Home » Dandakam » Sri Vinayaka Dandakam
vinayaka dandakam

Sri Vinayaka Dandakam

శ్రీ వినాయక దండకం (Sri Vinayaka Dandakam)

శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీస్తోత్ర, సత్పణ్యచారిత్ర, భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీ నాధ సంజాతస్వామి శివాసిద్ధి విఘ్నేశ, నీ పాద పద్మంబులన్, నిదు కంటంబు నీ   బొజ్జ నీ మోము నీ మౌలి బాలేందు ఖండంబు నీ నాల్గు హస్తంబు నీ కరలంబు నీ పెద్ద వక్త్రంబు నీ పాద హస్తంబు లంబో దరంబున్ సదమూషకాశ్వంబు నీ మంద హాసంబు నీచిన్న తొండంబు నీ గుజ్జ రూపంబు నీ సూర్పకర్ణంబు నీ నాగ యజ్ఞోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీ గంధమున్ గుంకుమంబక్ష తాల్జాజులున్ చంపకంబుల్ తగన్ మల్లెలున్మోల్లులు న్ముంఛి చేమంతులున్ దేల్లగాన్నేరులున్ మంకెనలన్ పోన్నలన్ పువ్వులు న్మంచి దూర్వంబులన్ దెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగముంచేసి విఘ్నేశ్వరా నీకుతేంకాయ పోన్నంటిపండ్లున్ మఱిన్మంచివౌ నిక్షుఖండంబులన్ రేగుబండ్లప్పడాల్ వడల్ నేయిబూరెల్ మరిన్ గోదుమప్పంబులు న్వడల్ పునుగులున్భూరేలున్ న్గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ దేనెయుంజున్ను బాలాజ్యము న్నాను బియ్యంచామ్రంబు బిల్వంబు మేల్ బంగురున్ బల్లెమందుంచి నైవేద్య బంచనీరానంబున్ నమస్కారముల్ చేసి విఘ్నేశ్వరా! నిన్ను బూజింపకే యన్యదైవంబులం బ్రార్ధనల సేయుటల్ కాంచనం బోల్లకే యిన్ము దాగోరు చందంబుగాదే మహాదేవ ! యోభక్తమందార ! యోసుందరాకారా ! యోభాగ్య గంభీర ! యోదేవ చూడామణీ లోక రక్షా మణీ ! బందు చింతామణీ ! స్వామీ నిన్నెంచ, నేనంత నీ దాసదాసాది దాసుండ శ్రీ దొంతరాజాన్వ వాయుండ రామాబిధానుండ నన్నిప్డు చేపట్టి సుశ్రేయునించేసి శ్రీమంతుగన్ జూచి హృత్పద్మ సింహాసనారూడతన్ నిల్పి కాపాడుటేకాడు విన్గోల్చి ప్రార్ధించు భక్తాళికిన్ గోంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్ పాడియున్ బుత్రపౌత్రాభివృద్ధిన్ దగన్ కల్గగాజేసి పోషించు మంటిన్ గృహన్ గావుమంటిన్ మహాత్మా యివే వందనంబుల్ శ్రీ గణేశా ! నమస్తే నమస్తే నమస్తే నమః ||

Sri Rama Dandakam

శ్రీ రామ దండకం ‘శ్రీ రామ రామా, త్రిలోకాభి రామా, పరంధామ, నిష్కామ సంపూర్ణ కామా, బుదేన్ద్రాంత రంగాబ్ది సోమా, లసద్దివ్య నామా, విరాజద్గురు స్తోమ, యుష్మత్ ప్రకాశ స్వరూపంబు అవాచ్యం, అచింత్యం, అనంతం, అసంగం, అఖండం అబాధ్యం, అబోధ్యం, అభేద్యం,...

Vigneshwara Namaskara Stotram

విఘ్నేశ్వర నమస్కార స్తోత్రం (Vigneshwara Namaskara Stotram) జయ విఘ్నేశ్వర ! నమో నమో , జగద్రక్షకా ! నమో నమో జయకర ! శుభకర ! సర్వపరాత్పర ! జగదుద్ధారా ! నమో నమో మూషిక వాహన ! నమోనమో...

Ganapathy Thalam

గణపతి తాళం (Ganapthy Thalam)  అగణిత ఫణి ఫణ మణి గణ కిరణై | రరు నిత నిజ తను రవి థథ వధన, థట థట లుట ధలి కుల కళ వినధో గణపతి రభ మత మీహ దిశ...

Kalidasa Prokta Shyamala Dandakam

శ్రీ కాళిదాస ప్రోక్త శ్యామలా దండకం ( Kalidasa Prokta Shyamala Dandakam) మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ | మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి || 1 || చతుర్భుజే చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే | పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః ||...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!