యమకృత శివకేశవ స్తుతి (Yama Kruta Shiva Keshava Stuthi)

గోవింద మాధవ ముకుంద హరే మురారే, శంభో శివేచ శంకర శశిశేఖర శూలపానే |
దామోదరాచ్యుత జనార్దన వాసుదేవ, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి || 1 ||

గంగాధరాం ధకరిపో హర నీలకంఠ, వైకుంఠ కైటభరిపో కమలాబ్జపానే |
భూతేశ ఖండపరశో మృడ చండికేశ, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి || 2 ||

విష్నో నృసింహ మధుసూదన చక్రపానే, గౌరీపతే గిరిశ శంకర చంద్రచూడ |
నారాయణాసుర నిబర్హణ, శార్ జ్గపానే, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి || 3 ||

మృత్యుంజయోగ్ర విషమేక్షణ కామశత్రో, శ్రీకాంత పీతవసనాoబుదనీల శౌరే |
ఈశాన కృత్తివసన త్రిదశైకనాథ, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి || 4 ||

లక్ష్మిపతే మధురిపో పురుషోత్తమాద్య, శ్రీకంఠ దిగ్విసన శాంతి పినాకపానే |
ఆనందకంద ధరణీధర పద్మనాభ, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి || 5 ||

సర్వేశ్వర త్రిపురసూదన దేవదేవ, బ్రహ్మణ్యదేవ గరుడధ్వజ శంఖపానే |
త్ర్యక్షోరగాభరణ బాలమృగాంకమౌలే, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి || 6 ||

శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే, భూతేశ మన్మథరిపో ప్రమథాధినాథ |
చానూరమర్దన హృషీకపతే మురారే , త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి || 7 ||

శూలిన్ గిరీశ రజనీశకళావతoస, కంసప్రణాశన సనాతన కేశినాశ |
భర్గ త్రినేత్ర భవ భూతపతే పురారే, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి || 8 ||

గోపీపతే యదుపతే వసుదేవసూనో, కర్పూరగౌర వృషభధ్వజ ఫాలనేత్ర |
గోవర్దనోద్దరన ధర్మధురీణ గోప, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి || 9 ||

స్థానో త్రిలోచన పినాకధర స్మరారే, కృష్ణానిరుద్ద కమలానాభ కల్మషారే |
విశ్వేశ్వర త్రిపథగార్ద్రజటాకలాప, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి || 10 ||

కాశీఖండము లోని యముని చే చెప్ప భడిన ఈ శివకేశవ నామాలు ఒక్కసారి చదివినా అనేక జన్మల పాపాలు పోతాయి. ఈ నామాలనూ ప్రతి రోజు పటించే వాళ్ళకి యమ దర్శనం వుండదు. యముడు స్వయంగా తన యమభటులు కు ఈ శివకేశవ నామాలు ఎవ్వరూ భక్తితో రోజు చదువుతూ వుంటారో వారి జోలికి మీరు పోవద్దు అని చెప్పాడు.

ఈ యమకృత శివకేశవ నామాలను స్మరించువారు పాపరహితులై తిరిగి మాతృగర్బమున జన్మింపరు. ఈ నామాలు భక్తితో చదివిన వారు చనిపోతే, వారి కోసం శివపార్సకలు, లేద విష్ణుపార్సకలు కానీ వస్తారు. వారికి శివ లేద విష్ణు శాస్వత సాన్నిద్యం కలిపిస్తారు.

Related Posts

2 Responses

  1. srinivas gupta vishwanatham

    హిందు ధర్మ ముాలాలను కొల్పొతున్న ఈ ప్రస్తుథ సమయములొ జ్ఞానార్దులకు మార్గము చుాపుతున్న మహనీయులకు శతకొటి ప్రనామాలు మి మేలు మరువరానది ధన్యవసదములు

    Reply
  2. V K Sivaramakrishna

    కార్తీక మాసం సందర్భంగా చదవవలసిన స్తుతి

    Reply

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!