Home » Stotras » Sri Venkatesha Mangala Stotram

Sri Venkatesha Mangala Stotram

శ్రీ వేంకటేశ మంగళ స్తోత్రం (Sri Venkatesha Mangala Stotram)

శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినామ్
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్. ||1||
అర్ధము: లక్ష్మీదేవి భర్తయును, కళ్యాణ గుణములకు నిధియును, శరణార్థులకు రక్షకుడును, వేంకటాచలనివాసియు నగు శ్రీనివాసునకు మంగళ మగును గాక.

లక్ష్మీ సవిభ్రమాలోక సభ్రూ విభ్రమ చక్షుషే
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్. ||2||
అర్ధము: లక్ష్మీదేవిని విలాసముగా చూచునట్టియు, చక్కని కనుబొమలు కల్గినట్టి నేత్రములు కలవాడును, సమస్త లోకములకును కన్నువంటివాడును అగు వేంకటేశ్వరునకు మంగళమగు గాక.

శ్రీ వేంకటాద్రి శృంగాగ్ర మంగళాభర ణాంఘ్రయే
మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్. ||3||
అర్ధము: శ్రీ వేంకటాచల శిఖరాగ్రమునకు చక్కని యాభరణమైన పాదములు కలవాడును, సమస్త మంగళములకు నిలయమైనవాడును అగు శ్రీ వేంకటేశవ్రునకు మంగళమగు గాక.

సర్వావయవ సౌందర్య సంపదే సర్వచేతసాం
సదా సమ్మోహనా యాస్తు వేంకటేశాయ మంగళమ్. ||4||
అర్ధము: సర్వావయవముల యొక్క సౌందర్య సంపదచే సమస్త ప్రాణులకును సమ్మోహమును కల్గించునట్టి శ్రీ వేంకటేశ్వరునికి మంగళమగు గాక.

నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే
సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్. ||5||
అర్ధము: నిత్యుడు, దోషములు లేనివాడు, సత్య స్వరూపుడు, చిదానందరూపుడు, సర్వాంతర్యామియు అగు
శ్రీవేంకటేశ్వరునికి మంగళమగు గాక.

స్వత స్సర్వ విదే సర్వశక్తయే సర్వ శేషిణే
సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళమ్. ||6||
అర్ధము: స్వభావము చేతనే సమస్తము ఎరిగినవాడు, సర్వసమర్థుడు, సర్వమునకు నియంతయైనవాడు, సులభుడు, సుస్వభావము కలవాడు నగు శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.

పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే
ప్రయుంజే పరతత్త్వాయ వేంకటేశాయ మంగళమ్. ||7||
అర్ధము: పరబ్రహ్మస్వరూపుడు, నిండిన కోరికలు కలవాడు, పరమాత్మయు అగు శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.

అకాల తత్త్వ విశ్రాంత మాత్మనా మనుపశ్యతామ్
అతృప్త్యమృత రూపాయ వేంకటేశాయ మంగళమ్. ||8||
అర్ధము: కాలతత్త్వమును గమనింపక, ఎల్లపుడును తన్ను చూచుచున్న జీవాత్మలకు తనివితీరని అమృత స్వరూపుడగు శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.

ప్రాయః స్వ చరణౌ పుంసాం శరణ్య త్వేన పాణినా
కృపయా దృశ్యతే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్. ||9||
అర్ధము: పురుషులందరికిని తన పాదములే శరణమని వారియెడల గల దయచే తఱచుగా తన హస్తముతో చూపుచున్న శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.

దయామృత తరంగిణ్యా స్తరంగై రివ శీతలైః
ఆపాంగై స్సించతే విశ్వం వేంకటేశాయ మంగళమ్. ||10||
అర్ధము: దయ యనెడి అమృత ప్రవాహము నందలి అలల వలె చల్లనైన తన కటాక్షములను వ్యాపింప జేసి జీవ లోకమును చల్లపరచుచున్న శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.

స్ర గ్భూషాంబర హేతీనాం సుష మావహ మూర్తయే
సర్వార్తి శమనాయాస్తు వేంకటేశాయ మంగళమ్. ||11||
అర్ధము: తాను ధరించిన పూలమాలలవలనను, నగల వలనను, వస్త్రములవలనను, ఆయుధములవలనను, ప్రకాశించు సుందర విగ్రహము కలవాడును, సమస్త బాధలను పోగొట్టువాడును అగు శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.

శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామిపుష్కరిణీ తటే
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్. ||12||
అర్ధము: శ్రీ వైకుంఠ నివాసమున విరక్తిని పొంది, స్వామి పుష్కరిణీ తీరమునకు వచ్చి, అచట లక్ష్మీదేవితో కూడ వినోదించుచున్న శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.

శ్రీమత్సుదరజామాతృ మునిమానస వాసినే
సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్. ||13||
అర్ధము: శ్రీమణవాళ మహర్షి యొక్క మనసునందును, సమస్త జీవరాసులయందును నివసించునట్టి శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక!

నమ శ్శ్రీవేంకటేశాయ శుద్ధజ్ఞాన స్వరూపిణే
వాసుదేవాయ శాంతాయ వేంకటేశాయ మంగళమ్. ||14||
అర్ధము: శుద్ధజ్ఞాన స్వరూపుడు, శాంతుడు, వాసుదేవుడు శ్రీ కి నివాసస్థానమైన శ్రీ వేంకటేశ్వరునికి మంగళమగు గాక.

మంగళా శాసన పరై ర్మదాచార్య పురోగమైః
సర్వైశ్చ పూర్వై రాచార్యై స్సత్కృపాయాస్తు మంగళమ్. ||15||
అర్ధము: మంగళాశాసనమును చేయుచున్న మా గురువును, సమస్త పూర్వాచార్యులును ఆరాధించు శ్రీనివాసునకు మంగళమగు గాక.

Sri Ganesha Pancharatna Stotram

శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం (Sri Ganesha Pancharatna Stotram) ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్ కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్ నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ || 1 || నతేతరాతి...

Sri Bala Tripura Sundari Stotram

శ్రీబాలాత్రిపురసుందరీ స్తోత్రం(ri Bala Tripura Sundari Stotram) భైరవ ఉవాచ అధునా దేవి ! బాలాయాః స్తోత్రం వక్ష్యామి పార్వతి ! । పఞ్చమాఙ్గం రహస్యం మే శ్రుత్వా గోప్యం ప్రయత్నతః ॥ వినియోగ ఓం అస్య శ్రీబాలాత్రిపురసున్దరీస్తోత్రమన్త్రస్య శ్రీ దక్షిణామూర్తిః...

Sri Lalitha Hrudaya Stotram

శ్రీ లలితాహృదయస్తోత్రమ్(Sri lalitha Hrudaya Stotram) అథశ్రీలలితాహృదయస్తోత్రం.! శ్రీలలితాంబి కాయై నమః । దేవ్యువాచ । దేవదేవ మహాదేవ సచ్చిదానన్దవిగ్రహా । సున్దర్యాహృదయం స్తోత్రం పరం కౌతూహలం విభో ॥ ౧॥ ఈశ్వరౌవాచ.! సాధు సాధుత్వయా ప్రాజ్ఞే లోకానుగ్రహకారకం । రహస్యమపివక్ష్యామి సావధానమనాఃశృణు...

Chatush Ashtakam

చతుష్షష్ట్యకం (Chatush Ashtakam) దేవదేవ జగతాంపతే విభో భర్గ భీమ భవ చంద్రభూషణ | భూతనాథ భవభీతిహార్క నతోస్మి నతవాంఛితప్రద || 1 || చంద్రచూడ మృడ దూర్జటే హరత్ర్యక్ష దక్ష శత తంతుశాతన | శాంత శాశ్వత శివాపతే శివ త్వాం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!