Home » Sri Shiva » Eshwara Dandakam

Eshwara Dandakam

ఈశ్వర దండకం (Eeshwara Dandakam)

శ్రీ కంఠ, లోకేశ, లోకోద్భవస్థాన, సంహారకారీ పురారి ! మురారి! ప్రియ చంద్రధారీ ! మహేంద్రాది బృందారకానంద సందోహ
సంధాయి పుణ్య స్వరూపా ! విరూపాక్ష దక్షాధ్వర ధ్వంసకా ! దేవ నీదైన తత్వంబు ! భావించి బద్ధిం బ్రధానంబు కర్మంబు!
విజ్ఞాన ఆధ్యాత్మ యెాగంబు ! సర్వ క్రియా కారణంబంచు నానా ప్రకారంబులం బుద్ధిమంతుల్ ! విచారించుచో నిన్ను
భావింతు రీశాన సర్వేశ్వరా ! సర్వ సర్వజ్ఞ సర్వాత్మకా ! నిర్వికల్ప ప్రభావా ! భవానీ పతీ ! నీవు లోక త్రయీ వర్తనంబుల్
మహీవాయుఖాత్వగ్ని సోమార్క తోయంబు లం జేసి కావించి సంసార చక్రక్రియా యంత్ర వాహుండవై ఆది దేవా! మహాదేవ
నిత్యంబు నత్యంత యెాగస్థితి న్నిర్మల జ్ఞాన దీప ప్రభా జాల ! విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ ! జితక్రోధరోగాది దోషుల్ ! యతీంద్రుల్ ! యతాత్ముల్ ! భవత్పాద పంకేరుహ ధ్యాన పీయూష ధారానుభూతిన్ సదాతృప్తులైరి అవ్యయా! భవ్య సేవ్యా! భవా భర్గ భట్టారకా ! భార్గవాగస్థ్య కుత్సాది నానా ముని స్తోత్ర దత్తవధానా ! లలాటేక్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ ! భస్మానులిప్తాంగ ! గంగాధరా ! నీ ప్రసాదంబునన్ ! సర్వ గీర్వాణ గంధర్వులున్ ! సిద్ధసాధ్యోరగేంద్రామరేంద్రాదులున్ !
శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వరా !! సురాభ్యర్చితా !! నాకున్ అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తీ !! త్రిలోకైకనాథా !
మహా దేవ దేవా !! నమస్తే నమస్తే నమస్తే నమః !!

“మహా భారత అరణ్య పర్వంలోనిది !!
అర్జునుడు ఈశ్వరుని మెప్పించి పాశుపతాది దివ్యాస్త్రములు పొంది ఈ ‘దండకం’తో శివుని సంతోష పరిచాడు!!
(కవి త్రయంలో ఒకరైన నన్నయ భట్టు వ్రాసినది)

Sri Vak Saraswathi Hrudaya Stotram

శ్రీ విద్యాదాన వాక్సరస్వతీ హృదయ స్తోత్రం (Sri Vak Saraswathi Hrudaya Stotram) ఓం అస్య శ్రీ వాగ్వాదినీ శారదామంత్రస్య మార్కండేయాశ్వలాయనౌ ఋషీ, స్రగ్ధరా అనుష్టుభౌ ఛందసీ, శ్రీసరస్వతీ దేవతా, శ్రీసరస్వతీప్రసాదసిద్ధ్యర్థే వినియోగః || ధ్యానం శుక్లాం బ్రహ్మవిచారసారపరమాం ఆద్యాం జగద్వ్యాపినీం...

Shiva Shadakshara Stotram

శివషడక్షరస్తోత్రం (Shiva Shadakshara Stotram) ఓంకారం బిందుసంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః | కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః || ౧ || నమంతి ఋషయో దేవా నమంత్యప్సరసాం గణాః | నరా నమంతి దేవేశం నకారాయ నమో...

Sri Manasa Devi Temple in Mukkamala Peetam

Sri Manasa Devi Temple in Mukkamala Peetam (ముక్కామల మానసా దేవీ పీఠం) ఓం నమో మానసాయై !! Sri Manasa Devi stayed here and did Dhyanam in Mukkamala Peetam . Here the temple...

Sri Rama Dwadasa Nama Stotram

శ్రీ రామ ద్వాదశ నామ స్తోత్రం (Sri Rama Dwadasa nama Stotram) అస్య శ్రీ రామ ద్వాదశనామ స్తోత్ర మహా మంత్రస్య ఈశ్వర ఋషిః అనుష్టుప్చందః శ్రీ రామచంద్రో దేవతా శ్రీ రామచంద్ర ప్రీత్యర్దే వినియోగః ఓం ప్రధమం శ్రీధరం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!