శివ అక్షరమాల స్తోత్రం (Shiva Aksharamala Stotram )

సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||

అద్భుతవిగ్రహ అమరాధీశ్వర, అగణితగుణగణ అమృతశివ
ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశశివ |
ఇందుకళాధర ఇంద్రాదిప్రియ, సుందరరూప సురేశశివ
ఈశసురేశమహేశ జనప్రియ, కేశవసేవిత పాదశివ … సాంబ |

ఉరగాదిప్రియ భూషణ శంకర, నరకవినాశ నటేశశివ
ఊర్జితదానవనాశ పరాత్పర, ఆర్జిత పాపవినాశశివ
ఋగ్వేదశ్రుతి మౌళి విభూషణ, రవిచంద్రాగ్ని త్రినేత్రశివ
ౠపమనాది ప్రపంచ విలక్షణ, తాపనివారణ తత్వశివ .. | సాంబ |

లింగస్వరూప సర్వ బుధప్రియ మంగళ మూర్తి మహేశశివ
ళూతాధీశ్వర రూపప్రియశివ వేదాంతప్రియ వేద్యశివ
ఏకానేక స్వరూప విశ్వేశ్వర లోహిహృదిప్రియ వాసశివ
ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన అచ్యుతానంత మహేశశివ | సాంబ |

ఓంకారప్రియ ఉరగవిభూషణ, హ్రీంకారాది మహేశశివ
ఔరసలాలిత అంతకనాశన, గౌరిసమేత గిరీశశివ
అంబరవాస చిదంబరనాయక, తుంబురునారద సేవ్యశివ
ఆహారప్రియ ఆదిగిరీశ్వర, భోగాదిప్రియ పూర్ణశివ | సాంబ |

కమలాక్షార్చిత కైలాసప్రియ, కరుణాసాగర కాంతిశివ
ఖడ్గశూల మృగ ఢక్కాధ్యాయుత, విక్రమరూప విశ్వేశశివ
గంగాగిరిసుత వల్లభ గుణహిత, శంకరసర్వ జనేశశివ
ఘాతకభంజన పాతకనాశన, గౌరీసమేత గిరిశశివ | సాంబ |

జ్ఞజ్ఞాశ్రిత శృతిమౌళి విభూషణ, వేదస్వరూప విశ్వేశశివ
చండ వినాశన సకల జనప్రియ, మండలాధీశ మహేశశివ
ఛత్రకిరీట సుకుండలశోభిత, పుత్రప్రియ భువనేశశివ
జన్మజరామృతి నాశనకల్మష, జరహితతాప వినాశశివ | సాంబ |

ఝంకారాశ్రయ భృంగిరిట ప్రియ, ఒంకారేశ మహేశశివ
జ్ఞానాజ్ఞాన వినాశక నిర్మల, దీనజనప్రియ దీప్తశివ
టంకాధ్యాయుత ధారణ సత్వర, హ్రీంకారాది సురేశశివ
ఠంకస్వరూప సహకారోత్తమ, వాగీశ్వర వరదేశశివ | సాంబ |

డంభ వినాశన డిండిమభూషణ, అంబరవాస చిదీశశివ
ఢంఢం డమరుక ధరణీనిశ్చల, ఢుంఢి వినాయక సేవ్యశివ
నళిన విలోచన నటనమనోహర, అళికులభూషణ అమృతశివ
తత్వమసిత్యాది వాక్య స్వరూపగ, నిత్యానంద మహేశశివ ..| సాంబ |

స్థావరజంగమ భువనవిలక్షణ, భావుక మునివర సేవ్యశివ
దుఃఖవినాశన దళితమనోన్మన, చందనలేపిత చరణశివ
ధరణీధర శుభధవళ విభాస్వర, ధనదాది ప్రియ దానశివ
నానామణిగణ భూషణ నిర్గుణ, నటన జనప్రియ నాట్యశివ | సాంబ |

పన్నగభూషణ పార్వతినాయక, పరమానంద పరేశశివ
ఫాలవిలోచన భానుకోటి ప్రభ, హాలాహలధర అమృతశివ
బంధవినాశన బృహదీసామర, స్కందాదిప్రియ కనకశివ
భస్మవిలేపన భవభయనాశన, విస్మయరూప విశ్వేశశివ | సాంబ |

మన్మథనాశన మధుపానప్రియ, సుందర పర్వతవాసశివ
యతిజన హృదయ నివాసిత ఈశ్వర విధి విష్ణ్వాది సురేశశివ
రామేశ్వర రమణీయ ముఖాంబుజ, సోమేశ్వర సుకృతేశశివ
లంకాధీశ్వర సురగణసేవిత, లావణ్యామృత లసితశివ | సాంబ |

వరదాభయకర వాసుకిభూషణ, వనమాలాది విభూషశివ
శాంతిస్వరూప జగత్రయ చిన్మయ కాంతిమతిప్రియ కనకశివ
షణ్ముఖజనక సురేంద్రమునిప్రియ, షాడ్గుణ్యాది సమేతశివ
సంసారార్ణవ నాశన శాశ్వత, సాధుహృది ప్రియవాసశివ | సాంబ |

హర పురుషోత్తమ అద్వైతామృత, పూర్ణమురారి సుసేవ్యశివ
ళాళితభక్త జనేశనిజేశ్వర, కాళినటేశ్వర కామశివ
క్షరరూపాది ప్రియాన్వితసుందర, సాక్షిజగత్రయ స్వామిశివ

సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!