Home » Jyotirlingalu » Sri Bhimashankara Jyotirlingam

Sri Bhimashankara Jyotirlingam

శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం (Sri Bhimashankara Jyotirlingam)

యో డాకిని శాకినికా సమాజే, నిషేవ్యమానం పిశితాశానైశ్చ
సదైవ భీమాది పద ప్రసిద్ధం, తం శంకరం భక్తహితం నామామి

త్రేతాయుగంలో భీమాసురుడనే రాక్షసుడు సహ్యాద్రిపై తల్లి కర్కటితో కలిసి జీవిస్తూ, ప్రజలను పీడిస్తూండేవాడు. కర్కటి, పుష్కసి – కర్కటుల కూతురు. లేక లేక పుట్టిన కూతుర్ని అత్యంత గారాబంగా పెంచసాగారు ఆ రాక్షసదంపతులు. యుక్తవయస్కురాలైన కర్కటిని విరాధునికి ఇచ్చి పెండ్లి చెశారు. ఆ విరాధుడు, శ్రీరామునితో జరిగిన యుద్ధంలో మరణించగా, మరలా కర్కటి తల్లిదండ్రులను ఆశ్రయించింది. ఒకరోజు అగస్త్యుని శిష్యుడైన సుతీక్షణుడు భీమానదిలో స్నానం చేస్తుండగా, కర్కటి తల్లిదండ్రులు అతనిని కబళీంచేందుకు ప్రయత్నించి, అ ముని శాపానికి గురై భస్మమయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన కర్కటి అనాథగా ఆ మిగిలింది. అనాథగా సహ్యపర్వతంపై తిరుగుతున్న కర్కటిని చూసి, మోహావేశుడైన రావణుని సోదరుడు కుంభకర్ణుడు, ఆమెను బలాత్కరించి, లంకా నగరానికి వెళ్ళిపోయాడు. ఫలితంగా కర్కటి గర్భనతై భీమాసురునికి జన్మనిచ్చింది. తన తల్లి కథను విన్న భీమాసురుడు, దీనంతాటికి కారకుడు రామావతారం ధరించిన విష్ణువేనని, విష్ణువుపై తన పగను తీర్చుకోవాలని, వేయి సంవత్సరాలపాటు బ్రహ్మ గురించి తపస్సుచేసి వరాలను పొందాడు. ఎల్లలోకవాసులను గడగడలాడించిన భీమాసురుడు కామరూప దేశాధిపతి సుదక్షిణుని ఓడించి కారాగృహంలో బందించాడు. అతని భార్య సుదక్షిణాదేవిని కూడ బంధిస్తాడు. కారాగారంలో సంకెళ్ళతో బంధింపబడినప్పటికీ ఆ దంపతులు, మానస గంగాస్నానం చేస్తూ, ఇసుకలింగాన్ని చేసి ఆరాద్ హించసాగారు. వారి పూజలను చూసిన భీమాసురుడు ఈ లింగం మిమ్ములను రక్షిస్తుందా అంటూ తన కరవాలాన్ని విసురుతాడు. రాక్షసుని కత్తి పార్థివలింగాన్ని తాకినంతనే కోటి సూర్యప్రభలతో స్వామి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి, త్రిశూలంతో రాక్షస సంహారం గావించాడు. సకలలోకవాసులు సంతోషించారు. అప్పటి నుంచి స్వామి వారు లోక కళ్యాణార్థం అక్కడనే ఉంటూ భక్తజనావళిని కరుణిస్తున్నాడు. ఎందరో భక్తుల కోరికలను తీస్తున్నాడు.

Sri Subramanya Bhujanga stotram

శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం (Sri Subramanya Bhujanga stotram) సదా బాలరూపాఽపి విఘ్నాద్రిహంత్రీ – మహాదంతివక్త్రాఽపి పంచాస్యమాన్యా | విధీంద్రాదిమృగ్యా గణేశాభిధా మే – విధత్తాం శ్రియం కాఽపి కళ్యాణమూర్తిః || ౧ || న జానామి శబ్దం న...

Sri Shiva Manasa Pooja Stotram

శ్రీ శివ మానస పూజా స్తోత్రమ్ (Sri Shiva Manasa Pooja Stotram) రత్నైః కల్పిత మాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం నానారత్నవిభూషితం మృగమదామోదాంకితం చందనమ్ । జాజీచంపకబిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం...

Sri Yama Kruta Shiva Keshava Stuti

యమకృత శివకేశవ స్తుతి (Yama Kruta Shiva Keshava Stuthi) గోవింద మాధవ ముకుంద హరే మురారే, శంభో శివేచ శంకర శశిశేఖర శూలపానే | దామోదరాచ్యుత జనార్దన వాసుదేవ, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి || 1 ||...

Sri Rudra Namaka Stotram

శ్రీ రుద్ర నమక స్తోత్రం (Sri Rudra Namaka Stotram) ధ్యానమ్: ఆపాతాళ నభస్స్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర జ్జ్యోతిఃస్ఫాటిక లింగ మౌళివిలసత్ పూర్ణేందు వాంతామృతైః| అస్తోకాప్లుత మేకమీశ మనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువ పదం విప్రోభిషించేచ్ఛివమ్ ॥...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!