Home » Navadurga » Sri Skandamata Devi

Sri Skandamata Devi

శ్రీ స్కందమాత దేవీ (Sri Skandamata Devi)

కుమార స్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు అని ప్రసిద్ధుడైన స్కందుని తల్లి యైన దుర్గాదేవిని ‘స్కందమాత’పేరున నవరాత్రులలో 5వ రోజున ఆరాధింతురు. ఈమె చతుర్భుజ. షణ్ముఖుడైన బాలస్కందుని ఈమెయొడిలో ఒక కుడిచేత పట్టుకొనియుండును. మరియొక కుడిచేత పద్మము ధరించియుండును. ఎడమవైపున ఒకచేత అభయముద్ర, మరొకచేత కమలము ధరించి, ‘పద్మాసన’ యనబడు ఈమెయు సింహవాహనయే.

స్కందమాతను ఉపాసించుటవలన భక్తుల కోరికలన్నియు నెఱవేఱును. ఈ మర్త్యలోకమునందే వారు పరమ శాంతిని, సుఖములను అనుభవించుదురు. స్కందమాతకొనర్చిన పూజలు బాల స్కందునకు చెందును.ఈ దేవి సూర్య మండల-అధిష్టాత్రి యగుటవలన ఈమెను ఉపాసించువారు దివ్య తేజస్సుతో, స్వచ్ఛకాంతులతో వర్ధిల్లుదురు.

సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా ।
శుభదాస్తు సదా దేవీ స్కన్దమాతా యశస్వినీ ॥

Sri Chandraghanta Devi

శ్రీ చంద్రఘంట దేవీ (Sri Chandraghanta Devi) శ్రీ చంద్రఘంట దేవీ  తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే ఈమెకు ‘చంద్రఘంట’ యను పేరు స్థిరపడినది. ఈమె శరీరము బంగారు కాంతి మయముగా ప్రకాసిస్తుంది. ఈమె తన పది చేతులలో...

Sri Kushmanda Devi

శ్రీ కూష్మాండ దేవీ (Sri Kushmanda Devi) సురాసంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ చ । దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండ శుభదాస్తు మే ॥ ఈ తల్లి దరహాసము చేయుచు (అవలీలగా) బ్రహ్మాండమును సృజించునది గావున ఈ దేవి ‘కూష్మాండ’ అను పేరుతో విఖ్యాత...

Sri Mahagauri Devi

శ్రీ మహాగౌరి దేవీ  (Sri Mahagauri Devi) అష్టవర్షా భవేద్గౌరీ – “మహాగౌరి” అష్టవర్ష ప్రాయము గలది. అమ్మవారు గౌర వర్ణ శోభలు మల్లెపూవులను, శంఖమును, చంద్రుని తలపింపజేయును. ఈమె ధరించు వస్త్రములును, ఆభరణములును ధవళ కాంతులను వెదజల్లుచుండును. ఈమె చతుర్భుజ,...

Sri NavaDurga Stuti

శ్రీ నవదుర్గా స్తుతి (Sri Nava Durga Stuti) ప్రధమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్ధకం | పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ సప్తమం కాళ రాత్రీ చ, మహాగౌరీతి చాష్టమం | నవమం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!