Home » Dandakam » Sri Shanmukha Dandakam
sri shanmukha dandakam

Sri Shanmukha Dandakam

శ్రీ షణ్ముఖ దండకం (Sri Shanmukha Dandakam)

ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్థూల సూక్ష్మ ప్రదర్శకాయం, ప్రకీర్తి ప్రదాయం, భజేదుర్ధరాయం, భజేహం పవిత్రం, భజే శివతేజం, భజే స్థాపకాయం, భజే ప్రసన్నరూపం, భజే దయామయివటంచున్ ప్రభాతంబు, సాయంత్రం మున్నీదు దివ్యనామ సంకీర్తనల్ జేసినన్, నీ రూపు వర్ణించి, నీ మీదనే దండకం బొక్కటిన్ జేయనూహించి, నీ దివ్యగానంబు కీర్తించి, నీ దాసదాసుండనై శివభక్తుండనై నిన్ను నే గొల్చేదన, నీవు దయాదృష్టిన్ జూచితే వేడుకల్ జేసితే, నా మొరాలించితే, నన్ను రక్షించితే శివపార్వతీ ప్రియపుత్రాయ, నిన్నెంచ నేనెంత వాడన్, కరుణా కటాక్షంబున జూచితే దాతవై బ్రోచితే, తొల్లి షణ్ముఖుండవై, కార్తికేయుండవై, శివాహ్వానాన్ని మన్నించి, కైలాసమునకున్ బోయి దేవసైన్యాధ్యక్షుండవై, కీర్తిమంతుడవై, చిత్ర బర్హణవాహనుండవై, పార్వతీ పరమేశ్వరాశీస్సులన్ బొంది, కార్యసాధకుండవై, నీ వీరపరాక్రమంబులన్ జూపి అమరులకున్ అభయమున్నిచ్చిత్రైలోక్య పూజ్యుండవై, ముప్పది మూడు కోట్ల ద్వతలకున్నిష్ణుండవై, తారకాసుర సంహరివై, శోణిత పురంబువై దండయాత్రన్ ప్రారంభించి పురంబు ముట్టడించి, రణభేరుల్ మ్రోగించ, విశాఖునిన్ రాయబారిగా ఆ యసుర పురంబుజకున్ జంప, తారకాసురుండు రెట్టించి హెచ్చించి నాగ్రహంబుతో నీ మీదకున్ దండెత్త, మ నీవప్పుడే శివపంచాక్షరిన్ జపించి మంత్రించి, నీ దివ్య తేజంబుజన్ జూప తారకాసురుండచ్చెరువంద, అమితోత్సాహుండవై పాశుపతాస్త్రమున్ ప్రయోగింప, దైత్యులంతటన్ కకావికలైపోవన్నట్టి సమయంబునన్, తారకాసురన్, దృంచ, నా దుష్టుడన్ పునర్జీవించి బాధనొందింపగా, నాతని కంఠమునందున్న శివలింగమున్నీవు చ్చేదించి ఆ యసరునిన్ జంప, లోకంబులానందమై యుండ నీ దివ్య తేజంబు సమస్త లోకంబులన్ బ్రసరింప వేల్పులందరున్ వేనోళ్ళ బొగడంగ త్రిమూర్తులన్ హర్షించి, మోదంబునన్ నీకు కళ్యాణమున్ జేయబోవంగ, దేవసేనిన్ బెండ్లాడి సుఖంబునుండన్ నీవు శ్రీ వల్లినిన్ జూచి మోహింప ఉమామహేశ్వరుడన్నది గ్రహించి వైభవోపేతంబుగా శ్రీ వల్లిన్నిచ్చి వివాహంబుజేయ, శ్రీ శివామోదంబుగా నిన్ను నే సేవించి నా కుజ దోష నివారణకున్ నిన్ ప్రార్థింప, ఆమోదంబు దేల్పినన్ బాయవే, అష్టైశ్వర్య సామ్రాజ్యముల్ గల్గవే నీవే సమస్తంబుగా నెంచి యీ దండకంబున్ పఠించుచున్ శివేశ్వరాయంచున్ శివతేజంబుజన్ వేల్గుదువో వీర సుబ్రహ్మణ్యేశ్వరా! నీదు నామంబు స్మరించినంతన్ అంగారక గ్రహదోష నివారణన్ జేసి నీ దివ్య రూపంబునుం జూపి హృదయాంతరంగయటంచున్ నన్నేలు నా స్వామి ఓం సుబ్రహ్మణ్యేశ్వరా! తారకాసుర సంహారా! దేవసే శ్రీ వల్లీస నాథా! నమస్తే నమో కుజదోష నివారకాయ నమస్తే నమస్తే నమః

Sri Subramanya Ashtakam Karavalamba Stotram

శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ కరావలంబ స్తోత్రం (Subramanya Ashtakam Karavalamba Stotram) హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో | శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || He swaminatha karuṇakara deenabandho, Sriparvateesa mukhapankaja padmabandho | Srishadhi...

28 names of Lord Subrahmanya

సుబ్రమణ్య స్వామి 28 నామములు (28 names of Lord Subrahmanya) స్కంద ఉవాచ 1. యోగీశ్వరః – యోగీశ్వరులకు అధిపతి. 2. మహాసేనః – దేవసైన్యానికి అధిపతి, దేవసేనాపతి. 3. కార్తికేయః – ఆరు కృత్తికా నక్షత్రములచే పోషింపబడిన వాడు....

Sri Vinayaka Dandakam

శ్రీ వినాయక దండకం (Sri Vinayaka Dandakam) శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీస్తోత్ర, సత్పణ్యచారిత్ర, భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీ నాధ సంజాతస్వామి శివాసిద్ధి విఘ్నేశ, నీ పాద పద్మంబులన్, నిదు కంటంబు నీ   బొజ్జ నీ మోము నీ మౌలి బాలేందు...

Sri Anjaneya Dandakam

శ్రీ ఆంజనేయ దండకం (Sri Anjaneya Dandakam) శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి నీ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!