Home » Sri Shiva » Shiva Nindha Stuthi

Shiva Nindha Stuthi

శివ నిందా స్తుతి (Shiva Nindha Stuthi)

ఇసుక రేణువులోన దూరియుందువు నీవు
బ్రహ్మాండమంతయును నిండియుందువు నీవు
చివురాకులాడించు గాలిదేవర నీవు
ఘన కానలను గాల్చు కారుచిచ్చువు నీవు

క్రిమికీటకాదులకు మోక్షమిత్తువు నీవు
కాలయమునిబట్టి కాలదన్ను నీవు
పెండ్లి జేయరాగ మరుని మండించినావు
పెండ్లియాడి సతికి సగమిచ్చినావు

దక్షయాగము ద్రుంచి సురలందరిని గొట్టి
వికటాట్టహాసమున భయపెట్టినావు
కడలి చిలుకు వేళ కాలకూటము బుట్ట
దాని త్రావి సురల గాచినావు

ఈ తిక్క శివునితో వేగలేననుచూ
ముక్కంటి కోపాన్ని ఓపలేననుచూ
వదిలిపోదమన్న వేరు దైవము లేదు
నీవు తప్ప నాకు గతియు లేదు

ఏమిసేతును దేవ సర్దుకొందును లెమ్ము
అమ్మవారి నడిగి మసలుకొందు
దూరముగ నీవున్న నా భయము హెచ్చును
నాదాపు నుండుటకు నీవొప్పుకొనుము

నీ ఆలితో గూడి నాగుండెలోనుండి
ఏడేడు లోకాల నేలుకొనుము
నా ఋణము తీర్చుకొన ఇవ్వుమొక చిరువరము
నా మనము నీ పదము నుండునటుల.

Guru Stotram

గురు స్తోత్రం (Guru Stotram) అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ | తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || 1 || అఙ్ఞానతిమిరాంధస్య ఙ్ఞానాంజనశలాకయా | చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః || 2 || గురుర్బ్రహ్మా...

Aditya Hrudayam Stotram

ఆదిత్యహృదయం (Aditya Hrudayam Stotram) తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || ౧ || అర్థము : యుద్ధము చేసి చేసి మిక్కిలి అలసియున్న శ్రీరాముడు సమరరంగమున చింతా క్రాంతుడైయుండెను. పిమ్మట...

Sri Ganesha Suprabhatha Stuthi

శ్రీ గణేశ సుప్రభాత స్తుతి (Sri Ganesha Suprabhatha Stuthi) శాంకరీసుప్రజా దేవ ప్రాతః కాలః ప్రవర్తతే ఉత్తిష్ట శ్రీ గణాధీశ త్రైలోక్యం మంగళం కురు || 1 || ఉత్తిష్ట భో! దయసింధో! కవినాం త్వం కవి: ప్రభో |...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!