Home » Sri Durga Devi » Sri Durga Devi Chandrakala Stuti

Sri Durga Devi Chandrakala Stuti

దేవీ చన్ద్రకళాస్తుతీ (Sri Durga Devi Chandrakala Stuti)

వేధోహరీశ్వరస్తుత్యాం విహర్త్రీం వింధ్య భూధరే!
హర ప్రాణేశ్వరీం వన్దే హన్త్రీం విబుధవిద్విషామ్!!  || 1 ||
భావం: బ్రహ్మ విష్ణు రుద్రులచే స్తోత్రింపబినది – వింధ్య పర్వతమున విహరించునది, శివుని ప్రాణేశ్వరి, దేవ ద్రోహులైన (సత్త్వ విరోధులైన) రాక్షసులను సంహరించు జగదంబకు వందనములందజేస్తున్నాను.

అభ్యర్థనేన సరసీరుహ సంభవస్య
త్యక్త్వోదితా భగవదక్షిపిధాన లీలామ్!
విశ్వేశ్వరీ విపదపాగమనే పురస్తా-
న్మాతా మమాsస్తు మధుకైటభయోర్నిహన్త్రీ !!  || 2 ||
భావం: బ్రహ్మ ప్రార్థన మేరకు, యోగనిద్రితుడైన భగవానుని కనులు విప్పి, మధుకైటభులను సంహరిం(పజేసిన)చిన విశ్వేశ్వరీ (మహాకాళీ) మాత విపత్తులలో నాముందు నిలచుగాక!

ప్రాజ్ నిర్జరేషు నిహతైర్నిజశక్తి లేశై –
రేకీ భవద్భిరుదితాsఖిలలోక గుష్యై!
సంపన్న శస్త్ర నికరాచ తదాయుధస్థై-
ర్మాతా మమాsస్తు మహిషాంతకరీ పురస్తాత్!!  || 3 ||
భావం: దేవతల తేజస్సులన్నిటి ఏకరూపమై, లోకరక్షణకై ఉదయించి, వివిధ సంపదలను శస్త్రాది ఆయుధాలను ధరించిన మహషాంతకరి (మహాలక్ష్మి) నా ముందుండుగాక!

ప్రాలేయశైలతనయా తనుకాంతి సంపత్ –
కోశోదితా కువలయచ్ఛవి చారుదేహా!
నారాయణీ నమదభీప్సిత కల్పవల్లీ
సుప్రీతి మావహతు శుంభనిశుంభహన్త్రీ!! || 4 ||
భావం: హిమవత్పర్వత రాజపుత్రి గౌరిదేవి శరీరకాంతి సంపద అనెడి కోశమునుండి ఉదయించిన, నల్లకలువ వంటి దేహముగల తల్లి, నారాయణి, మహాసరస్వతి, నమస్కరించిన వారి అభీష్టాలను తీర్చే కల్పవల్లి, శుభనిశుంభ సంహారిణి చక్కని ప్రీతిని కలిగించుగాక!

విశ్వేశ్వరీతి మహిషాన్తకరీతి యస్త్యా
నారాయణీత్యపిచ నామభిరంకితాని!
సూక్తాని పంకజభువాచ సురర్షిభిశ్చ
దృష్టాని పావకముఖైశ్చ శివాం భజేతామ్!! || 5 ||
భావం: బ్రహ్మచే ’విశ్వేశ్వరీసూక్తం’తో, దేవతలచే ఋషులే అగ్ని ముఖుగా, ’మహిషాన్తకరీ’, ’నారాయణీ సూక్తముల’తో దర్శింపబడి కీర్తించబడిన (దేవీ మహాత్మ్యంలోని సూక్తాలివి) శివాదేవిని ఆశ్రయిస్తున్నాను.

ఉత్పత్తి దైత్య హనన స్తవనాత్మకాని
సంరక్షకాణ్యఖిల భూతహితాయ యస్యాః!
సూక్త్యాన్యశేష నిగమాంత విదః పఠన్తి
తాం విశ్వమాతరమజస్ర మభిష్తవీమి!! || 6 ||
భావం: పరాశక్తి యొక్క ఆవిర్భావం, రాక్షససంహారం, స్తోత్రములు, జీవకోటి హితానికై చేసిన సంరక్షణ కృత్యములను, అగ్నిసూక్తములను వేదాంతవేత్తలు పఠిస్తున్నారు. అట్టి విశ్వమాతను ఎల్లప్పుడు స్తోత్రిస్తున్నాను.

యం విప్రచిత్త పునరుత్థిత శుంభ ముఖ్యైః
దుర్భిక్ష ఘోర సమయేన చ కారితాసు!
ఆవిష్కృతాస్త్రిజగదార్తిషు రూపభేదా –
స్తైరంబికా సమభిరక్షతు మాం విపద్భ్యః!! || 7 ||
భావం: విప్రచిత్తునకు తిరిగి జన్మించిన శుంభాది రాక్షసులను నందా, రక్తదంతాది నామరూపములు ధరించి సంహరించి, కరవువంటి ఘోర సమయాలను తొలగించిన అంబిక ఆయా వివిధ నామరూపాలతో నన్ను విపత్తులనుండి సంపూర్ణముగా రక్షించుగాక!

సూక్తం యదీయమరవింద భవాది దృష్ట –
మావర్త్య దేవ్యనుపదం సురథః సమాధిః!
ద్వావప్యవాపతురభీష్ట మనన్యలభ్యం
తామాదిదేవతరుణీం ప్రణమామి మూర్ధ్నా!! || 8 ||
భావం: బ్రహ్మాదులచే దర్శింపబడిన దేవీసూక్తములను నిరతము పఠించిన సురథుడు, సమాధి అను భక్తులు ఇతరులకు లభ్యము కాని దివ్య పదములను పొందారు. అలా పొందింపజేసిన ఆదిదేవుని తరుణియైన దేవికి శిరస్సుతో ప్రణామములు చేస్తున్నాను.

మహిష్మతీ తనుభవంచ రురుంచ హంతుం
ఆవిష్కృతైర్నిజరసాదవతరభేదైః!
అష్టాదశాహత నవాహత కోటి సంఖ్యై –
రంబా సదా సమభిరక్షతు మాం విపద్బ్యః!! || 9 ||
భావం: మహిష్మతి పుత్రులైన మహిషాసురుని, రురుని సంహరించడానికై వివిధ అవతారములతో పద్దెనిమిది కోట్ల శక్తులతో, తొమ్మిదికోట్ల శక్తులతో బయలువెడలిన అమ్మ నన్ను విపత్తుల నుండి సమగ్రంగా రక్షించుగాక!

ఏతచ్చరిత్ర మఖిలం లిఖితంహి యస్యాః
సంపూజితం సదన ఏవ నివేశితంవా!
దుర్గంచ తారయతి దుస్తర మప్యశేషం
శ్రేయః ప్రయచ్ఛతి చ సర్వముమాం భజేతామ్!! || 10 ||
భావం: ఈ దేవీ చరిత్రనంతటినీ వ్రాసి, ఎవరి యింట ఉంచి పూజించుతారో వారు భయంకరమైన దుర్గతులన్నిటి నుండి దాటబడి, శ్రేయస్సులను పొందుతారు. అట్టి మహిమగల ఉమాదేవిని భజిస్తున్నాను.

యత్పూజన స్తుతి నమస్కృతిభిర్భవన్తి
ప్రీతాః పితామహ రమేశ హరాస్త్రయోపి!
తేషామపిస్కుణైర్దదతీ వపూంషి
తామీశ్వరస్య తరుణీం శరణం ప్రపద్యే!! || 11 ||
భావం: ఏ తల్లిని పూజించడం చేత, స్తుతించడం చేత, నమస్కరించడం చేత బ్రహ్మవిష్ణురుద్రులు మువ్వురూ ప్రీతులౌతారో, ఆ మువ్వురికీ గుణములను తనువులను ఇచ్చినదెవరో ఆ ఈశ్వర తరుణిని శరణు వేడుతున్నాను.

కాంతారమధ్య దృఢలగ్నతయావసన్నా
మగ్నాశ్చ వారిధిజలే రిపుభిశ్చ రుద్ధాః!
యస్యాః ప్రపద్య చరణౌ విపదస్తరంతి
సా మే సదాస్తు హృది సర్గజగత్సవిత్రీ!! || 12 ||
భావం: అరణ్యమధ్యంలో చిక్కుపడినవారు, సముద్రాది జలములలో మునిగిన వారు, శత్రువుల చేత బంధింపబడిన వారు ఎవరి చరణాలను శరణువేడి విపత్తుల నుండి దాటుతున్నారో ఆ సృష్టికారిణి ఎల్లవేళలా నా హృదయమందుండు గాక.

బంధేవధే మహతి మృత్యుభయే ప్రసక్తే
చిత్తక్షయే చ వివిధేచ మహోపతాపే!
యత్పాదపూజ నమిహ ప్రతికారమాహుః
సా మే సమస్త జననీ శరణం భవానీ!! || 13 ||
భావం: బంధమునందు, వధమునందు, మహామృత్యుభయములందు, మనస్తాపములందు, వివిధ వేదనలందు ఎవరి పాదపూజనము పరిష్కారముగా చెప్పబడుచున్నదో ఆ సమస్త జనని భవాని మాకు శరణు.

బాణాసురప్రహిత పన్నగబంధమోక్ష –
స్తద్బాహుదర్ప దళనాదుషయాచ యోగః!
ప్రాద్యుమ్నినా ద్రుతమలభ్యత యత్ప్రసాదాత్
సా మే శివాసకలమప్యశుభం క్షిణోతు!! || 14 ||
భావం: బాణాసురునిచే నాగపాశముల బంధితుడైన ప్రద్యుమ్న పుత్రుడైన అనిరుద్ధుని ఆ నాగపాశముల నుండి విడిపించి, అసురుని బాహు దర్పమును ఖండించడం, ఉషారాణితో కలయిక ఎవరు కృపతో వెంటనే లభింపజేశారో ఆ శివస్వరూపిణి నాకు అన్ని అశుభములను నశింపజేయుగాక!

పాపః పులస్త్య తనయో పునరుత్థితో మా –
మద్యాపి హర్తు మయమాగత ఇత్యుదీతమ్!
యత్సేవనేన భయమిందిరయావధూతం
తామాదిదేవతరుణీం శరణం గతోస్మి!! || 15 ||
భావం: ’పులస్త్యుని సంతానమైన పాపాత్ముడైన రావణుడు మరల (శిశుపాలునిగా) జన్మించి, ఈ జన్మో నన్నపహరించడానికై వచ్చినాడ’ని లక్ష్మీరూపిణి రుక్మిణి ప్రార్థించగా విని భయమును పోగొట్టిన ఆదిదేవుని తరుణిని శరణువేడుతున్నాను.

యద్ ధ్యానజం సుఖమవాప్యమనన్త పుణ్యైః
సాక్షాత్ తమచ్యుతపరిగ్రహ మాశ్వవాపుః!
గోపాంగనాః కిల యదర్చన పుణ్యమాత్రాః
సా మే సదాభగవతీ భవతు ప్రసన్నా!! || 16 ||
భావం: ఎవరిని అర్చించిన పుణ్యమాత్రమున -అనంత పుణ్యలభ్యమైన ధ్యాన సౌఖ్యమును అచ్యుతుని పొందుట ద్వారా గోపాంగనలు బడిసిరో ఆ భగవతి నాకు ప్రసన్నయగుగాక!

రాత్రిం ప్రపద్య ఇతి మంత్ర విదః ప్రపన్నా –
నుద్బోధ్య మృత్యవధి మన్యఫలైః ప్రలోభ్య!
బుద్ధ్వా చ తద్విముఖతాం ప్రతనం నయంతీ –
మాకాశమాది జననీం జగతాం భజేతామ్!! || 17 ||
భావం: ’రాత్రిం ప్రపద్యే’ అనే వైదిక రాత్రి సూక్త మంత్రములను శరణాగతితో జపించినవారిని, జాగృతపరచి, ఇతర ఫలములను ప్రలోభపరచి, జ్ఞానముొసగి, ఆ లోకఫలితములందు విముఖతను కలిగింధి, కైవల్యమునొసగు ఆకాశస్వరూపిణియైన జగతికి ఆదిజననిని భజిస్తున్నాను.

దేశకాలేషు దుష్టేషు దేవీ చంద్రకళాస్తుతిః
సంధ్యయోరనుసంధే యా సర్వామద్వినివృత్తయే!! || 18 ||
భావం: దేశకాలములు దుష్టములై ప్రతికూలములైనప్పుడు అన్ని ఆపదలను తొలగించడానికై ’దేవీ చంద్రకళాస్తుతి’ సంధ్యలలో నిత్యం పారాయణ చేయాలి.

ఇతి శ్రీ మద్భరద్వాజ కులజలధికౌస్తుభ శ్రీకంఠ మత –
ప్రతిష్ఠాపనాచార్య చతురధిక శత ప్రబంధ నిర్వాహక మహావ్రత
యాజి శ్రీమదప్పయ దీక్షితేంద్రస్య కృతిష్వన్యతమా
దుర్గాదేవీ చంద్రకళాస్తుతిః సంపూర్ణా.

ఈ దేవీస్తుతిలో అనేక గ్రంథాలలోని దేవీ మహిమలను నిక్షిప్తం చేస్తూ శక్తిమంతమైన మంత్రభరిత స్తుతిగా శ్రీ అప్పయ్య దీక్షితులు వారు సభక్తికంగా దీనిని రచించారు. ప్రస్తుతం వ్యక్తిగతంగానే కాక, సనాతన ధర్మానికీ, ధర్మానుయాయులకీ దేశకాలపరిస్థితులు ప్రతికూలంగా ఉన్న తరుణంలో – ఈ స్తుతిని ప్రతి ఒక్కరూ పారాయణ చేయవలసిన అవసరం ఉంది. తద్వారా వ్యక్తికీ, ధర్మానికీ యోగక్షేమాలను ఆ జగజ్జనని ప్రసాదిస్తుంది.

అప్పయ్య దీక్షితులు చే రచించిన మహిమాన్విత దుర్గా దేవీ చంద్రకళా స్తుతి

Ashtamurti Stotram

అష్టమూర్తి స్తోత్రం (Ashtamurti Stotram) ఈశా వాస్యమిదం సర్వం చక్షోః సూర్యో అజాయత ఇతి శ్రుతిరువాచాతో మహాదేవః పరావరః || 1 || అష్టమూర్తేరసౌ సూర్యౌ మూర్తిత్వం పరికల్పితః నేత్రత్రిలోచనస్యైకమసౌ సూర్యస్తదాశ్రితః || 2 || యస్య భాసా సర్వమిదం విభాతీది...

Matangi Mahavidya

మాతంగీ మహావిద్య (Matangi Mahavidya) Matangi Jayanti is celebrated on Akshaya Tritiya day in Vaisakha Masam (Shukla Paksha  Tritiya day) as per Telugu calendar. దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య.. మరకతమ వర్ణంతో ప్రకాశించే శ్రీ...

Sri Padmavathi Stotram

శ్రీ పద్మావతి స్తోత్రం (Sri Padmavathi Stotram) విష్ణుపత్ని జగన్మాతః విష్ణువక్షస్థలస్థితే | పద్మాసనే పద్మహస్తే పద్మావతి నమోఽస్తు తే || 1 || వేంకటేశప్రియే పూజ్యే క్షీరాబ్దితనయే శుభే | పద్మేరమే లోకమాతః పద్మావతి నమోఽస్తు తే || 2...

Sri Mahasastha Kavacham

శ్రీ మహాశాస్తా కవచం (Sri Maha Sastha Kavacham) శ్రీ దేవ్యువాచ భగవాన్ దేవదేవేశ సర్వజ్ఞ త్రిపురాంతక ప్రాప్తే కలియుగే ఘోరే మహా భూతై సమావృతే మహావ్యాధి మహావ్యాళ ఘోరరాజై: సమావృతే దు: స్వప్న శోకసంతాపై:, దుర్వినీతై: సమావృతే స్వధర్మ విరతే...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!