చతుష్షష్ట్యకం (Sri Chatuh Shashtyashtakam)

lord shiva Sivanamavalyastakam stotramదేవదేవ జగతాంపతే విభో భర్గ భీమ భవ చంద్రభూషణ |
భూతనాథ భవభీతిహార్క నతోస్మి నతవాంఛితప్రద || 1 ||

చంద్రచూడ మృడ దూర్జటే హరత్ర్యక్ష దక్ష శత తంతుశాతన |
శాంత శాశ్వత శివాపతే శివ త్వాం నతోస్మి నతవాంఛిత ప్రద || 2 ||

నీలలోహిత సమీహితార్థద ద్వ్యేకలోచన విరూపలోచన |
వ్యోమకేశ పశుపాశనాశన త్వాం నతోస్మి నతవాంఛిత ప్రద || 3 ||

వామదేవ శితికంఠ శూలభ్రుత్ చంద్రశేఖర ఫణీంద్రభూషణ |
కామకృత్ పశుపతే మహేశ్వర త్వాం నతోస్మి నతవాంఛిత ప్రద || 4 ||

త్ర్యంబక త్రిపురసూదనేశ్వర త్రాణకృత్ త్రినయన త్రయీమయ |
కాలకూటదళనాంతకాంతక త్వాం నతోస్మి నతవాంఛిత ప్రద || 5 ||

శర్వరీ రహిత శర్వ సర్వగ స్వర్గమార్గ సుఖదాపవర్గద |
అంధకాసుర రిపో కపర్ద భ్రుత్ త్వాం నతోస్మి నతవాంఛిత ప్రద || 6 ||

శంకరోగ్ర గిరిజాపతే పతే విశ్వనాథ విధి విష్ణు సంస్తుత |
వేదవేద్య విదితాఖిలేంగిత త్వాం నతోస్మి నతవాంఛిత ప్రద || 7 ||

విశ్వరూప పరరూపవర్జిత బ్రహ్మ జిహ్మరహితామృత ప్రద |
వాజ్ఞ్మనో విషయ దూర దూరగ త్వాం నతోస్మి నతవాంఛిత ప్రద || 8 ||

దేవదేవుని(శివుని) గూర్చి సూర్యుడు చేసిన చతుష్షష్ట్యకం (కాశీఖండం 49వ అధ్యాయం)

ఈ స్తోత్రం పఠించుటవలన సర్వపాతకములు నశించును. పుణ్యము ప్రాప్తమగును. ఉత్తమ నరుడు దూరదేశాంతరము నందుండి పరిశుద్ధమగు మనస్సుతో నిత్యము త్రిసంధ్యలందు జపించుట వలన దైనందిన పాపములు నిస్సందేహముగా నశించును. పుత్రపౌత్రాది బహు సంపదలు పొందగలరు. ఈ స్తోత్రము కాశియందు మోక్షలక్ష్మిని అనుగ్రహించును. మోక్ష కాముకులు ప్రయత్నపూర్వకముగా ఈ స్తోత్రమును చదువవలెను.

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: