Home » Mukkoti Ekadashi » Ekadashi Vratam

Ekadashi Vratam

ముక్కోటి ఏకాదశి వ్రతం (Mukkoti Ekadashi Vratam) 

ఏకాదశీ వ్రతం” ఎలా చేయాలో మీకు తెలుసా అయితే ఈ కథనం చదవండి.

ఏకాదశీ రోజున వేయి కనులతో వీక్షించి, సేవించి, తరి౦చాలని పండితులు చెబుతున్నారు. ముక్కోటి దేవతలు వైకుంఠమునకు చేరుకొనే శుభపర్వ దినం వైకుంఠ ఏకాదశి. దీనినే ‘ముక్కోటిఏకాదశి’ పేరుతో వైష్ణవాలయాల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి నాడు అన్ని వైష్ణవాలయాల్లో ఉత్తరంవైపు ఉండే వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు.

ఈ ద్వారం ద్వార స్వామిని దర్శించుకోవడం పుణ్యప్రదం. శ్రీమహావిష్ణువుతో బాటు ముక్కోటి దేవతలు ఈ రోజున భువికి దిగివస్తారని శాస్త్రవచనం. దక్షియణాయానంలో దివంగతులైన పుణ్యాత్ములు ఈ రోజున వైకుంఠ ద్వార౦ ద్వారా స్వర్గానికి చేరుకుంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతం చేసి, విష్ణువుని పూజించి, ఉపవాసం, జాగరణ పాటించడ౦ వల్ల పుణ్యఫలితాలు లభిస్తాయి. ఏకాదశి ఉపవాస తిథి విష్ణు స్వరూపమైనది. ఈ వైకుంఠ ఏకాదశీనే ‘పుత్రద ఏకాదశి’ అని అంటారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. దశమి రాత్రి కూడా భుజించకూడదు.

ద్వాదశినాడు ద్వాదశి ఘడియలు వెళ్ళాక ముందే పారణం (భోజనం) చేయాలి. దేవతలకు ఆరునెలలు పగలు, ఆరునెలలు రాత్రి. దక్షిణాయానం రాత్రికాలం. ఈ చీకటి తొలగి దేవతలు వెలుగులోకి వస్తారు. అంటే వారికి పగలు ప్రారంభమైనట్టు.

అందుకే ఆ రోజు ఉపవాసం పుణ్యప్రదం. బ్రహ్మ స్వేదబిందువు నుండి రాక్షసుడు జన్మించాడని, బ్రహ్మ ఆజ్ఞతో ముక్కోటి ఏకాదశీ నుండి అన్నంలో నివసిస్తాడని పురాణ కథనం. అందుకే ఆ రోజున భోజనం మాని ఉపవాసం ఉండాలంటారు. ఏడాదిలో 24 ఏకాదశుల్లో ఉపవాశం ఉంటే వచ్చే మొత్తం ఫలితం ముక్కోటి ఏకాదశి రోజున లభిస్తుంది.

Sri Kshirabdhi Sayana Ashtottara Shatanamavali

శ్రీ క్షీరాబ్ది శయన నారాయణ అష్టోత్తర శతనామావళి (Sri Kshirabdhi Sayana narayana Ashtottara Shatanamavali) ఓం విష్ణవే నమః ఓం లక్ష్మీ పతయేనమః ఓం కృష్ణాయ నమః ఓం వైకుంఠాయ నమః ఓం గరుడధ్వజాయ నమః ఓం పరబ్రహ్మణే నమః...

Vaikunta Ekadashi / Mukkoti Ekadashi / Puthrada Ekadashi

వైకుంఠ ఏకాదశి /ముక్కోటి ఏకాదశి / పుత్రద ఏకాదశి (Vaikunta Ekadashi /Mukkoti /Puthrada Ekadashi) వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీని గొప్పతనాన్ని వివరించే కథ…. పూర్వం మహారాజు “సుకేతుడు” ‘భద్రావతి’ రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని...

Om Namo Narayanaya Ashtakashara Mahatyam

ఓం నమో నారాయణాయ అష్టాక్షర మాహాత్మ్యం (Om Namo Narayanaya Ashtakashara Mahatyam) శ్రీశుక ఉవాచ కిం జపన్ ముచ్యతే తాత సతతం విష్ణుతత్పరః | సంసారదుఃఖాత్ సర్వేషాం హితాయ వద మే పితః || 1|| వ్యాస ఉవాచ అష్టాక్షరం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!