Home » Sri Shiva » Sri Krishna Kruta Shiva Stuthi

Sri Krishna Kruta Shiva Stuthi

శ్రీ కృష్ణ కృత శివ స్తుతి  (Sri Krishna Kruta Shiva Stuti)

త్వమేవ సత్త్వం చ రజస్తమశ్చ త్వమేవ సర్వం ప్రవదంతి సంతః |
తతస్త్వమేవాసి జగద్విధాయకః త్వమేవ సత్యం ప్రవదంతి వేదాః ||

సత్త్వరజస్తమాలనే గుణాలు నీవే. సర్వం నీవేనని సత్పురుషులు చెబుతుంటారు. కనుక నీవే జగద్విధానాన్ని నడపువాడవు. నువ్వు సత్యానివని వేదములు పలుకుతున్నాయి.

త్వ బ్రహ్మా హరిరథ విశ్వయోనిః అగ్నిస్సంహర్తా దినకర మండలాధివాసః |
ప్రాణస్త్వం హుతవహ వాసవాది భేదః త్వామేకం శరణముపైమి దేవమీశం ||

విశ్వానికి కారణమైన నువ్వే బ్రహ్మవు, హరివి, సంహారకుడైన (కాలరూప) అగ్నివి. సూర్యమండలంలో ఉన్నవాడవు. ప్రాణానివి. అగ్ని ఇంద్రాది భేదములతో నున్న ఏక రూపుడైన, స్వయం ప్రకాశుడవైన, ఈశ్వరుడవైన నిన్ను శరణువేడుతున్నాను.

సాంఖ్యా స్త్వామగుణ మధాహురేక రూపం యోగస్త్వాం సతతముపాసతే హృదస్థం  |
దేవాస్త్వామభిదధతేహ రుద్రమగ్నిం త్వామేకం శరణముపైమి దేవమశం ||

సాంఖ్యులు (బ్రహ్మజ్ఞానులు) నిన్ను నిర్గుణుడివైన ఏకతత్త్వముగా చెబుతున్నారు. యోగులు హృదయంలో నిన్ను ఎల్లవేళలా ఉపాసిస్తున్నారు. అగ్ని రూపుడవైన రుద్రునిగా దేవతలు నిన్ను సంపూర్ణంగా గ్రహిస్తున్నారు.

Narada Rachitam Sri Krishna Stotram

శ్రీ కృష్ణస్తోత్రం (నారద రచితం) (Narada Rachitam Sri Krishna Stotram) వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససమ్ | సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరమ్ || 1 || రాధేశం రాధికాప్రాణవల్లభం వల్లవీసుతమ్ | రాధాసేవితపాదాబ్జం రాధావక్షఃస్థలస్థితమ్ || 2...

Kalidasa Prokta Shyamala Dandakam

శ్రీ కాళిదాస ప్రోక్త శ్యామలా దండకం ( Kalidasa Prokta Shyamala Dandakam) మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ | మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి || 1 || చతుర్భుజే చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే | పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః ||...

Mahasivarathri Mantras- Chant Powerful Mantras at Great Sivaratri Night

మహాశవరాత్రి రోజు రాత్ర పూట జపించవలసిన మంత్రాలు(Mahasivarathri Mantras- Chant Powerful Mantras at Great sivaratri Night) భయం నిర్మూలించడానికి శివ మంత్రం (Siva Mantra to Eradicate Fear) ఓం నమః శివాయ || om Namah Sivaaya...

Sri Mahakala Stotram

श्री महाकाल स्तोत्रं (Sri Mahakala Stotram) ॐ महाकाल महाकाय महाकाल जगत्पते महाकाल महायोगिन महाकाल नमोस्तुते महाकाल महादेव महाकाल महा प्रभो महाकाल महारुद्र महाकाल नमोस्तुते महाकाल महाज्ञान महाकाल तमोपहन महाकाल महाकाल...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!