Home » Stotras » Sri Shiva Aksharamala stotram

Sri Shiva Aksharamala stotram

శ్రీ శివ అక్షరమాల స్తోత్రం (Sri Shiva Aksharamala stotram)

అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ
ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ
ఇందు కళాధర ఇంద్రాదిప్రియ సుందరరూప సురేశ శివ
ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత కీర్తి శివ
ఉరగాదిప్రియ ఉరగవిభూషణ నరకవినాశ నటేశ శివ
ఊర్జిత దానవనాశ పరాత్పర ఆర్జిత పాపవినాశ శివ
ఋగ్వేదశ్రుతి మౌళి విభూషణ రవి చంద్రాగ్ని త్రినేత్ర శివ
ౠపనామాది ప్రపంచ విలక్షణ తాపనివారణ తత్వ శివ
ళుల్లిస్వరూప సహస్ర కరోత్తమ వాగీశ్వర వరదేశ శివ
ళూతాధీశ్వర రూపప్రియహర వేదాంతప్రియ వేద్య శివ
ఏకానేక స్వరూప సదాశివ భోగాదిప్రియ పూర్ణ శివ
ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన సచ్చిదానంద సురేశ శివ
ఓంకారప్రియ ఉరగవిభూషణ హ్రీంకారప్రియ ఈశ శివ
ఔరసలాలిత అంతకనాశన గౌరిసమేత గిరీశ శివ
అంబరవాస చిదంబర నాయక తుంబురు నారద సేవ్య శివ
ఆహారప్రియ అష్ట దిగీశ్వర యోగి హృదిప్రియవాస శివ

కమలాపూజిత కైలాసప్రియ కరుణాసాగర కాశి శివ
ఖడ్గశూల మృడ టంక ధనుర్ధర విక్రమరూప విశ్వేశ శివ
గంగా గిరిసుత వల్లభ శంకర గణహిత సర్వజనేశ శివ
ఘాతక భంజన పాతకనాశన దీనజనప్రియ దీప్తి శివ
ఙ్నాన్త స్వరూపానంద జనాశ్రయ వేదస్వరూప వేద్య శివ

చండవినాశన సకలజనప్రియ మండలాధీశ మహేశ శివ
ఛత్రకిరీట సుకుండల శోభిత పుత్రప్రియ భువనేశ శివ
జన్మజరా మృత్యాది వినాశన కల్మషరహిత కాశి శివ
ఝంకారప్రియ భృంగిరిటప్రియ ఒంకారేశ్వర విశ్వేశ శివ
ఙ్నానాఙ్నాన వినాశన నిర్మల దీనజనప్రియ దీప్తి శివ

టంకస్వరూప సహస్ర కరోత్తమ వాగీశ్వర వరదేశ శివ
ఠక్కాద్యాయుధ సేవిత సురగణ లావణ్యామృత లసిత శివ
డంభవినాశన డిండిమభూషణ అంబరవాస చిదేక శివ
ఢంఢండమరుక ధరణీనిశ్చల ఢుంఢివినాయక సేవ్య శివ
నానామణిగణ భూషణనిర్గుణ నతజనపూత సనాథ శివ

తత్వమస్యాది వాక్యార్థ స్వరూప నిత్యస్వరూప నిజేశ శివ
స్థావరజంగమ భువనవిలక్షణ తాపనివారణ తత్వ శివ
దంతివినాశన దళితమనోభవ చందన లేపిత చరణ శివ
ధరణీధరశుభ ధవళవిభాసిత ధనదాదిప్రియ దాన శివ
నళినవిలోచన నటనమనోహర అళికులభూషణ అమృత శివ

పార్వతినాయక పన్నగభూషణ పరమానంద పరేశ శివ
ఫాలవిలోచన భానుకోటిప్రభ హాలాహలధర అమృత శివ
బంధవిమోచన బృహతీపావన స్కందాదిప్రియ కనక శివ
భస్మవిలేపన భవభయమోచన విస్మయరూప విశ్వేశ శివ
మన్మథనాశన మధురానాయక మందరపర్వతవాస శివ

యతిజన హృదయాధినివాస విధివిష్ణ్వాది సురేశ శివ
రామేశ్వరప్రియ రమణముఖాంబుజ సోమేశ్వర సుకృతేశ శివ
లంకాధీశ్వర సురగణ సేవిత లావణ్యామృత లసిత శివ
వరదాభయకర వాసుకిభూషణ వనమాలాది విభూష శివ
శాంతి స్వరూప అతిప్రియసుందర వాగీశ్వర వరదేశ శివ
షణ్ముఖజనక సురేంద్ర మునిప్రియ షాడ్గుణ్యాది సమేత శివ

సంసారార్ణవ నాశన శాశ్వత సాధుజన ప్రియవాస శివ
హరపురుషోత్తమ అద్వైతామృత మురరిపు సేవ్య మృదేశ శివ
లాళిత భక్తజనేశ నిజేశ్వర కాళినటేశ్వర కామ శివ
క్షరరూపాభి ప్రియాన్విత సుందర సాక్షాత్ స్వామిన్నంబా సమేత శివ.

శివుని అక్షరమాల లో ప్రతి ఒక్క అక్షరం తో ప్రారంభం అయ్యేలా వర్ణించే అక్షర మాలాస్తవం లేదా ‘సాంబ సదాశివ స్తోత్రం’ సేకరించి ఇక్కడ పొందు పరచాను. ఇందులో ఋ, ఋ ల తరువాత వచ్చే అలు, అలూ లకు ప్రస్తుతం ఉన్న లిపిలో అక్షరాలు లేవు. బహుశా ఇవి వాడుకలో లేక పోవడం వలనేమో. వాటి స్థానే ళు, ళూ లు ఉపయోగించ వలసి వచ్చింది. ఈ శివ అక్షర మాలా స్తవం ఎవరు వ్రాసారో తెలియదు. కాని మన అక్షర మాలలోని ఇంచు మించు ప్రతి ఒక్క అక్షరం తో ప్రారంభం అయ్యేలా ఈ స్తోత్రాన్ని రచించడం అపూర్వమైన విషయం.

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!