శ్రీ వినాయక స్తోత్రం (Sri Vinayaka Stotram)

తొండమునేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయగజ్జెలను మెల్లని చూపులు మంద హాసమున్ కొండొక గుజ్జ రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడు పార్వతి తనయయోయి గణాదిపా నీకు మ్రోక్కెన్ || 1 ||

తొలుతన విఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయుమయ్య నిన్ను ప్రార్ధన చేసేద నేకదంత నా వలపటి చేతి ఘంటమును వాక్కును నెప్పుడు బాయకుండుమీ తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోకనాయక || 2 ||

తలచెదనే గణనాధుని తలచెదనే విఘ్న పతిని దలచిన పనిగా ధలచనే హీరంభుని దలచెద నా విఘ్నములను తొలగుట కోరుకున్ || 3 ||

అటుకులు కొబ్బరి పలుకులు చిట్టి బెల్లము నానబ్రాలు చెరుకురసంభున్ విటలాక్షునగ్ర సుతునకు పటుతరముగ విందుచేతు ప్రార్దింతు మదిన్ || 4||

అంకముజేరి శైలతనయా స్తన దుగ్ధము లానువేళ బా ల్యాంకవిచేష్ట తుండమున యవ్వలిచ న్గబలింపబోయి యావంక కుచంబుగాన కహివల్లభ హారముగాంచి వేమృణా లాంకుర శంకనంటెడు గాజాస్యుని గొల్తు నభీష్టసిద్ధికిన్ || 5 ||

ఈశునంతవాని ఎదురించి పోరాడి మడిసివాని చేత మరళాబ్రతికి
సర్వవంద్యు డైన సామజాతమూర్తి – కంజలింతు విఘ్న భంజనునకు

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: