Home » Ashtakam » Vaidyanatha Ashtakam

Vaidyanatha Ashtakam

వైద్యనాథాష్టకము (Vaidyanatha Ashtakam)

శ్రీ రామ సౌమిత్రి జటాయు వేద
షడాననాదిత్య కుజార్చితయ
శ్రీ నీలకంఠాయ దయామయాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || 1 ||

గంగా ప్రవాహేందు జటాధరయ
త్రిలోచనాయ స్మర కాల హంత్రే
సమస్త దేవైరపి పూజితాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || 2 ||

భక్త ప్రియాయ త్రిపురాంతకాయ
పినాకినీ దుష్ట హరాయ నిత్యమ్
ప్రత్యక్ష లీలాయ మనుష్య లోకే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || 3 ||

ప్రభూత వాతాది సమస్త రోగ
ప్రణాశ కర్త్రే ముని వందితాయ
ప్రభాకరేంద్ర్వగ్ని విలోచనాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || 4 ||

వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి విహీన జంతోః
వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి సుఖ ప్రదాయ
కుష్ఠాది సర్వోన్నత రోగ హంత్రే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || 5 ||

వేదాంత వేద్యాయ జగన్మయాయ
యోగీశ్వర ధ్యేయ పదాంబుజాయ
త్రిమూర్తి రూపాయ సహస్ర నామ్నే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || 6 ||

స్వతీర్థ మృడ్భస్మ భృతాంగ భాజాం
పిశాచ దుఃఖార్తి భయాపహాయ
ఆత్మ స్వరూపయ శరీర భాజాం
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || 7 ||

శ్రీ నీలకంఠాయ వృష ధ్వజాయ
స్రక్గంధ భస్మాద్యభి శోభితాయ
సుపుత్రదారాది సుభాగ్యదాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || 8 ||

ఫల శ్రుతిః

బాలాంబికేశ వైద్యేశ భవ రోగ హరేతి చ
జపేన్నామ త్రయం నిత్యం మహారోగ నివారణం

పరమశివుడు వైద్యులకు అధిపతిగా కూడా పేరొందాడు. శ్రీ రుద్రాభిషేచనంలో చాలా భాగం దీన్ని వక్కాణిస్తుంది.
నమకం, చమకంలో పూర్తి ప్రార్థన, ఫలితం కూడా రోగ నివారణ,  ఆరోగ్యము, దీర్ఘాయుష్షు గురించి చెపుతాయి.
అందుకనే శివుని వైద్యనాథుడిగా కొలుస్తారు. దీనికి జ్యోతిర్లింగ స్వరూపమే మహారాష్ట్ర అంబజోగై సమీపం లోని వైద్యనాథ దేవాలయం. అలాగే, తమిళనాట చిదంబరం దగ్గర వైదీశ్వరన్ కోవిల్ ఈ స్వామి మహాత్మ్యాన్ని తెలిపేదే.

జటాయు అంత్యక్రియలు, కుష్ఠు వ్యాధితో బాధపడుతున్న అంగారకునికి (కుజ గ్రహం) రోగ నివారణ ఇక్కడే జరిగాయని గాథ. సుబ్రహ్మణ్యునికి శూలము కూడా ఇక్కడ శివుని ప్రార్థించిన తర్వాతే లభించిందని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఇక్కడి సిద్ధామృత తీర్థం (పుష్కరిణిలో నీరు), అంగసనాతన తీర్థంలో స్నానం చేసి, వేప చెట్టు క్రింద మట్టి తీసుకుని పవిత్ర భస్మముతో కలిపి దేవునికి సమర్పించి ఆ సిద్ధామృత తీర్థంతో తీసుకుంటే సర్వ రోగ నివారణ అవుతుందని గట్టి విశ్వాసం. అలాగే ఆ వైద్యనాథుని ఈ క్రింది స్తోత్రము రోజుకు మూడు సార్లు చదివితే ఆరోగ్యం కలుగుతుందట. అంతటి మహిమాన్వితమైన వైద్యనాథ అష్టకం

Parvathi Vallabha Neelakanta Ashtakam

పార్వతీవల్లభనీలకంఠాష్ఠకమ్ (Parvathi Vallabha Neelakanta Ashtakam) నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమశ్శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం || 1 || సదాతీర్థసిద్ధం సదా భక్తరక్షం సదాశైవపూజ్యం సదా శుభ్ర భస్మం...

Sri Sadashiva Ashtakam

శ్రీ సదాశివాష్టకం (Sri Sadashiva Ashtakam) సదా ఇందుమౌళిం సదా జ్ఞానగమ్యం సదా చిత్ప్రకాశం సదా నిర్వికారం సదానందరూపం సదా వేదవేద్యం సదా భక్తమిత్రం సదా కాలకాలం భజే సంతతం శంకరం పార్వతీశం || 1 || సదా నీలకంఠం సదా...

Sri Rajarajeshwari Ashtakam

శ్రీ రాజరాజేశ్వరీ స్తోత్రం (Sri Rajarajeshwari Ashtakam) అంబాశాంభవి చంద్రమౌళి రబలా పర్ణా ఉమాపార్వతీ కాళీ హైమావతీ శివాత్రిణయనీ కాత్యాయనీ భైరవీ సావిత్రీ నవయౌవనీ శుభకరీ సామ్రాజ్య లక్ష్మీప్రదా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 1 || అంబామోహినిదేవతా...

Sri Surya Ashtakam

శ్రీ సూర్య అష్టకం (Sri Surya Ashtakam) ॥ శ్రీ గణేశాయ నమః ॥ సాంబ ఉవాచ ॥ ఆదిదేవం నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర । దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే || 1 || సప్తాశ్వరథమారూఢం ప్రచణ్డం కశ్యపాత్మజమ్...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!