Home » Stotras » Vasista Kruta Sivalinga Stotram

Vasista Kruta Sivalinga Stotram

వశిష్ఠ కృత శివలింగ స్తుతి (Vasista Kruta Sivalinga Stotram)

నమః కనక లింగాయ వేద లింగాయ వై నమః
నమః పరమ లింగాయ వ్యోమ లింగాయ వై నమః||

నమః సహస్ర లింగాయ వహ్నిలింగాయ వై నమః
నమః పురాణా లింగాయ శ్రుతి లింగాయ వై నమః||

నమః పాతాళ లింగాయ బ్రహ్మ లింగాయ వై నమః
నమో రహస్య లింగాయ సప్తద్వీపోర్థ్వలింగినే||

నమః సర్వాత్మ లింగాయ సర్వలోకాంగలింగినే
నమస్త్వవ్యక్త లింగాయ బుద్ధి లింగాయ వై నమః ||

నమోహంకారలింగాయ భూత లింగాయ వై నమః
నమ ఇంద్రియ లింగాయ నమస్తన్మాత్ర లింగినే నమః ||

పురుష లింగాయ భావ లింగాయ వై నమః
నమో రజోర్ద్వలింగాయ సత్త్వలింగాయ వై నమః ||

నమస్తే భవ లింగాయ నమస్త్రైగుణ్యలింగినే నమః
అనాగతలింగాయ తేజోలింగాయ వై నమః ||

నమో వాయూర్ద్వలింగాయ శ్రుతిలింగాయ వై నమః
నమస్తే అథర్వ లింగాయ సామ లింగాయ వై నమః ||

నమో యజ్ఙాంగలింగాయ యజ్ఙలింగాయ వై నమః
నమస్తే తత్త్వలింగాయ దైవానుగత లింగినే ||

దిశనః పరమం యోగమపత్యం మత్సమం తథా
బ్రహ్మచైవాక్షయం దేవ శమంచైవ పరం విభో ||
అక్షయం త్వం చ వంశస్య ధర్మే చ మతిమక్షయామ్ ||

భావం :

కనక లింగమునకు నమస్కారము, వేదలింగమునకు, పరమ లింగమునకు, ఆకాశ లింగమునకు, సహస్ర లింగమునకు, వహ్ని లింగమునకు, పురాణ లింగమునకు, వేద లింగమునకు, పాతాళ లింగమునకు, బ్రహ్మ లింగమునకు, సప్తద్వీపోర్థ్వ లింగమునకు, సర్వాత్మ లింగమునకు, సర్వలోక లింగమునకు, అవ్యక్త లింగమునకు, బుద్ధి లింగమునకు, అహంకార లింగమునకు, భూత లింగమునకు, ఇంద్రియ లింగమునకు, తన్మాత్ర లింగమునకు, పురుష లింగమునకు, భావ లింగమునకు, రజోర్ధ్వ లింగమునకు, సత్త్వ లింగమునకు, భవ లింగమునకు, త్రైగుణ్య లింగమునకు, అనాగత లింగమునకు, తేజో లింగమునకు, వాయూర్ధ్వ లింగమునకు, శ్రుతి లింగమునకు, అథర్వ లింగమునకు, సామ లింగమునకు, యజ్ఙాంగ లింగమునకు, యజ్ఙ లింగమునకు, తత్త్వ లింగమునకు, దైవతానుగత లింగ స్వరూపము అగు శివునికి, సర్వరూపములలో సకలము తానై ఉన్న లింగ స్వరూపుడైన శంభుదేవునకు పునః పునః నమస్కారము|

ప్రభూ! నాకు పరమయోగమును ఉపదేశించుము, నాతో సమానుడైన పుత్రుడనిమ్ము, నాకు అవినాశి యగు పరబ్రహ్మవైన నీ యొక్క ప్రాప్తిని కలిగించుము, పరమ శాంతినిమ్ము, నావంశము ఎన్నటికీ క్షీణము కాకుండుగాక, నా బుద్ధి సర్వదా ధర్మముపై లగ్నమైఉండుగాక.

పూర్వము వశిష్ఠమహర్షి శ్రీపర్వతముపైన (శ్రీశైలమందు) శంభుదేవుని ఈ స్తోత్రముతో స్తుతించగా, శంభుడు అనేక వరములను, శుభములను ఇచ్చి అచటనే అంతర్థానమయ్యెను.

ఇది వశిష్ఠ కృతమైనా దీనిని ఎవరు చదువుతే వారు స్వామికి చెప్పుకున్నట్లుగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ స్తోత్రంలో అడిగిన చిట్టచివరి కోరిక మనం అందరం ప్రతిరోజూ ప్రతిక్షణం భగవంతుని పెద్దలను కోరవలసినదే.

Sankata Mochana Sri Hanuman Stotram

संकट मोचन हनुमान् स्तोत्रम् (Sankata Mochana Sri Hanuman Stotram) काहे विलम्ब करो अंजनी-सुत ,संकट बेगि में होहु सहाई ।। नहिं जप जोग न ध्यान करो ,तुम्हरे पद पंकज में सिर...

Sri Ashta Vinayaka Prarthana

శ్రీ అష్ట వినాయక ప్రార్థనా(Sri Ashta Vinayaka Prarthana) స్వస్తి శ్రీ గణనాయకం గజముఖం మోరేశ్వరం సిద్ధిదం బల్లాలం మురుళం వినాయక మిదం చింతామణి ధేవరం లేహ్యాద్రి గిరిజాత్మజం సువరధం విఘ్నేశ్వర ఓక్షరం గ్రామే రంజనసంస్థితో గణపతిహి కుర్యాత్సదా మంగళం Svasthi...

Ganapathy Thalam

గణపతి తాళం (Ganapthy Thalam)  అగణిత ఫణి ఫణ మణి గణ కిరణై | రరు నిత నిజ తను రవి థథ వధన, థట థట లుట ధలి కుల కళ వినధో గణపతి రభ మత మీహ దిశ...

Sri Gayatri Devi Stotram

దేవి భాగవతాంతర్గత శ్రీ గాయత్రి దేవీ  స్తోత్రం (Sri Gayatri Devi Stotram) నారద ఉవాచ భక్తానుకంపిన్సర్వజ్ఞ హృదయం పాపనాశనమ్ । గాయత్ర్యాః కథితం తస్మాద్గాయత్ర్యాస్తోత్రమీరయ । 1 । శ్రీ నారాయణ ఉవాచ ఆదిశక్తి జగన్మాత ర్భక్తానుగ్రహకారిణి | సర్వత్ర...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!