Home » Dandakam » Sri Sainatha Dandakam

Sri Sainatha Dandakam

శ్రీ సాయినాథ దండకం (Sri Sainatha Dandakam)

శ్రీ సాయిదేవా ! షిరిడీ నివాసా ! నిన్ను గొల్వగా లేరు బ్రహ్మాదు లైనన్ నినుం గొల్వ నేనెంతవాడన్ జగంబెల్ల నీ వల్లనే పుట్టి గిట్టుంగదా ! నీ మహాత్మ్యoబుచే తన సర్వరో గాదులున్ సర్వరాగాదులన్ సర్వకష్టాదులన్ దీరుగాదే శ్రీ సాయిబాబా నిన్న వ్యాయానంద సంధాయి వంచున్ సమస్తంబు నీవే యటంచున్ మనంబందు నిన్నున్ ఘనంబొప్పగా గొల్తు

నీమూర్తి సూర్యుండు నీరూపు సోముండు నీవారయున్ త్రిమూర్త్యాత్మకంబైన తేజంబుగదా | మహాత్మా భక్తులన్ గావగా నీవు యీ లోకమందున్ షిరిడియన్ పురమునన్ శ్రీ సాయి యను పేరుతో భక్తిలోకాళ నెల్లన్ పాలింపగా నీవు వేమ్చేసితివయ్యా మహాత్మా మానవుల్ నిన్ను యే వేళయంధైన యేకష్టమంధైన “ఓం శ్రీ సాయిరాం” ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం యంచున్ మనస్పూర్తిగా గొల్తురో వారినత్యంతకారుణ్యధృష్టిన్ విలోకించికాపాడుమయ్యా నీదే భారమయ్యా

నమస్తే నమస్తే నమస్తే నమః

Sri Vinayaka Dandakam

శ్రీ వినాయక దండకం (Sri Vinayaka Dandakam) శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీస్తోత్ర, సత్పణ్యచారిత్ర, భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీ నాధ సంజాతస్వామి శివాసిద్ధి విఘ్నేశ,     నీ పాద పద్మంబులన్, నిదు కంటంబు నీ   బొజ్జ నీ మోము నీ...

Sri Sai Baba Kakada Harathi

శ్రీ షిరిడి సాయి బాబా కాకడ ఆరతి (Sri Sai baba Kakada Harathi) ౧. జోడు నియాకర చరణి ఠేవిలా మాధా | పరిసావీ వినంతీ మాఝి పండరీనాధా || ||౧|| అసోనసో భావ ఆలో తూఝియా ఠాయా |...

Sri Garuda Dandakam

శ్రీ గరుడదండకం (Sri Garuda Dandakam)   నమః పన్నగనద్ధాయ వైకుణ్ఠవశవర్తినే । శ్రుతిసిన్ధు సుధోత్పాదమన్దరాయ గరుత్మతే ॥ 1॥ Namah pannaganadhaaya Vaikuntavasavarthiney, Shruti Sindhu sudhothpadha mandharaya guruthmathe || గరుడమఖిలవేద నీడాధిరూఢమ్ ద్విషత్పీడనోత్కణ్ఠి తాకుణ్ఠవైకుణ్ఠపీఠీకృతస్కన్ధమీడే స్వనీడాగతిప్రీతరుద్రాసుకీర్తిస్తనాభోగగాఢోపగూఢ స్ఫురత్కణ్టకవ్రాతవేధవ్యథావేపమాన...

Sri Anjaneya Dandakam

శ్రీ ఆంజనేయ దండకం (Sri Anjaneya Dandakam) శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి నీ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!