.
ఆదిశంకర ప్రపూజితవే. అపర్ణాదేవి! రావమ్మా.

16. విష్ణుపాదమున జనియించి, గంగావతారం ఎత్తితివి
భగీరథుడు నిను కొలువంగా భూలోకానికి వచ్చితివి.

17. అశుతోషునినే మెప్పించి అర్థ శరీరం దాల్చితివి.
ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిస్తివి జగదంబ.

18. దక్షుని యింటను జనియించి సతిగా తనువును చాలించి
అష్ఠాదశపీఠేశ్వరిగా దర్శనమిస్తివి జగదంబ!

19. శంఖ చక్రములు ధరియించి, రాక్షస సంహారము చేసి,
లోక రక్షణ చేశావు. భక్తుల మదిలో నిలిచావు.

20. పరభట్టారిక దేవతగా, పరమ శాంతస్వరూపిణిగా,
చిఱునవ్వులనూ చిందిస్తూ, చెరకుగడను ధరియించితివి.

21. పంచదశాక్షరి మంత్రాధితగా, పరమేశ్వర పరమేశ్వరితో,
ప్రమథ గణములు కొలువుండ, కైలాసంబే పులకించె.

22. సురలు, అసురులు అందరును శిరములు వంచి మ్రొక్కంగా
మాణిక్యాల కాంతులతో నీ పాదమ్ములు మెరసినవి.

23. మూలాధార చక్రములో యోగినులకు అధీశ్వరియై,
అంకుశాయుధ ధారిణిగా భాసిల్లితి శ్రీజగదంబ !

24. సర్వ దేవతల శక్తులచే సత్య స్వరూపిణి! రూపొంది
శంఖ నాదమును చేసితివి. సింహ వాహినిగ వచ్చితివి.

25. మహా మేరువు నిలయనివి మందార కుసుమ మాలలతో
మునులందరు నిను కొలువంగా, మోక్ష మార్గము చూపితివీ.

26. చిదంబరేశ్వరి నీలీల చిద్విలాసమే నీ సృష్టి
చిద్రూపి వర దేవతగా చిఱునవ్వులను చిందించే.

27. అంబా శాంభవీ! అవతారం అమృత పానం నీ నామం.
అద్భుతమైనది నీ మహిమ అతి సుందమూ నీరూపు.

28. అమ్మల గన్నా అమ్మవుగా ! ముగ్గురమ్మలకు మూలముగా !
జ్ఞాన ప్రసూనా ! రావమ్మా! జ్ఞానమందరికి ఇవ్వమ్మా!

29. నిష్టగ నిన్నే కొలిచెదము. నీ పూజలనే చేసెదము.
కష్టములన్నీ కడదేర్చి, కనికరమున మము కాపాడు.

30. రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప,
అభయ హస్తమును చూపితివి. అవతారమ్ములు దాల్చితివి.

31. అరుణారుణపు కాంతులతో, అగ్ని వర్ణపు జ్వాలలలో,
అసురులందరిని దునుమాడి, అపరిజాతవై వచ్చితివీ.

32. గిరిరాజునకుపుత్రికగా నంద నందుని సోదరిగా
భూలోకానికి వచ్చితివి. భక్తుల కోర్కెలు తీర్చితివి.

33. పరమేశ్వరునికి ప్రియ సతిగా, జగమంతటికీ మాతవుగా,
అందరి సేవలు అందుకొని, అంతట నీవే నిండితివి.

34. కరుణించమ్మా లలితమ్మా! కాపాడమ్మా దుర్గమ్మా!
దర్శనమీయగ రావమ్మా! భక్తుల కష్టం తీర్చమ్మా!

35. ఏవిధముగ నిను కొలిచిననూ, ఏ పేరున నిను పిలిచిననూ,
మాతృహృదయవై దయజూపు. కరుణా మూర్తిగ కాపాడు.

36. మల్లెలు మొల్లలు తెచ్చితిమి. మనసును నీకే యిచ్చితిమి.
భక్తులమంతా చేరితిమీ. నీ పారాయణ చేసితిమి.

37. త్రిమాతృ రూపా లలితమ్మా! సృష్టి స్థితి లయ కారిణివి.
నీ నామములు ఎన్నెన్నో! లెక్కించుట మా తరమౌనా?

38. సదాచార సంపన్నవుగా సామ గన ప్రియ లోలినివి.
సదాశివుని కుటుంబినివి. సౌభాగ్యమిచ్చే దేవతవు.

39. ఆశ్రితులంతా రారండి. అమ్మ రూపమును చూడండి.
అమ్మకు నీరాజనమిచ్చి, అమ్మ దీవనలు పొందండి.

40. మంగళ గౌరి రూపమును మనసుల నిండా నింపండి.
మహాదేవికీ మనమంతా మంగళ హారతులిద్దాము.

Sri Lalitha Moola Mantra Kavacham

శ్రీ లలితా మూలమంత్ర కవచం(Sri Lalitha moola mantra kavacham) అస్యశ్రీ లలితా కవచ స్తవరత్న మంత్రస్య ఆనందభైరవ ఋషిః అమృత విరాట్ చంద: శ్రీ మహాత్రిపురసుందరీ లలితా పరాంబా దేవతా, ఐ బీజం హ్రీం శక్తి: శ్రీం కీలకం, మమ...

Sri Lalitha Pancharatnam

శ్రీ లలితా పంచరత్నం (Sri Lalitha Pancharatnam) ప్రాతఃస్మరామి లలితావదనారవిన్దం బిమ్బాధరం పృథులమౌక్తికశొభినాసమ్| ఆకర్ణదీర్ఘనయనం మణికుణ్డలాఢ్యం మన్దస్మితం మృగమదొజ్జ్వలఫాలదేశమ్ ||1|| దొండ పండు వంటి క్రింది పేదవి, పేద్ద ముత్యముతొ శొభించు చున్న ముక్కు, చేవులవరకు వ్యాపించిన కన్నులు, మణి కుండలములు,...

Shiridi Sai Nakshatra Malika Stotram

శ్రీ షిరిడి సాయి నక్షత్ర మాలిక స్తోత్రం (Shiridi Sai Nakshatra Malika Stotram) 1)షిర్డీ సదనా శ్రీ సాయీ సుందర వదన శుభదాయీ జగథ్కరన జయ సాయీ నిస్మరనె ఎంతో హాయి 2)శిరమున వస్త్రం చుట్టితివీ చినిగిన కఫిని తొడిగితివీ...

Sri Hanuman Chalisa

శ్రీ హనుమాన్ చాలీసా (Sri Hanuman Chalisa) దోహా శ్రీ గురు చరన సరోజ రజ నిజ మను ముకుర సుధార బరణౌం రఘువర విమల యశ  జో దాయకు ఫలచార || బుద్ధిహీన తను జానికే సుమిరౌం పవనకుమార బల...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!