Home » Dandakam » Sri Santoshi mata devi Dandakam

Sri Santoshi mata devi Dandakam

శ్రీ సంతోషీమాత దండకం (Sri Santoshi mata devi Dandakam)

శ్రీ వాణీ శ్రీ గౌరి ! శ్రీ దేవి కారూపినీ శ్రీ శక్త్యాత్మికే సంతోషీదేవి వైయున్న యో దేవతా సార్వబౌమామణి నిత్య సంతోషిణీ లోకసంచారిణీ, భక్త చింతామణి, దుస్టసిక్షామణీ !మంజుభాషామణీ !పావని నిన్ను వర్ణింప బ్రహ్మాది శేషుండు మున్నోపగాలేరే ! నేనెంతవాడన్ దయాసాగరీ మున్ను యాదానవానీక దుర్మార్గముల్ బాపగా పెక్కు రూపంబులన్ పెక్కు నామంబులన్ ఉద్భవంబొందవే ! తొల్లి దుర్మార్గులౌ రక్కసుల్ సొక్కి స్వర్గాది లోకంబులన్ చేరి పున్యాత్ములన్ గాంచికల్లోలముల్ చేయగా దేవతానీకముల్ బాధలన్ చిక్కి తా జేయునద్దేదియున్ గానకోయమ్మ యో దేవీ ! యోశాంభవి ! శాంకరీ ! కనక దుర్గా ! యోకంచి కామాక్షీ! యో కాళీ ! యోపార్వతీ ! శ్రీ భవానీ ! దేవ దేవీ యటంచున్ కడున్దీ నతన్ పొంది ఆపన్నులై వేడయవతారముల్ దాల్చియున్ పెక్కులున్ బాహువుల్ ఖడ్గముల్ శూలాద్యనేకాయుదాల్ పట్టి ఝంకార మొప్పార, క్రోధాగ్నిజ్వాలా ప్రకాశంభులన్ వెల్గుచున్ వచ్చు నీ మోహమున్ గాంచి ఆ రాక్షసానీక బృందము లబ్బబ్బ ఈరూపమేనాడు జూడంగ లేదంచు యోతల్లీ ! యోమాతా ! యోదేవీ రక్షింపవే యటంచున్ తగన్ వేడుచున్నట్టి యవ్వారలన్ వీడిదుర్మర్ఘులన్ ద్రుంచి యున్ బట్టి వర్దిల్లునీ మానవానీక మయ్యయ్యో నీయాగ్రహంబందునన్ గల్గగా చేసితే కేకలార్భాటముల్ కల్గగా చేసితే రోప్పచున్ పేక్కులున్ పొక్కు లెక్కించితే దేహ మాయాసమున్, నొప్పులన్ తీపులన్ కల్గగన్ చేసితే నోటి కారోగ్యమున్ బాపితే నోటిరుచులన్ నేత్రరోగంబులన్ గల్గగాచేసితే వారెనిన్నుగొల్చినయుత్సవం బొప్పగా వించియోతల్లీ యోదేవీయంచుం కడుంబెక్కుదండంబులన్ పెట్టగన్ జాలియున్ పొంది ఆరోగ్యమున్ పొందగంజేసితే వారు ఆరోగ్యమున్ పొంది స్నానములన్ చేసియానంద వారాశినిన్ దాల్చినీ యుత్సవం బొప్పగా చేయుచున్ పండ్లుపక్వాన్న పానీయముల్ మధుర భక్ష్యంబులున్ భక్తితో తెచ్చి నీ కర్పణం బొప్పగా చేయ సంతోషమున్ చెంది సర్వార్ధముల్ యిచ్చు నీ తల్లీ సర్వార్దసాధినీ ! నిత్యసంతోషిణీ భక్తరక్షామణీ ! నీ కృపాదృష్టిచే మమ్ము కాపాడునీకన్న మాక్వెరున్ వేల్పులున్నారు. నిన్నుకోల్చినవారవారంబులన్ శుక్రవారంబు నీ పూజలన్ చేసియానందమున్ బొందు చున్నంత మమ్మెల్ల బ్రోచుచున్ మా తప్పులన్ సైరించి మొప్పగా బావించి మా జేయు, లోపంబులేవైన కలనేని తల్లిగా భావించి రక్షించి కాపాడుమో తల్లీ నిన్నుయీ రీతి స్తోత్రంబులన్ చేయు మా బిడ్డలంగాంచి మాయాపదల్ దీర్చి మా తల్లివై బ్రోపుమా మా తండ్రివై గావు మామా ఇష్టముల్ దీర్చిమమ్మెల్లకాపాడుమా ! నీ యందు ఎనలేని భక్తియున్ శ్రద్ధయున్ సమకూర్చవే తల్లీ యీ దండకం బెప్పుడున్ భక్తిచే బల్కునెవ్వరికిన్ శ్రద్ధచే మోక్షమున్ గల్గచేయుగా గోరితిన్ నాదు వాక్యంబులందున్న లోపంబులన్ ఎంచకే ప్రొద్దునీదాసదాసున్నన్ను రక్షింపుమో తల్లీ ఓ తల్లి సంతోష సామ్రాజ్య ఆనంద సామ్రాజ్య రక్షామణీ! నిత్య సౌభాగ్య సంరక్షిణీ భక్త చింతామణీ దేవీ ! సంతోషీ నమస్తే నమస్తే నమస్తే నమః

Sri Anjaneya Dandakam

శ్రీ ఆంజనేయ దండకం (Sri Anjaneya Dandakam) శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి నీ...

Sri Santoshi Mata Ashtottaram

శ్రీ సంతోషీమాత అష్టోత్తరం (Sri Santoshi Mata Ashtottaram) ఓం కమలసనాయై నమః ఓం కారుణ్య రూపిన్యై నమః ఓం కిశోరిన్యై నమః ఓం కుందరదనాయై నమః ఓం కూటస్థాయై నమః ఓం కేశవార్చితాయై నమః ఓం కౌతుకాయై నమః ఓం...

Sri Vinayaka Dandakam

శ్రీ వినాయక దండకం (Sri Vinayaka Dandakam) శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీస్తోత్ర, సత్పణ్యచారిత్ర, భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీ నాధ సంజాతస్వామి శివాసిద్ధి విఘ్నేశ, నీ పాద పద్మంబులన్, నిదు కంటంబు నీ   బొజ్జ నీ మోము నీ మౌలి బాలేందు...

Sri Santoshi Mata Vrata Vidhanam

శ్రీ సంతోషిమాతా వ్రత విధానము (Sri Santoshi Mata Vrata Vidhanam) ముందుగా గణపతి పూజ చేసి, తదుపరి పసుపుతో గౌరీదేవిని చేసి ఆ దేవతను పూజించాలి. గౌరీపూజ: మాతాపితాత్వాం – గురుసద్గతి శ్రీ త్వమేవ సంజీవన హేతుభూతా ఆవిర్భావాన్ మనోవేగాట్...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!